హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia Ukraine War: అణు బాంబులు సిద్దం చేయండి: శాంతి చర్చల వేళ పుతిన్ షాకింగ్ ఆదేశాలు

Russia Ukraine War: అణు బాంబులు సిద్దం చేయండి: శాంతి చర్చల వేళ పుతిన్ షాకింగ్ ఆదేశాలు

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దంలో చర్చల రూపంలో శాంతి కిరణం ఉదయించిన కాసేపటికే పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అణు బాంబులను యాక్టివేట్ చేయాల్సిందిగా ఆర్మీ చీఫ్ లను ఆదేశించారు. పశ్చిమ దేశాలు దేనికైనా తెగిస్తాయని, అందుకే ఈ ఆదేశాలన్నారు.

చర్చలకు రెండు దేశాలూ అంగీకారించడంతో ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతోన్న యుద్దంలో శాంతి కిరణం ఉదయించింది. కానీ మరునిమిషంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన సంచలన ప్రకటనతో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నట్లయింది. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకారం తెలిపిన వెంటనే, రెండు దేశాల ప్రతినిధి బృందాలు చర్చల వేదికైనా బెలారస్ బాటపట్టాయి. బెలార‌స్‌లోని గోమెల్‌లో మరికాసేపట్లోనే చర్చలు ప్రారంభంకానున్నాయి. అంతలోనే.. అణుబాంబులను సిద్ధం చేయాలంటూ పుతిన్ తన ఆర్మీని ఆదేశించడం సంచలనంగా మారింది..

ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు రెండు దేశాలూ చర్చలకు అంగీకరించి, ప్రక్రియ మొదలు కానున్నవేళ, అణ్వాయుధ బలగాలను హై అలెర్ట్‌లో ఉంచాలంటూ ఆర్మీ చీఫ్‌లను ఆదివారం ఆదేశించారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలు, నాటో దళాలు రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయని పుతిన్ ఆరోపించారు. పశ్చిమ దేశాల నుంచి దూసుకొచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అణ్వాయుధ బలగాలను అప్రమత్తంగా ఉంచాలని సైనిక చీఫ్‌లను పుతిన్ ఆదేశించారు.

Russia Ukraine War: ముగింపు దిశగా యుద్ధం!.. రష్యాతో ఉక్రెయిన్ శాంతి చర్చలు షురూ.. అజెండా ఇదే..

ఆర్మీ చీఫ్ లతో ఆదివారం మాట్లాడిన అధ్యక్షుడు పుతిన్.. అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలపై విరుచుకుపడ్డారు. పశ్చిమ దేశాలు చట్ట విరుద్దంగా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయని, నాటో దేశాల సీనియర్ అధికారులు రష్యాకు వ్యతిరేకంగా దూకుడు ప్రకటనలు చేస్తున్నారని, ఈ పరిణామాల నేపథ్యంలో ‘పూర్తి నిరోధక దళాలను ప్రత్యేక పోరాటానికి సిద్ధంగా ఉంచాలని రక్షణ మంత్రి, రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్‌ను ఆదేశిస్తున్నాను’అని పుతిన్‌ అన్నారు. దీనికి రష్యా రక్షణ మంత్రి షోయిగు అంగీకారం తెలిపారు.

CM KCR ఫామ్‌హౌజ్‌లో Prashant Kishor -తెలంగాణలో ముందస్తు ఎన్నికలు! -TRS భారీ వ్యూహం

అణ్వాయుధాల పరంగా ప్రపంచంలో (అమెరికా తర్వాత) రెండో శక్తిమంతమైన దేశం రష్యా. బాలిస్టిక్ క్షిపణులను కూడా రష్యా భారీగా నిల్వ చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగ్గా, అణు బాంబులను హై అలెర్ట్‌లో ఉంచాలన్న పుతిన్ ఆదేశాలతో ఆందోళన రెట్టింపయింది. అయితే అణుబాంబులను ఉక్రెయిన్ పై వాడటానికి ఉపయోగించరాదని, ఒకవేళ ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో దళాలుగానీ, మరే ఇతర దేశమైనా ఎంటరైతేనే వాడాలని రష్యా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా శాంతి చర్చల వేళ పుతిన్ అణు బాంబుల ప్రకటన పశ్చిమదేశాలకు హెచ్చరికలాంటిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

ఉత్తమ కథలు