హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia Ukraine War: ముగింపు దిశగా యుద్ధం!.. రష్యాతో ఉక్రెయిన్ శాంతి చర్చలు షురూ.. అజెండా ఇదే.

Russia Ukraine War: ముగింపు దిశగా యుద్ధం!.. రష్యాతో ఉక్రెయిన్ శాంతి చర్చలు షురూ.. అజెండా ఇదే.

ఉక్రెయిన్, రష్యా చర్చలు

ఉక్రెయిన్, రష్యా చర్చలు

రష్యా-ఉక్రెయిన్ సమరంలో ఎట్టకేలకు శాంతి రేఖ వెలుగుచూసింది. యుద్దం దాదాపుగా ముగింపు మలుపు తీసుకుంది. ర‌ష్యాతో చ‌ర్చ‌ల‌కు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఎట్టకేలకు అంగీక‌రించారు. బెలార‌స్‌ చర్చలకు వేదికైంది..

యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న రష్యా-ఉక్రెయిన్ సమరంలో ఎట్టకేలకు శాంతి రేఖ వెలుగుచూసింది. యుద్దం దాదాపుగా ముగింపు మలుపు తీసుకుంది. ఇన్నాళ్లూ చర్చలకు మొండికేసిన ఉక్రెయిన్.. రష్యా దురాక్రమణ తీవ్రతరం కావడంతో తగ్గక తప్పలేదు. ఉక్రెయిన్ ఆక్రమణే ప్రధాన లక్ష్యం అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం దారికొచ్చి, అదుపులో ఉంటే చాలన్న ఉద్దేశంతోనే రష్యా చర్చల ప్రతిపాదన ముందుకు తెచ్చింది.  ఉక్రెయిన్ బెలారస్ సరిహద్దులోని గోమెల్‌లో సోమవారం ఉదయం నుంచి చర్చలు కొనసాగుతాయని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వేదిక విషయంలో తొలుత బెట్టుచేసిన ఉక్రెయిన్ చివరికి దిగిరాక తప్పలేదు. కాగా, ఓవైపు చర్చల ప్రక్రియ మొదలైనప్పటికీ, రెండు దేశాల సైన్యాల మధ్య పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. వివరాలివే..

పట్టువీడిన  జెలెన్‌స్కీ

ర‌ష్యాతో చ‌ర్చ‌ల‌కు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు  జెలెన్‌స్కీ ఎట్టకేలకు అంగీక‌రించారు. బెలార‌స్‌లో ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని ర‌ష్య‌న్ మీడియా మాస్కోలో ప్ర‌క‌టించింది. చ‌ర్చ‌ల కోసం ఉక్రెయిన్ బృందం ఇప్పటికే బెలారస్ బ‌య‌లుదేరింది. రష్యా ప్రతినిధులు కొంతకాలంగా బెలారస్ లోనే మకాం వేసి ఉక్రెయిన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. బెలార‌స్‌లోని గోమెల్‌లో ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా,

Actress Srabanti: ప్రముఖ హీరోయిన్‌పై కేసు నమోదు.. అలా చేయడం తప్పని తెలీదట!


చర్చలు రష్యాకు కూడా అవసరమే

ఉక్రెయిన్, రష్యా చర్చల్లో ‘నాటోలో చేరిక’ అంశం ప్రధానం కానుంది. అమెరికా అనుకూల నాటో కూటమిలో గనుక ఉక్రెయిన్ చేరితే, అది రష్యా భద్రతకు పెను ముప్పులా మారుతుందని, నాటో స్థావరంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి అమెరికా యుద్ధ సామాగ్రిని తరలిస్తుందని రష్యా తొలి నుంచీ వాదిస్తోంది. దాన్ని నివరించడంతోపాటు పక్కలో బల్లెంగా ఉన్న ఉక్రెయిన్ మొత్తాన్నీ కలిపేసుకోవాలనే లక్ష్యంతో రష్యా యుద్దానికి దిగింది. అనూహ్యరీతిలో అప్పటిదాకా ఉక్రెయిన్ కు మద్దతిచ్చిన పశ్చిమ దేశాలన్నీ వెనుకడుగు వేయడం, రష్యాపై ఆర్థిక ఆంక్షలకే తప్ప సైనిక చర్యకు వెనుకాడటంతో ఉక్రెయిన్ ఒటరైపోయిన సంగతి తెలిసిందే. ఈ దశలో మొదలైన శాంతి చర్చల్లో ఉక్రెయిన్ మెడలు వంచేందుకు రష్యా ప్రయత్నించనుంది.

