హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine Talks : రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు సఫలం..యుద్ధం ముగిసినట్లే!

Russia-Ukraine Talks : రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు సఫలం..యుద్ధం ముగిసినట్లే!

Russia-Ukraine War : ఇస్తాంబుల్ చర్చల తర్వాత.. పుతిన్, జెలెన్​స్కీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ఉక్రెయిన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జెలెన్‌ స్కీ, పుతిన్ త‌న‌కు విలువైన మిత్రులు అని.. చ‌ర్చ‌ల్లో ప్ర‌గ‌తి సాధిస్తే, ఆ ఇద్ద‌రు నేత‌లు క‌లుసుకుంటార‌ని, ఆ భేటీని నిర్వ‌హించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డ‌గాన్ తెలిపారు.

ఇంకా చదవండి ...

Russia says it will scale back near Kyiv  రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్​ లో ఉక్రెయిన్‌, ర‌ష్యా ప్ర‌తినిధుల మ‌ధ్య మంగ‌ళ‌వారం మూడో ద‌ఫా చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇరు దేశాల ప్ర‌తినిధులు దాదాపు మూడు గంట‌ల పాటు శాంతి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్​ లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.

అంతకుముందు జరిగిన కొన్ని ముఖాముఖి చర్చలు విఫలమైన నేపథ్యంలో శాంతి చర్చలపై ఉక్రెయిన్​కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు, ఉక్రెయిన్ భద్రత వంటి అంశాలే లక్ష్యంగా ఇస్తాంబుల్ ​లో చర్చలు జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వివరించారు.

ALSO READ Border Dispute :50 ఏళ్ల సరిహద్దు వివాదానికి తెర..కీలక ఒప్పందంపై అసోం-మేఘాలయ సీఎంలు సంతకం

ఇస్తాంబుల్ చర్చల తర్వాత.. పుతిన్, జెలెన్​స్కీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ఉక్రెయిన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జెలెన్‌ స్కీ, పుతిన్ త‌న‌కు విలువైన మిత్రులు అని.. చ‌ర్చ‌ల్లో ప్ర‌గ‌తి సాధిస్తే, ఆ ఇద్ద‌రు నేత‌లు క‌లుసుకుంటార‌ని, ఆ భేటీని నిర్వ‌హించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డ‌గాన్ తెలిపారు. రెండు వైపులా న్యాయ‌ప‌ర‌మైన ఆందోళ‌న‌లు ఉన్నాయ‌ని, కానీ చ‌ర్చ‌ల ద్వారా నిర్దిష్ట‌మైన ఫ‌లితాల‌ను అందుకోవాల‌ని ఆయ‌న సూచించారు. రెండు దేశాల మ‌ధ్య శాంతి కుద‌ర‌డం వ‌ల్ల ఎవ‌రికీ న‌ష్టం ఉండ‌ద‌న్నారు. కాగా,ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలు ఫలప్రదంగా సాగడం వల్ల చమురు సరఫరాపై ఉన్న భయాలు వీడాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర 5శాతానికిపైగా తగ్గింది. మరోవైపు రష్యా కరెన్సీ రూబెల్ విలువ 10శాతం మేర పెరిగింది.చర్చల చర్యల

First published:

Tags: Russia-Ukraine War, Vladimir Putin, Zelensky

ఉత్తమ కథలు