హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UK Vs Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. యూకేపై అణు దాడి చేయాలని వ్యాఖ్యానించిన రష్యన్ స్టేట్ మీడియా..

UK Vs Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. యూకేపై అణు దాడి చేయాలని వ్యాఖ్యానించిన రష్యన్ స్టేట్ మీడియా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూకేపై (UK) స్టేటస్-6 కోబాల్ట్ న్యూక్ బాంబును(Bomb) ప్రయోగించాలని రష్యా 1లోని ఒక రష్యన్ టీవీ ప్రెజెంటర్(TV Presenter) పిలుపునిచ్చారు. బ్రిటన్‌ను పోసిడాన్ సముద్రపు లోతుల్లోకి ముంచివేయగలడు అని రష్యన్ నేషనల్ టీవీలో ప్రచారకర్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిమిత్రి కిసెలియోవ్ వ్యాఖ్యానించాడు.

ఇంకా చదవండి ...

యూకేపై (UK) స్టేటస్-6 కోబాల్ట్ న్యూక్ బాంబును(Bomb) ప్రయోగించాలని రష్యా 1లోని ఒక రష్యన్ టీవీ ప్రెజెంటర్(TV Presenter) పిలుపునిచ్చారు. బ్రిటన్‌ను పోసిడాన్ సముద్రపు లోతుల్లోకి ముంచివేయగలడు అని రష్యన్ నేషనల్ టీవీలో ప్రచారకర్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిమిత్రి కిసెలియోవ్ వ్యాఖ్యానించాడు. బోరిస్ జాన్సన్(Boris Johnson) క్రెమ్లిన్‌ను అణు దాడితో బెదిరించినట్లు రష్యా మీడియా(Russia Media) చేసిన ప్రకటనల తర్వాత ఈ వివాదం మొదలైంది. రష్యాపై ప్రతీకార బెదిరింపులకు బోరిస్ జాన్సన్ దిగిన తర్వాత పరిణామాలు ఏంటని రష్యన్ టీవీ షో హోస్ట్ డిమిత్రి కిసెలియోవ్ ప్రశ్నించాడు. యూకే చిన్న ద్వీపంగా ఉన్నప్పుడు విస్తారమైన రష్యాను అణ్వాయుధాలతో ఎందుకు బెదిరించారని వ్యాఖ్యానించాడు. ఈ ద్వీపం చాలా చిన్నది, ఒక్క సర్మత్ క్షిపణి దానిని ముంచివేయడానికి సరిపోతుందని డిమిత్రి కిసెలియోవ్ అన్నాడు.

యునైటెడ్ కింగ్‌డమ్‌ను కొట్టడానికి మరొక ప్రణాళికను కూడా కిసెలియోవ్‌ సూచించాడు. బ్రిటన్‌ను సముద్రం లోతుల్లోకి నెట్టడానికి మరొక ఎంపిక రష్యన్ అండర్‌ వాటర్‌ రోబోటిక్ డ్రోన్ అని కిసెలియోవ్‌ అన్నాడు. బ్రిటన్ తీరానికి దగ్గరగా ఈ థర్మోన్యూక్లియర్ టార్పెడో పేలుడుతో 500 మీటర్ల ఎత్తు వరకు అలలతో సునామీ వస్తుందని వ్యాఖ్యానించాడు. ఈ టైడల్ వేవ్ ఎక్కువ మోతాదులో రేడియేషన్ విడుదల చేస్తుందని, బ్రిటన్‌పైకి దూసుకెళ్లి రేడియోధార్మిక ఎడారిగా మారుస్తుందన్న కిసెలియోవ్‌ పేర్కొన్నాడు.

Smart Bomb: కొత్త షిప్ కిల్లింగ్ స్మార్ట్ బాంబ్‌ను పరీక్షించిన యూఎస్‌.. ఈ బాంబ్ ఎలా పనిచేస్తుందంటే..


