ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ అంతులేని విధ్వంసం, భారీ ప్రాణనష్టంతో సాగిపోతున్నది. రష్యా అంచనాలు తలకిందులు కావడంతో యుద్దం (Russia Ukaraine War) నాలుగోనెలలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటికీ విజేత ఎవరనేది తేలలేదు. పోరాడితే పోయేదేమీ లేదన్న తరహాలో ఉక్రెయిన్ వీలైనన్ని తంత్రాలతో దూకుడు ప్రదర్శిస్తుండగా, రష్యా దీటుగానే బదులిస్తూ ఒక్కోనగరాన్ని వశం చేసుకుంటూ ముందుకెళుతున్నది. అయితే, ఉక్రెయిన్ సైన్యాల గెరిల్లా యుద్దతంత్రం రష్యన్ సేనలను బెంబేలెత్తిస్తున్నది..
ఉక్రెయిన్‌లో గెరిల్లా వార్ఫేర్ రష్యాకు సవాలుగా మారింది. ఉక్రెయిన్ విధ్వంసక గ్రూపులు, ప్రతిఘటన యోధులు రష్యన్ బలగాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ఆయుధాలతో ప్రతిఘటించే ఘటనలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మెలిటోపోల్‌లో ఎదురైన ప్రతిఘటన దాడులతో రష్యా సాయుధ రైలు పట్టాలు తప్పిందని ఉక్రెయిన్ చెబుతోంది. సిబ్బంది, మందుగుండు సామగ్రిని తీసుకువెళుతున్న రష్యా రైల్రోడ్ కార్లను పేల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ తెలిపారు. తరచూ మెషిన్ గన్ల కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానిక వార్తా సంస్థలూ ధృవీకరిస్తున్నాయి.
CM Jagan | Davos : దావోస్ మార్గంలో దారి మళ్లిన జగన్? -భార్యతో కలిసి సీఎం అక్కడికి వెళ్లారా?
మెలిటోపోల్‌లో జరుగుతున్న ప్రతిఘటన దాడుల్లో రష్యా అత్యున్నత స్థాయి సైనికులు ఇద్దరు మృతి చెందినట్లు జాపోరిజ్జియా మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. జాపోరిజ్జియాలోని రష్యన్ సైనికులు "ఉక్రేనియన్ విధ్వంసక సమూహాలు" గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్లున్న సంభాషణ బహిర్గతం అయింది. వేగంగా, సులభంగా ముగిసిపోతుందని భావించిన యుద్ధం.. సుదీర్ఘమైన రక్తపాతంగా మారిందని విశ్లేషణలు అంటున్నారు. పశ్చిమ దేశాలు పంపిన ఆయుధాలు ఒకఎత్తయితే, ఉక్రెయిన్ గెరిల్లా తరహా ఎదురుదాడులతో పుతిన్ సేనలు షాక్ తింటున్నాయి.
ఇర్పిన్, కీవ్ నుంచి ఖార్కివ్ వరకు శత్రువులను తిప్పికొట్టడంలో, ఆక్రమణదారుల నుంచి భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధ వ్యూహాలనుఅమలు చేస్తున్నది. రాజధాని కీవ్‌లోకి ప్రవేశించడానికి, ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇర్పిన్ వంతెన సులువైన మార్గం గా రష్యా దళాలు భావించగా, ఆ వంతెనలను పేల్చేయడం ద్వారా రష్యా సేనలు సులువుగా ముందుకు కదలనీయుకుండా చేసింది ఉక్రెయిన్. ఆక్రమణదారులకు చుట్టూ తిరిగి రావడంతో.. ఉక్రెయిన్ షెల్లింగ్, యాంటీ ట్యాంక్ ఆయుధాలతో దాడులు చేస్తున్నది. అనేక ప్రదేశాలలో రష్యన్ దళాలను హైలీ మోటివేటెడ్ ఉక్రెయిన్ యూనిట్లు నిలువరించాయి.
లాజిస్టిక్స్, పేలవమైన సరఫరా, కొరవడిన స్థానిక జ్ఞానం, తక్కువ ధైర్యం వంటి రష్యా దుర్బలత్వాలను ఉక్రేనియన్లు ఉపయోగించుకొంటున్నారు. రష్యా- ఆక్రమిత నగరాల్లో పౌరుల నిరసనలు, మోలోటోవ్ కాక్టెయిల్స్ తయారీ, టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్‌లో చేరడానికి యువత ఉత్సాహం చూపుతోంది. మార్చిలో ఉక్రేనియన్ గెరిల్లాలు ఖార్కివ్ సమీపంలో ట్రక్కుల కాన్వాయ్‌ను ధ్వంసం చేసినట్లు నివేదికలున్నాయి. మార్చి 11న ఉక్రేనియన్ గ్రామస్తులు 29 మంది రష్యన్ సైనికులను ఖైదీలుగా పట్టుకునేందుకు పోలీసులకు సహాయం చేసినట్లు సమాచారం. ఇర్పిన్, కీవ్, ఖార్కివ్ నుంచి దండయాత్ర దళాలను తరిమికొట్టడానికి ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధం తోడ్పడింది.
ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఖెర్సన్‌లో కూడా ప్రతిఘటన పెద్ద సవాలుగా మారింది. శక్తివంతమైన ప్రతిఘటన , సాంప్రదాయేతర యుద్ధ వ్యూహాల వల్ల రష్యా సైన్యం అవాక్కయిన పరిస్థితి. యుద్ధానికి ముందే ఉక్రెయిన్ సైనికులు గెరిల్లా వ్యూహాలలో శిక్షణ పొందారని తెలుస్తోంది. రష్యన్ సైన్యం సోవియట్ కాలం తరహాలో పని చేస్తూనే ఉన్నప్పటికీ, శత్రువులతో సాధారణ ఉక్రేనియన్లు సైతం పోరాటానికి దిగుతున్నారు. యుద్ధానికి ముందు వారాల్లో ఇర్రెగ్యులర్ యుద్ధానికి ఉక్రేనియన్ పౌరులు సిద్ధమయ్యారు.
Nusrat Jahan: చక్కనైన జాబిలమ్మా ఎక్కడున్నావూ.. ఎంపీ నుస్రత్ జహాన్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు..
గెరిల్లాలు, ప్రధానంగా భూభాగం గురించి పూర్తిగా తెలిసిన స్థానికుల పోరాటతంతో రష్యా సైనికులకు ఎదురుదెబ్బలు తప్పడంలేదు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు పౌరులు, గెరిల్లా యుద్ధం రష్యా సైన్యానికి పీడకలగా మారుతుందన్న అమెరికా అధికారులు. రష్యన్లు ఉక్రెయిన్ బలగాలను నాశనం చేయాలనుకుంటున్నారని, అయితే పౌరులతో వ్యవహరించడానికి ఇష్టపడరని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia-Ukraine War