Home /News /international /

RUSSIA UKRAINE WAR UNITED STATES TO SELL DRONES TO UKRAINE IN COMING DAYS PAH

Russia War: అమెరికా.. ఉక్రెయిన్‌కు ఆర్మ్‌డ్ డ్రోన్‌లను విక్రయిస్తుందా?

యూఎస్ డ్రోన్

యూఎస్ డ్రోన్

Russia Ukraine war: రష్యా బలగాలకు వ్యతిరేకంగా, అనేక రకాల చిన్న చిన్న మానవరహిత వైమానిక వ్యవస్థలను ఉక్రెయిన్ వినియోగిస్తుంది.

రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు నాలుగు MQ-1C గ్రే ఈగిల్ డ్రోన్‌లను విక్రయించే యోచనలో యూఎస్‌ ఉన్నట్లు తెలుస్తోంది.  పెంటగాన్, వైట్ హౌస్ ఆర్మ్డ్‌ డ్రోన్‌లను కీవ్‌కు విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రష్యా దళాలను ఎదుర్కొనేందుకు అధునాతన ఆయుధాలను అందించాలని కీవ్‌ చేసిన అత్యవసర అభ్యర్థనల నేపథ్యంలో నివేదికలు వెలువడ్డాయి. డాన్‌బాస్‌లో రష్యా పురోగతిని అడ్డుకునేందుకు ఆయుధాలను అందించాలని పశ్చిమ దేశాలను  జెలెన్స్కీ  వేడుకుంటున్నారు. సాధ్యమయ్యే అమ్మకాలు, డ్రోన్‌ల శిక్షణను అందించేందుకు సహాయక నిధి 40 బిలియన్ల డాలర్‌లను పక్కనపెట్టినట్లు చెప్పిన ఓ యూఎస్‌ అధికారితెలిపారు.

* కీవ్‌కి 'ఈగల్స్'ను యూఎస్‌ ఎందుకు పంపలేక పోతోంది?

కీవ్‌కు ఆర్మ్డ్‌ డ్రోన్‌లను పంపడంలో లాజిస్టికల్‌, శిక్షణ సమస్యలను బైడెన్‌ ప్రభుత్వం ఎదుర్కొంటున్నట్లు POLITICO నివేదిక తెలిపింది. నాలుగు డ్రోన్‌ల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపినప్పటికీ, వాటిని ఉక్రెయిన్ దళాలు వారాలు లేదా నెలలపాటు ఉపయోగించలేవని నిపుణులు చెబుతున్నారు. అందజేసే డ్రోన్‌లను బట్టి కొన్ని నెలలపాటు శిక్షణ అవసరమవుతుందని  పెంటగాన్ అధికారులు చెబుతున్నారు. కీవ్‌ ఉపయోగిస్తున్న స్మాల్, మిడ్‌ రేంజ్‌ డ్రోన్‌ల కంటే MQ-1C డ్రోన్‌లను వినియోగించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

ఈ యూఎస్‌ డ్రోన్‌లకు ల్యాండింగ్ స్ట్రిప్స్, సురక్షిత కమ్యూనికేషన్ లింక్‌లతో సహా విస్తృతమైన గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరమని నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ ఆర్మ్డ్‌ డ్రోన్‌లను లేదా వాటి పైలట్‌లను ఎక్కడ మోహరిస్తుందో స్పష్టంగా తెలియదు. జనరల్ అటామిక్స్ అభివృద్ధి చేసిన డ్రోన్‌లను శాటిలైట్ కమ్యూనికేషన్‌లకు యాక్సెస్ ఇస్తే ఉక్రెయిన్ వెలుపల నుంచి కూడా వినియోగించే అవకాశం ఉంది. డ్రోన్‌లను నిర్వహించే శిక్షణను ఉక్రేనియన్లకు తగ్గించవచ్చని  జనరల్ అటామిక్స్ ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్‌కు శిక్షణను 4-5 వారాల వరకు తగ్గించవచ్చని జనరల్ అటామిక్స్ ప్రతినిధి తెలిపారు. డ్రోన్‌లను విక్రయించాలనే బైడెన్‌ ప్రభుత్వ ప్రణాళికలను కాంగ్రెస్ అడ్డుకోవచ్చు, లేదా చివరి నిమిషంలో విధాన పరమైన మార్పులతో నిలిపివేసే అవకాశం ఉంది. US డ్రోన్‌లను విక్రయించాలని భావిస్తే.. విక్రయానికి అధికారిక అభ్యర్థనలు అవసరం, US స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆమోదానికి లోబడి ఉండాలని సమాచారం.