డిమిత్రి కిసెలియోవ్ ఎవరు..?

రష్యన్ టెలివిజన్‌లో ప్రచారకర్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. టెలివిజన్‌లో పుతిన్ అనుకూల వైఖరికి ఇతడు ఎంతో ప్రసిద్ధి. తరచుగా పుతిన్‌కు 'ప్రచారకుడు-ఇన్-చీఫ్' అని గుర్తింపు. "పుతిన్ మౌత్ పీస్" అని కూడా ఇతడిని వివిధ వర్గాలు వ్యవహరిస్తారు. రష్యన్లతో పోరాడటానికి ఉక్రెయిన్‌కు యూకే ఆయుధాలను సరఫరా చేయడం కొనసాగిస్తున్నందున అతడు ఇలా మాటలతో తిరుగుబాటు చేశాడు.

వివాదాస్పద వ్యాఖ్యలతో అప్రమత్తమైన యూకే..

పుతిన్ 'ఆర్మీ ఆఫ్‌ సబోటియర్స్‌’పై UK PM బోరిస్ జాన్సన్, హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌ను MI5 హెచ్చరించింది. రష్యా ఏజెంట్లు UKలోకి చొరబడతారనే భయంతో బ్రిటన్ దేశీయ కౌంటర్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'హై అలర్ట్'లో ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పవర్ స్టేషన్లతో సహా కీలకమైన ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతాయని UK ప్రభుత్వానికి హెచ్చరికలు అందుతున్నాయి. వీటిని UK ప్రభుత్వాన్ని అవమానపరిచే ప్రయత్నాలు, ఉక్రెయిన్ యుద్ధానికి అనుకూలంగా ప్రజల అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌లో పదేపదే ఇంటెలిజెన్స్ వైఫల్యాల మధ్య పుతిన్ FSB దాని ఖ్యాతిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

UKకి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన తప్పుడు ప్రచారానికి ట్రోల్ ఫామ్‌లతో రష్యా తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం గురించి అబద్ధాలతో మా ఆన్‌లైన్ స్పేస్‌లను ఆక్రమించడానికి క్రెమ్లిన్, దాని ట్రోల్ ఫామ్‌లను అనుమతించమని UK విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ అన్నాడు. UK ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములను అప్రమత్తం చేసిందని, రష్యా సమాచార కార్యకలాపాలను బలహీనపరిచేందుకు పనిచేస్తామని ప్రకటించాడు.


Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

రష్యన్ వెపన్ సిస్టమ్స్‌లో బ్రిటీష్ కాంపోనెంట్స్‌..?

రష్యా వెపన్‌ సిస్టమ్స్‌లో UK కాంపోనెంట్స్‌ ఉపయోగిస్తున్నట్లు వచ్చిన నివేదికలపై వైట్‌హాల్ విచారణ చేపట్టింది. రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్(RUSI) నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బోరిసోగ్లెబ్స్క్ 2 జామింగ్ సిస్టమ్‌లో UK తయారు చేసిన హై ఫ్రీక్వెన్సీ ట్రాన్సిస్టర్‌లను ఉపయోగించారు. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యాపై ఆయుధ నిషేధాన్ని UK ప్రవేశపెట్టింది. పౌర, సైనిక వినియోగానికి రష్యాకు డ్యూయల్‌ యూజ్‌ కాంపోనెంట్స్‌ తరలించకూడదని ఆంక్షలు విధించింది. అయినప్పటికీ సందేహాస్పద భాగాలు ఎప్పుడు ఎగుమతి చేశారనేది RUSI నివేదిక స్పష్టం చేయలేదు. మాస్కో దాని ఆయుధాల పనితీరును నిర్ధారించడానికి కాంపోనెంట్-స్మగ్లింగ్‌పై ఆధారపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Nuclear, Russia, Russia-Ukraine War, United Kingdom

ఉత్తమ కథలు