RUSSIA UKRAINE WAR BRIMSTONE PRECISION GUIDED MISSILES ARE HEADED TO UKRAINE WITHIN WEEKS GH SK
Ukraine: రష్యా భరతం పట్టేందుకు అధునాతన అస్త్రం.. రంగంలోకి బ్రిమ్‌స్టోన్ మిసైల్స్.. ఉక్రెయిన్‌కు బ్రిటన్ సాయం
ప్రతీకాత్మక చిత్రం
Ukraine-Russia War:ఉక్రెయిన్‌కు కొన్ని మిత్ర దేశాలు సరఫరా చేసిన వాటి కంటే బ్రిమ్‌స్టోన్ మిసైల్స్‌కు ఎక్కువ రేంజ్ ఉంటుంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో కొనసాగుతున్న రష్యా దాడిని అడ్డుకోవడంలో బ్రిమ్‌స్టోన్ మిసైల్స్ ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.
ఉక్రెయిన్ను రష్యా ఉక్కిబిక్కిరి (Ukraine-Russia War) చేస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాయి. భారీగా ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. తాాజాగా యూకే కీలక ప్రకటన చేసింది. బ్రిమ్‌స్టోన్ ప్రెసిషన్ గైడెడ్ (Bridgestone Precision Guided missiles)మిసైల్స్‌ను ఉక్రెయిన్‌కు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌కు యూకే అందిస్తున్న ఆయుధాల సహకారంలో భాగంగా ఈ క్షిపణులను అందజేస్తోంది. ప్రస్తుతం బ్రిమ్‌స్టోన్ మిస్సైళ్లు.. ఎయిర్ లాంచ్డ్, గ్రౌండ్ లాంచ్డ్, షిప్ బేస్డ్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఉక్రెయిన్‌కు గ్రౌండ్ లాంచ్డ్ వెర్షన్ మిసైల్‌ను అందిస్తున్నట్లు స్పష్టం చేసిన UK రక్షణ కార్యదర్శి జెన్ వాలెస్ పేర్కొన్నారు. షిప్ బేస్డ్ మిసైల్స్ అందుబాటులో లేవని మ ఆయుధ బంఢాగారంలో నిల్వ ఉన్న గ్రౌండ్ లాంచ్డ్ మిస్సైల్స్ మొదటి సారి తరలిస్తున్నామని పేర్కొన్నారు.
* బ్రిమ్‌స్టోన్ మిస్సైల్ అంటే ఏంటి?
యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ (UK Royal Airforce) కోసం బ్రిమ్‌స్టోన్ మిసైల్స్‌ను MBDA అనే కంపెనీ తయారుచేసింది. ఈ యాంటీ షిప్ మిసైల్స్‌ను లిబియా, సిరియాలో బ్రిటిష్ దళాలు ఉపయోగించాయి. ట్రక్కులు వంటి గ్రౌండ్ వెహికల్స్‌ను కూడా బ్రిమ్‌స్టోన్ ఛేదించగలదు. సాధారణంగా టైఫూన్ వంటి వేగవంతమైన జెట్ విమానాల నుంచి వీటిని ప్రయోగిస్తారు. బ్రిమ్‌స్టోన్ 1లో బ్రిటిష్ సైన్యంలోకి 2005లో ప్రవేశించాయి. ఆ తర్వాత అప్డేట్ వర్షన్ బ్రిమ్‌స్టోన్2 ఆర్ఏఎఫ్ ఆయుధశాలకు చేరింది.
బ్రిమ్‌స్టోన్ ఫీచర్లు:
పొడవు- 6 అడుగుల
డయామీటర్-180mm
బరువు-110 పౌండ్లు
పరిధి (ఎయిర్-లాంచ్డ్ వెర్షన్)-37 మైళ్లు
ఐతే ఇప్పటి వరకు వెహికల్-మౌంటెడ్ లేదా షిప్-లాంచ్డ్ బ్రిమ్‌స్టోన్ వెర్షన్లు కార్యాచరణలోకి దిగAODI. ఎయిర్ లాండ్డ్ బ్రిమ్‌స్టోన్ మాత్రమే ఇప్పటి వరకు ఉపయోగించించారు. ఈనేపథ్యంలో గ్రౌండ్ లాంచ్డ్ వేరియంట్ మిసైల్‌ను ఉపయోగిస్తున్న మొదటి ఆపరేటర్‌గా ఉక్రెయిన్ నిలవనుంది.
బ్రిమ్స్టోన్లో దశలువారీగా పేలే 6.3 కిలోల వార్హెడ్లు ఇందులో అమర్చబడి ఉంటాయి. దీని వార్‌హెడ్ లేజర్-సీకింగ్ గైడెన్స్, అటానమస్ టార్గెటింగ్ మధ్య మారగలదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, రాత్రిపూట డ్యూయల్ యాక్టివ్ మిల్లీమెట్రిక్-వేవ్ రాడార్, సెమీ-యాక్టివ్ లేజర్‌తో ఇది పనిచేస్తుంది. దూర ప్రాంతాల్లోని లక్ష్యాలను చేరుకోవడానికి ఇనెర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఆటోపైలట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
* బ్రిమ్‌స్టోన్ ఉక్రెయిన్ను ఎలా బలపరుస్తుంది?
ఉక్రెయిన్‌కు కొన్ని మిత్ర దేశాలు సరఫరా చేసిన వాటి కంటే బ్రిమ్‌స్టోన్ మిసైల్స్‌కు ఎక్కువ రేంజ్ ఉంటుంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో కొనసాగుతున్న రష్యా దాడిని అడ్డుకోవడంలో బ్రిమ్‌స్టోన్ మిసైల్స్ ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. ఎయిర్ లాంచ్డ్ బ్రిమ్‌స్టోన్ అన్ని కన్వెన్షనల్, రియాక్టివ్ ఆర్మర్లను ఛేదించగలవని సమాచారం. అంతేకాదు బ్రిమ్‌స్టోన్ గ్రౌండ్-లాంచ్డ్ వెర్షన్.. రష్యన్ ట్యాంక్ ఫ్లీట్లను భూభాగాన్ని స్వాధీనం చేసుకోకుండా ఆపగలదని నివేదికలు చెబుతున్నాయి.
తదుపరి యాంటీ షిప్ మిసైల్స్‌ను అందించే యోచనలో యూకే ఉందా?
బ్రిటన్ యాంటీ షిప్ మిసైల్స్ సరఫరా చేయాలని చేస్తున్నట్లు యూకే రక్షణ కార్యదర్శి తెలిపారు. దేశం దక్షిణ తీరం వెంబడి రష్యా దాడులను అడ్డుకొనేందుకు యాంటీ షిప్ మిసైల్స్ ఉపయోగపడతాయి. ప్రస్తుతం నల్ల సముద్రం నుంచి ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి రష్యా యుద్ధనౌకలు సిద్ధంగా ఉన్నాయని యూకే చెబుతోంది. దాదాపు 20 రష్యన్ నేవీ నౌకలు ప్రస్తుతం నల్ల సముద్రం జోన్లో ఉన్నాయని ఆ దేశ ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రష్యా నౌకలు నగరాలపై బాంబులు వేయకుండా అడ్డుకోవాలని యూకే రక్షణ కార్యదర్శి కీవ్‌కు సూచించారు. కాగా, ఈ నెల ప్రారంభంలో రష్యా నౌక మోస్క్వాను ముంచేందుకు తమ సొంత నెప్ట్యూన్ యాంటీ-షిప్ మిసైల్‌ను ఉపయోగించినట్లు ఉక్రెయిన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.