Home /News /international /

RUSSIA UKRAINE WAR PRIME MINISTER NARENDRA MODI DISCUSSES GRAVE SITUATION WITH UK PM BORIS JOHNSON PVN

Modi-Boris : ఉక్రెయిన్ లో పరిస్థితిపై బ్రిటన్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన మోడీ

మోడీ-బోరిస్ జాన్సన్(ఫైల్ ఫొటో)

మోడీ-బోరిస్ జాన్సన్(ఫైల్ ఫొటో)

Modi-Boris Discuss On Ukraine : రష్యా-ఉక్రెయిన్ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి సామరస్యంగా చర్చింకోవడమే ఉత్తమమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. యుద్ధాన్ని ఆపేసి చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ పదేపదే విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీ..బ్రిటన్ ప్రధానితో పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, భౌగోళిక స‌మ‌గ్ర‌త‌పై భార‌త్‌కు అపార‌మైన న‌మ్మ‌కం, గౌర‌వం ఉన్నాయ‌ని మోడీ ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు.

ఇంకా చదవండి ...
PM Modi-PM Boris Johnson Discussion : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ తో మంగళవారం ఫోన్ లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఉక్రెయిన్ స‌మ‌గ్ర‌త‌ను, ప్రాదేశిక సార్వ‌భౌమ‌త్వాన్ని క‌చ్చితంగా గౌర‌వించాల్సిందేన‌ని ఇరువురూ అభిప్రాయ‌ప‌డ్డారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి భారత్‌ తమతో కలిసి పనిచేయాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌ అంశంలో పుతిన్‌ చర్యలు.. అంతర్జాతీయంగా తీవ్ర ముప్పునకు దారితీసే ప్రమాదం ఉందని జాన్సన్‌ అన్నారు. అంత‌ర్జాతీయంగా శాంతి సామ‌ర‌స్యాలు వెల్లివిరియాలంటే అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను గౌర‌వించ‌డ‌మే ఏకైక మార్గమని ఇరువురు నేతలు అంగీకరించినట్లు బ్రిటన్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి సామరస్యంగా చర్చింకోవడమే ఉత్తమమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. యుద్ధాన్ని ఆపేసి చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ పదేపదే విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీ..బ్రిటన్ ప్రధానితో పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, భౌగోళిక స‌మ‌గ్ర‌త‌పై భార‌త్‌కు అపార‌మైన న‌మ్మ‌కం, గౌర‌వం ఉన్నాయ‌ని మోడీ ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు. ఇక‌… భార‌త ప‌ర్య‌ట‌న‌కు రావాల‌ని ప్ర‌ధాని మోదీ బ్రిట‌న్ ప్ర‌ధాని జాన్స‌న్‌ను ఆహ్వానించారు. ఉక్రెయిన్ అంశంతో పాటు భార‌త్‌, బ్రిట‌న్ మ‌ధ్య ఉన్న సంబంధాలు, వాటి పురోగ‌తిపై కూడా ఇరువురు నేత‌లూ మాట్లాడుకున్నారు. సాంకేతికం, పెట్టుబడులు, రక్షణ, వ్యాపార రంగాలకు సంబంధించి చర్చ జరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇక,భార‌త ప‌ర్య‌ట‌న‌కు రావాల‌ని ప్ర‌ధాని మోడీ బ్రిట‌న్ ప్ర‌ధాని జాన్స‌న్‌ ను ఆహ్వానించారు.

ALSO READ Tragic : వాహనం లేకపోవడంతో..కొడుకు శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి

మరోవైపు,ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు తక్షణమే ముగింపు పలికి, శాంతిస్థాపనకు కృషి చేయాలని ఐరాస జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అన్నారు. యుద్ధం కారణంగా ప్రపంచం ఆహార సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందన్నారు ఇప్పటికే దాదాపు కోటి మంది ఉక్రెయిన్‌ ప్రజలు యుద్ధ భయంతో తమ స్వస్థలాలను విడిచి వెళ్లారన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Britain, Pm modi, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు