ఉక్రెయిన్‌కు యూఎస్ తయారు చేసిన MQ-1C గ్రే ఈగల్ సాయుధ డ్రోన్‌ల ప్రపోజ్డ్ సేల్ ప్రాముఖ్యతను ఇద్దరు ఉక్రెయిన్ వైమానిక దళ పైలట్లు ప్రశ్నించారు. రష్యా బలమైన వాయు రక్షణకు వ్యతిరేకంగా టర్కిష్-బిల్డ్ బైరక్టార్ TB2 UAVలు కూడా పనికిరానివిగా మారాయని పైలట్లు చెప్పారు. F-16ల వంటి అధునాతన పాశ్చాత్య యుద్ధ విమానాలు కీవ్‌కు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని ఉక్రెయిన్ ఫైటర్ పైలట్లు వివరించారు.
* ఉక్రెయిన్ కోసం MQ-1C గ్రే ఈగల్?
ఉక్రెయిన్‌కు నాలుగు MQ-1Cలు విక్రయించే అంశంపై ముందుకు వెళ్లాలని యూఎస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ నెల ప్రారంభంలో ఉక్రెయిన్‌కు వాషింగ్టన్ ప్రకటించిన 700 మిలియన్ల డాలర్ల సైనిక ప్యాకేజీలో భాగంగానే MQ-1Cల విక్రయం జరుగుతుంది. పూర్తి యూఎస్ సైనిక ప్యాకేజీలో AGM-114 హెల్‌ఫైర్ ప్రెసిషన్-గైడెడ్ మిసైల్స్, ఇతర పరికరాలు విక్రయిస్తారు. MQ-1Cలో శక్తివంతమైన ఇంటర్నల్ సెన్సార్‌లు, రాడార్‌లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌ల వంటి ఎక్స్‌టర్నల్ పాడెడ్ సిస్టమ్ సదుపాయాలు ఉన్నాయి.
ఏప్రిల్‌లో గ్రే ఈగల్స్ కొనుగోలు గురించి జనరల్ అటామిక్స్‌తో ప్రత్యక్ష సంప్రదింపుల్లో ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. యూఎస్ ప్రభుత్వం ఆమోదిస్తే, మానవ రహిత విమానాలను బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని MQ-1C తయారీదారు చెప్పారు. అయితే, శిక్షణకు సంబంధించిన ఆందోళనలు, రష్యా చేతుల్లోకి టెక్నాలజీ చేరుతుందనే భయాలతో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
* MQ-1C గ్రే ఈగల్ ఫీచర్లు
రెక్కలు - 56 అడుగులు
బరువు - 3,600 పౌండ్లు
గరిష్ట వేగం - 150 నాట్స్
ఎత్తు - 25,000 అడుగులు
ఆల్టిట్యూడ్- 27 గంటలు
ER కాన్ఫిగరేషన్‌లో 40 గంటలకు మించి గాలిలో ఉండగల సామర్థ్యం
* ఎందుకు గ్రే ఈగిల్స్ గేమ్‌ఛేంజర్ కాకపోవచ్చు?
గ్రే ఈగల్ డ్రోన్‌లు ఎక్కువ దూరం నుంచి నిఘా ఉంచడానికి మాత్రమే ఉపయోగపడతాయని, దాడులు చేసేందుకు పనికిరావని పైలేట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా ఎయిర్ డిఫెన్స్, గ్రే ఈగల్ మోసుకెళ్ళే మిసైల్ పరిధిని తెలుసుకోవాలని, కనిపించిన కొన్ని క్షణాల్లోనే MQ-1Cను కాల్చి వేస్తారని ఉక్రెయిన్ పైలట్ చెప్పారు. సమర్థవంతమైన ప్లాట్‌ఫారమ్ అయినప్పటికీ, ఉక్రెయిన్‌లో ఫ్రంట్‌లైన్‌లో గ్రే ఈగిల్‌ను ఉపయోగించడం ప్రమాదకరమని ఉక్రెయిన్ పైలట్ లు తెలిపారు. ఇది చాలా సామర్థ్యం గల ప్లాట్‌ఫారమ్ అని, కానీ కేవలం ముందు వరుసలో ఉపయోగించడం చాలా ప్రమాదకరమని, ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదని పైలట్లు ఆరోపణలు చేశారు. రష్యా వైమానిక రక్షణ నుంచి ముప్పు ఉండటంతో ఇప్పటికే TB2 వంటి డ్రోన్ల వినియోగాన్ని ఉక్రెయిన్ తగ్గించిందని పైలట్లు వివరించారు.
రష్యా దండయాత్ర కీవ్ చేరుకోకుండా ఆపడంలో ముఖ్యమైన పాత్రను బైరక్టార్ TB2 డ్రోన్లు పోషించాయి. అయినప్పటికీ, మాస్కో ఇప్పుడు మంచి ఎయిర్ డిఫెన్స్‌ను నిర్మించిందని, ఇది డ్రోన్‌లను దాదాపు నిరుపయోగంగా మార్చేసిందని చెబుతున్న ఉక్రెయిన్ పైలట్లు చెబుతున్నారు. యూఎస్ సరఫరా చేసిన స్విచ్‌బ్లేడ్, ఫీనిక్స్ ఘోస్ట్ కంటే గ్రే ఈగల్ మెరుగైనవి కాదని, వాటితో ప్రయోజనం లేదని ఓ ఉక్రెయిన్ అధికారి పేర్కొన్నారు.
* ఉక్రెయిన్‌కు మోడర్న్ ఫైటర్స్ అవసరం
F-16ల వంటి మోడర్న్ కాంబాట్ జెట్‌లను, అలాగే అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను కొనుగోలు చేయాలని ఉక్రెయిన్ పైలట్లు చెబుతున్నారు.రష్యా క్రూయిజ్ మిసైల్స్ వల్ల ఏర్పడే ముప్పు, ఉక్రెయిన్‌లు ఈ వ్యవస్థలను పొందాలను కోవడానికి ప్రధాన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. చాలా మార్గాల్లో వెనకబడ్డామని, విమానంతో మాత్రమే కాకుండా మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, ఎయిర్ టూ గ్రౌండ్ మిసైల్స్‌తో రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ పైలట్‌లు తెలిపారు. ఇంధన నిల్వలు, ధాన్యం నిల్వలు, రైలు మార్గాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, క్రూయిజ్ మిసైల్స్ రాడార్ లాక్ ఉండటం అసాధ్యమని పైలట్లు చెప్పారు.
యువ ఉక్రెయిన్ పైలట్‌లను మరింత ఆధునిక పాశ్చాత్య జెట్‌లను నడిపేందుకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని పైలట్లు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ వైమానిక దళంలో ప్రస్తుతం విమానాల కంటే ఎక్కువ మంది పైలట్లు ఉన్నారని ఓ పైలట్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తూర్పు ఉక్రెయిన్‌లో రష్యాతో పోరాడటానికి అదనపు సోవియట్ యుగం నాటి జెట్‌లను పొందడానికి ఉక్రెయిన్ తమ వంతు ప్రయత్నం చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War