CM KCR ఫామ్‌హౌజ్‌లో Prashant Kishor -తెలంగాణలో ముందస్తు ఎన్నికలు! -TRS భారీ వ్యూహం


బెలారస్ వేదికగా చర్చలు

శాంతి చర్చల కోసం రెండు దేశాల బృందాలు బెలారస్ చేరిన క్రమంలో కాల్పుల విమరణ ప్రకటిస్తారా? లేక చర్చలు ముగిసేదాకా యుద్ధాన్ని కొనసాగిస్తారా? అనేది  వెల్లడికానుంది. చర్చల బృందంలో రష్యా, ఉక్రెయిన్ ల సైనిక, విదేశాంగ, అంతర్గత శాఖల అధికారులు, రాయబారులు ఉంటారు. మధ్యవర్తిగా బెలారస్ దేశ ప్రతినిదులు కూడా చర్చల్లో పాల్గొంటారు. ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులు జెలెన్‌స్కీ, పుతిన్ చర్చలకు హాజరయ్యేది అనుమానమే. అయితే చర్చలు సఫలమైతే గనుక ఇరు దేశాధినేతలు కలుసుకునే అవకాశాలున్నాయి. అయితే,

Russia Ukraine War: యుద్దానికి అసలు కారణం ఇదే -ఆ దేశం సూపర్ పవర్ హోదా గల్లంతు!


పుతిన్ సుదీర్గ స్ట్రాటజీ

గతంలో క్రిమియాను ఆక్రమించిన సమయంలోనూ రష్యా కేవలం 36 రోజుల యుద్ధాన్ని చేసింది. అప్పుడు కూడా శాంతి చర్చలు జరిగాయి. పలు ఒప్పందాలు కుదిరి దరిమిలా కాలక్రమంలో క్రిమియాను రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. మరిప్పుడు ఉక్రెయిన్ విషయంలోనూ అదే జరుగుతుందా? వైశాల్యం రీత్యా పెద్దదైన ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా ఇప్పటికిప్పుడు స్వాధీనంలోకి తీసుకున్నా, పౌరుల నుంచి వ్యతిరేకత పెల్లుబికే అవకాశాలున్నాయి కాబట్టి చర్చల్లో ఉక్రెయిన్ ను మడతపెట్టేసి, రాబోయే కాలంలో ఆధిపత్యపు పడగ విప్పాలన్నది పుతిన్ ఆలోచనగా తెలుస్తోంది.

ఆటగదరా శివ! -బయట బాంబుల వర్షం.. బంకర్‌లో పురుడుపోసుకున్న మహిళ: Russia Ukraine war


చర్చలు మొదలవుతున్నా ఆగని యుద్ధం

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం గత గురువారం మొదలుకాగా.. నాలుగురోజైన ఆదివారం కూడా పలు నగరాల్లో విధ్వంసం కొనసాగింది. సైనికులు, పౌరుల మరణాలపై రెండు దేశాలూ భిన్న ప్రకటనలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌తో స‌హా ప‌లు న‌గ‌రాల‌ను ర‌ష్యా సైనికులు హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. యుద్ధం వ‌ల్ల ఉక్రెయిన్‌కు చాలా న‌ష్టం వాటిల్లింది. లక్షల మంది ఉక్రెయిన్ వాసులు.. త‌మ ఇళ్లు వ‌దిలి ప్రాణ‌భ‌యంతో పొరుగు దేశాల‌కు వ‌ల‌స వెళ్లారు.

Prashant Kishor: కారెక్కిన ప్రశాంత్ కిషోర్! -KCR దూతతో విస్తృత పర్యటన -షాకింగ్ ట్విస్ట్!


రష్యాపై ఐసీజేలో ఉక్రెయిన్ కేసు

దండయాత్రకు దిగిన రష్యా సైనిక దళాలను ఉక్రెయిన్‌ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. రాజధాని కీవ్‌ తర్వాత రెండో ప్రధాన నగరమైన ఖార్కివ్‌ నుంచి రష్యా దళాలను తరిమికొట్టింది. ఆ నగరాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. రష్యాపై అంతర్జాతీయ కోర్టులోనూ కేసు వేసింది ఉక్రెయిన్. మరి శాంతి చర్చలతో ఇవన్నీ సర్దుమణుగుతాయా? లేదా? చూడాలి.

Published by:Madhu Kota
First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు