హోమ్ /వార్తలు /international /

Russia Ukraine War: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారత విద్యార్థి.. పేరెంట్స్ గగ్గోలు

Russia Ukraine War: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారత విద్యార్థి.. పేరెంట్స్ గగ్గోలు

కానీ ఇంకొందరు మాత్రం విధిలేని స్థితిలో, మరికొందరు స్వచ్ఛందంగా ఉక్రెయిన్ లోనే ఉండిపోయారు. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి అయితే ఏకంగా ఉక్రెయిన్ సైన్యంలో చేరిపోవడం సంచలనంగా మారింది.

    రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia Ukraine War) మూడో వారంలో మరింత ఉధృతంగా సాగుతోంది. ఉక్రెయిన్ లోని కీలక పట్టణాలు, సైనిక స్థావరాలపై భీకర దాడులు చేస్తూ పుతిన్ బలగాలు ముందుకుపోతుండగా, పెద్ద ఎత్తున రష్యా సైనికులను, ఉన్నతాధికారులనూ మట్టుపెట్టామని ఉక్రెయిన్ బలగాలు ప్రకటించుకుంటున్నాయి. ఇప్పటికే వేలాది భవనాలు ధ్వంసమైపోగా, అందులో 200కుపైగా స్కూళ్లు, 30కిపైగా ఆస్పత్రులూ ఉన్నట్లు సమాచారం. శాంతి చర్చలు విఫలమవుతోన్న క్రమంలో రక్తపాతం మరింతగా పెరుగుతున్నది. ఉక్రెయిన్ లో చిక్కుపోయిన భారతీయుల్లో దాదాపు అందరినీ స్వదేశానికి రప్పించింది కేంద్రం. కానీ ఇంకొందరు మాత్రం విధిలేని స్థితిలో, మరికొందరు స్వచ్ఛందంగా అక్కడే ఉండిపోయారు. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి అయితే ఏకంగా ఉక్రెయిన్ సైన్యంలో చేరిపోవడం సంచలనంగా మారింది.

    మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన సాయినికేషన్ రవిచంద్రన్ అనే తమిళనాడు విద్యార్థి రష్యా దండయాత్ర నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు అతను ఉక్రెయిన్‌లోని పారామిలటరీ దళంలో చేరాడు. ఈ మేరకు కుటుంబీకులకు సమాచారం అందడంతో వాళ్లు ఆందోళనగకు గురయ్యారు. సాయినికేష్ వ్యవహారాన్ని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా పరిగణిస్తూ దర్యాప్తు చేసింది.

    CM KCRకు భిన్నంగా మంత్రి KTR -విరోధులతోనూ ఆత్మీయ ఆలింగనం -ఈటల ముఖం చూడొద్దనే సస్పెన్షన్?

    తమిళనాడుకు చెందిన సాయినికేషన్.. 2018లో ఉక్రెయిన్ లోని ఖార్కివ్‌ నగరంలో గల నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చేరాడు. అతని మెడిసిన్ కోర్సు ఈఏడాది జులైతో ముగియనుంది. నాలుగేళ్లు ఉక్రెయిన్ తో ఉన్న అనుబంధంతో ఇప్పుడతను రష్యాకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఉక్రెయిన్ పారామిలటరీ బలగాలతో కలిసి సాయినికేష్ దిగిన ఫొటోలు ఇప్పుడు వైరలవుతున్నాయి.

    Russia Ukraine war: పుతిన్‌, జెలెన్‌స్కీకి PM Modi ఫోన్ కాల్.. కీలక సూచన -అలా చేస్తే యుద్ధం ఆగేనా!

    సాయినికేష్ తన కుటుంబంతో కమ్యూనికేషన్ కోల్పోయిన తర్వాత, వారు భారత రాయబార కార్యాలయం సహాయం కోరారు. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులు ఎట్టకేలకు సాయినికేష్ ను సంప్రదించగలిగారు. తాను రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలటరీ దళంలో చేరినట్లు సాయినికేష్ తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే అతణ్ని ఎలాగైనా ఒప్పించి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    First published:

    ఉత్తమ కథలు