హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia Ukraine War: 10 రోజుల్లోనే కిమ్‌ను పక్కకు నెట్టేసిన పుతిన్.. ఆంక్షల్లో ఇప్పుడు రష్యా నం.1

Russia Ukraine War: 10 రోజుల్లోనే కిమ్‌ను పక్కకు నెట్టేసిన పుతిన్.. ఆంక్షల్లో ఇప్పుడు రష్యా నం.1

కిమ్ జోంగ్ తో పుతిన్ (పాత ఫొటో)

కిమ్ జోంగ్ తో పుతిన్ (పాత ఫొటో)

కిమ్, ఖొమేనీలను కేవలం 10 రోజుల్లోనే పక్కకు నెట్టేశారు పుతిన్. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోన్న కారణంగా రష్యాపై ప్రపంచదేశాలన్నీ తీవ్రమైన ఆంక్షలు విధించగా, ప్రస్తుతం అత్యధిక ఆంక్షలు ఉన్న దేశంగా రష్యా నంబర్1 స్థానానికి చేరింది. ఎలాగంటే..

ఇంకా చదవండి ...

కిమ్ జాగ్ ఉన్.. ప్రస్తుతం భూమ్మీద బతికున్న నియంతల్లో అత్యంత కరడుగట్టిన నేత. నిత్యం మిస్సైళ్లు, ఆటం బాంబులతో ఆటలాడుకునే ఈ ఉత్తరకొరియా అధినేత పేరు వింటేనే పశ్చిమదేశాలకు వణుకు. వివిధ రంగాలకు సంబంధించి కిమ్ దేశంపై గ్లోబల్‌గా వేలకొద్దీ ఆంక్షలున్నాయి. తాము మాత్రం తక్కువ కాదంటూ అలీ ఖొమేనీ పాలనలోని ఇరాన్ దేశం సైతం న్యూక్లియర్ టెస్టుల కారణంగా అసాధారణ ఆంక్షలను ఎదుర్కొంటున్నది. అయితే కిమ్, ఖొమేనీలను కేవలం 10 రోజుల్లోనే పక్కకు నెట్టేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోన్న కారణంగా (Russia Ukraine War) రష్యాపై ప్రపంచదేశాలన్నీ తీవ్రమైన ఆంక్షలు విధించగా, ప్రస్తుతం అత్యధిక ఆంక్షలు ఉన్న దేశాల జాబితాలో రష్యా నంబర్1 స్థానానికి చేరింది. ఎలాగంటే..

ఉక్రెయిన్‌ ఆక్రమణే లక్ష్యంగా యుద్దానికి దిగిన రష్యా అక్కడ భయానక మారణహోమాన్ని కొనసాగిస్తున్నది. ఫిబ్రవరి 24న మొదలైన యుద్దం ప్రస్తుతం మూడో వారంలోకి ప్రవేశించినా, ఉధృతి పెరుగుతోందే దప్ప తగ్గడంలేదు. ఉక్రెయిన్ లోని సైనిక స్థావరాలు, కీలక నగరాలపై రష్యా భీకరంగా బాంబుల వర్షం కురిపిస్తున్నది. సాధారణ పౌరుల ఇళ్లు, అపార్ట్మ్ంట్లపైకి కూడా మిస్సైళ్లు వదులుతున్నది. రష్యా దాడుల్లో 200కుపైగా చిన్నపిల్లల స్కూళ్లు, 30కిపైగా ఆస్పత్రులు ధ్వంసమైనట్లు వెల్లడైంది. యుద్ధం కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులున్నాయి. లక్షల మంది దేశం విడిచి వెళ్లడం చూస్తున్నదే. ఇంతటి మారణహోమాన్ని కొనసాగిస్తున్న రష్యాపై నేరుగా యుద్ధం చేయలేకపోతున్న పశ్చిమ దేశాలు.. ఆటంబాంబుకు ఏమాత్రం తక్కువ కాని ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి..

Russia Ukraine War: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారత విద్యార్థి.. పేరెంట్స్ గగ్గోలు


ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే అనేక దేశాలు రష్యాపై 2,700లకు పైగా ఆంక్షలు విధించాయి. ఇప్పటికే ఉన్న ఆంక్షలకు కొత్తవి తోడుకావడంతో రష్యాపై ఆంక్షల సంఖ్య 5530కు పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌, ఉత్తరకొరియా వంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయని Castellum.ai(ఆంక్షల డేటాబేస్ ట్రాకింగ్ సంస్థ), బ్లూమ్‌బర్గ్‌ మీడియా కథనాలను ప్రచురించింది. రష్యన్ బ్యాంకుల లావాదేవీల నిలిపివేత మొదలుకొని నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీలు సైతం సర్వీసులు బంద్ పెట్టడం దాకా అన్ని రకాల ఆంక్షలు ఇందులోకి వస్తాయి.

Russia Ukraine war: పుతిన్‌, జెలెన్‌స్కీకి PM Modi ఫోన్ కాల్.. కీలక సూచన -అలా చేస్తే యుద్ధం ఆగేనా!


ప్రస్తుతం రష్యాపై 5530 ఆంక్షలు ఉండగా.. ఇందులో సగానికి పైగా కేవలం గత 10 రోజుల్లో విధించనవే. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నాటికి రష్యాపై 2,774 ఆంక్షలు అమల్లో ఉండగా.. ఆ తర్వాత నుంచి మరో 2,778 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అత్యధికంగా స్విట్జర్లాండ్‌ దేశం రష్యాపై 568 ఆంక్షలు విధించింది. ఆ తర్వాత యురోపియన్ యూనియన్ 518, ఫ్రాన్స్‌ 512, అమెరికా 243 ఆంక్షలు విధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

CM KCRకు భిన్నంగా మంత్రి KTR -విరోధులతోనూ ఆత్మీయ ఆలింగనం -ఈటల ముఖం చూడొద్దనే సస్పెన్షన్?


రష్యా తర్వాత అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండో దేశంగా ఇరాన్‌ ఉంది. ఈ దేశంపై ప్రస్తుతం 3,616 ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ తర్వాత సిరియాపై 2,608, ఉత్తరకొరియాపై 2,077 ఆంక్షలు ఉన్న నివేదిక తెలిపింది. కాగా, భారీ ఆంక్షలు ఎదుర్కొంటున్న టాప్ నాలుగు దేశాల్లో ఉత్తరకొరియాకు అసలు ప్రపంచంతోనే సంబంధాల్లేవు. సిరియా కునారిల్లిపోయింది. ఇరాన్ చాలా పరిమితంగానే విదేశీ సంబంధాలు కొనసాగిస్తోంది. కానీ రష్యాకు మాత్రం దాదాపు అన్ని దేశాలతో బలమైన, స్థిరమైన ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, సైనిక సంబంధాలున్న దరిమిలా ఆ దేశంపై ఆంక్షలు మొత్తం ప్రపంచాన్నీ ప్రభావితం చేస్తున్నాయి.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

ఉత్తమ కథలు