* ఉక్రెయిన్‌కు గ్రే ఈగల్స్ ఎలా సహాయం చేస్తాయి?

రష్యా బలగాలకు వ్యతిరేకంగా అనేక రకాల చిన్న చిన్న మానవరహిత వైమానిక వ్యవస్థలను  ఉక్రెయిన్ ఉపయోగిస్తుంది. రష్యాపై ప్రముఖంగా AeroVironment RQ-20 Puma AE, టర్కిష్ బైరక్టర్-TB2ను ఉక్రేనియన్ దళాలు ఉపయోగిస్తున్నాయి. MQ-1C గ్రే ఈగిల్ డ్రోన్‌లు ఉక్రేనియన్ సేనలు కనీసం 30 గంటలపాటు ప్రయాణించగలవు కాబట్టి ఎక్కువ కాలం మిషన్‌లను నిర్వహించడానికి ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇంటెలిజెన్స్ ప్రయోజనాల కోసం భారీ మొత్తంలో డేటాను సేకరించడంలో డ్రోన్లు ఉక్రేనియన్ దళాలకు సహాయపడతాయని విశ్లేషణలు తెలుపుతున్నాయి. MQ-1C అనేది బైరక్టార్-TB2 కంటే మూడు రెట్లు గరిష్టంగా టేకాఫ్ బరువును తీసుకెళ్లే అవకాశం ఉందని ఎయిర్‌క్రాఫ్ట్‌ నిపుణులు భావిస్తున్నారు.

* MQ-1C గ్రే ఈగిల్ డ్రోన్‌ల స్పెసిఫికేషన్‌లు

సిబ్బంది: మానవరహిత

కెపాసిటీ: 360 KG

గరిష్ట టేకాఫ్ బరువు: 1,633 KG

గరిష్ట వేగం: 192 MPH

గరిష్ట విమాన వ్యవధి: 30 గంటలు

ఉక్రెయిన్‌కు మల్టిపుల్‌డీప్ స్ట్రైక్‌లను చేయగలిగిన అధునాతన పునర్వినియోగ యూఎస్‌ సిస్టమ్‌లను అందించడంతో ఈ విక్రయం చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జనరల్ అటామిక్స్ తయారు చేసిన డ్రోన్‌లు ప్రస్తుతం ఉక్రెయిన్ ఉపయోగించే వాటి కంటే అనేక రకాల ఆయుధ సామాగ్రితో అనుకూలంగా ఉంటాయని నివేదికలు వెల్లడించాయి. బైరక్టార్ డ్రోన్లలో 22 కిలోల టర్కిష్ తయారు చేసిన MAM-L క్షిపణులు ఉంటాయని సమాచారం.  గ్రే ఈగల్స్, ప్రిడేటర్ డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. ఇది  ఎనిమిది శక్తివంతమైన హెల్‌ఫైర్ క్షిపణులను మోసుకెళ్లగలదు. యూఎస్‌ ఆర్మడ్‌ డ్రోన్‌లు రష్యాకు వ్యతిరేకంగా యుద్దభూమిలో డీప్‌ అటాక్స్‌ చేయడానికి ఉక్రేనియన్ దళాలకు సహాయపడతాయి.యూఎస్‌ ఆర్మడ్‌ డ్రోన్‌ల విక్రయం రష్యాతో పోరాడటానికి కీవ్‌కు ఇతర అధునాతన ఆయుధాలను పొందే అవకాశాన్ని కల్పిస్తుందంటున్న నిపుణులు భావిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Drones, Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు