ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం (Russia Ukraine war) మూడో వారంలోకి ప్రవేశించింది. లొంగుబాటుకు ఉక్రెయిన్ (Ukraine) ససేమిరా అంటుండటంతో రష్యా(Russia) దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ ఆయుధాలు వీడి, నాటోలో చేరబోమని గ్యారంటీ ఇస్తే తప్ప ఆక్రమణ ఆపబోమని పుతిన్(Putin).. రష్యా దురాక్రమణకు తలొంచబోమని జెలెన్స్కీ(Zelensky) వరుస దూకుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల ఒడిదుడుకులు, పెట్రో, గ్యాస్ ధరల పెరుగుదల కొనసాగుతుండగా, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విదేశీయుల తరలింపూ సవాలుగా మారింది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) రష్యా-ఉక్రెయిన్ లకు హితబోధ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో మోదీ సోమవారం నాడు విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలివే..
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభమే అజెండాగా వీరి సంభాషణ జరిగిందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విషయంపై కూడా వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న చర్చల గురించి కూడా పుతిన్ మోదీకి వివరించారు. ప్రస్తుతం అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అలా కాకుండా ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనే సంభాషించాలని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. ఇక
ఉక్రెయిన్‌లో యుద్దం కొనసాగుతోన్న కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటలపాటు కాల్పుల విమరణ, ప్రజల తరలింపు కోసం హ్యుమానిటీ కారిడార్ల ఏర్పాటుకు పుతిన్ సుముఖత వ్యక్తం చేయడాన్ని మోదీ ప్రశంసించారు. సుమీ ప్రాంతం నుంచి భారతీయులను సురక్షితంగా తరలించే విషయంపై కూడా మోదీ పుతిన్‌తో మాట్లాడారు. సుమీ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించే విషయంలో తమకు సహకరించాలని కోరగా, పుతిన్ అంగీకరించినట్లు తెలిసింది. భారతీయుల తరలింపులో తాము సహాయపడతామని మోదీకి హామీ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు,
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడటానికి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ జరిపారు. దాదాపు 35 నిమిషాల పాటు వీరు మాట్లాడుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో ప్రస్థుతం నెలకొన్న పరిస్థితి జెలెన్స్కీ మోదీకి వివరించారు. రష్యాతో ఉక్రెయిన్ చర్చల ప్రక్రియను భారత ప్రధాని అభినందించారు. యుద్దంలో చిక్కుకున్న భారతీయులను బయటికి తరలిచే ప్రక్రియలో ఉక్రెయిన్ సహకరించిన తీరును ప్రశంసిస్తూ.. జెలెన్స్కీకి మోదీ థ్యాంక్స్ చెప్పారు. మోదీ సూచనతో పుతిన్-జెలెన్స్కీ నేరుగా చర్చలు జరిపితేనైనా యుద్ధం ఆగుతుందా? లేదా? చూడాలిమరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Pm modi, Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin, Zelensky