Home /News /international /

RUSSIA UKRAINE WAR INDIAN EMBASSY IN KYIV TO BE TEMPORARILY RELOCATED TO POLAND SAYS MEA PM MODI CHAIRS CCS MEET MKS

Russia Ukraine war: మోదీ సర్కార్ సంచలనం -ఉక్రెయిన్ కీవ్‌లోని భారత ఎంబసీ తరలింపు..

కీవ్ లోని ఇండియన్ ఎంబసీ (పాత ఫొటో)

కీవ్ లోని ఇండియన్ ఎంబసీ (పాత ఫొటో)

ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు మరింత భీకరగా మారిన క్రమంలో కీవ్ నగరంలోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. విదేశాంగ శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం, దాని వల్ల నెలకొన్న పరిణామాలకు సంబంధించి భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పుతిన్, జెలన్‌స్కీలకు రెండు సార్లు ఫోన్లు చేసి విన్నవించినా యుద్ధ విరమణకు రష్యా, ఉక్రెయిన్ ససేమిరా అంటుండటం, యుద్దం మూడో వారంలోకి ప్రవేశించిన దరిమిలా ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు మరింత భీకరగా మారిన క్రమంలో భారత్ అక్కడి రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆదివారం భేటీకాగా, ఆ సమావేశం కొనసాగుతుండగానే విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఉక్రెయిన్‌లో వేగంగా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, ఆ దేశ పశ్చిమ ప్రాంతాల్లోనూ దాడులు పెరిగిన నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని(కీవ్ నగరంలోని) భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించాలని నిర్ణయించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలిస్తున్నట్లు MEA పేర్కొంది. రాబోయే రోజుల్లో పరిణామాలను బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

Leopard Meat: ఛీ, వీళ్లు మనుషులేనా?.. చిరుతపులిని చంపి, దాని మాంసం వండుకొని తిన్నారు..





రష్యా-ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో భారత భద్రతా సంసిద్ధతను సమీక్షించేందుకు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు కూడా భేటీలో పాల్గొన్నారు.

Che Guevara: చే గువేరాను కాల్చిచంపిన బొలీవియా మాజీ సైనికుడి మృతి.. అత్యంత నీచమైన క్షణం..


రష్యా గత 24 నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నప్పటి నుంచి ప్రధాని మోదీ అనేక ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ‘ఆపరేషన్ గంగా’ ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులను తరలించారు. ఇప్పటికే మెజార్టీ భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించారు. శుక్రవారం కూడా ఉక్రెయిన్‌లోని సుమీ నుంచి 600 మంది భారతీయులను పోలాండ్ తీసుకొచ్చి, అక్కడి నుంచి మూడు ప్రత్యేక విమానాలలో భారత్ తరలించారు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ లో చదువుతోన్న కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం చెందడం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:

Tags: India, Pm modi, Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు