Home /News /international /

RUSSIA UKRAINE CRISIS NETFLIX SUSPENDS SERVICE IN RUSSIA PAH

పుతిన్ కు మరో భారీ షాక్.. రష్యాలో తమ సేవలను నిలిపివేసిన మరో దిగ్గజ సంస్థ..

వ్లాదిమిర్ పుతిన్(ఫైల్)

వ్లాదిమిర్ పుతిన్(ఫైల్)

Russia Ukraine War: రష్యా,ఉక్రెయిన్ పై మారణ హోమాన్ని కొనసాగిస్తుంది.పుతిన్ ఉక్రెయిన్ పై పన్నెండు రోజులుగా దాడులకు తెగబడుతుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్ సంస్థలు వీసా , మాస్టర్ కార్డ్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో పెద్ద సంస్థ కూడా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ ప్రతినిధి..

ఇంకా చదవండి ...
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై మారణ హోమాన్ని కొనసాగిస్తుంది. పుతిన్ ఉక్రెయిన్ పై పన్నెండు రోజులుగా దాడులకు తెగబడుతుంది. ఇప్పటికే పలుదేశాలు, రష్యాను (Russia) నిలువరించే క్రమంలో భారీ ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో రష్యా కరెన్సీ రూబుల్ భారీగా పతనమైంది.

ఇప్పటికే ఇంటర్నేషనల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్ సంస్థలు వీసా , మాస్టర్ కార్డ్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో పెద్ద సంస్థ కూడా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ ప్రతినిధి..

రష్యాను నిలువరించేందుకు ఐక్యరాజ్యసమితి (United nations)అనుబంధ సంస్థలలో పలు తీర్మానాలు చేస్తున్నాయి.దీనిలో భాగంగా.. రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినప్పటికి పుతిన్ దళాలు దాడులను ఏమాత్రం తగ్గించడం లేదు. రష్యన్ దళాలు.. ఉక్రెయిన్ పై పన్నెండు రోజులుగా బీభత్సంగా దాడులకు పాల్పడుతున్నాయి.

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)


ఇరు దేశాలలోను భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది.ఇప్పటికే దాదాపు.. 15 లకల మంది వరకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడైంది. ప్రపంచ దేశాలు,యుద్ధాన్ని ఆపాలని రష్యాను కొరినప్పటికి, పుతిన్ (Vladimir Putin) తన మంకుపట్టును మాత్రం మానుకొవడం లేదు. ఇప్పటికే యుద్ధం వలన ప్రపంచ దేశాలలో ఆర్థిక సంక్షోభం చోటుచేసుకుంటుంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ(Zelenskyy) ప్రపంచ దేశాలు తమకు సహకారం అందించాలని కోరారు. అయితే, ఆ దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకున్న..పరోక్షంగా ఉక్రెయిన్ (Ukraine)కు సహకారం అందిస్తున్నాయి. రష్యా దాడులను ఆపడం లేదు.. ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. వెరసి రెండు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు మేరకు ఉక్రెయిన్ పౌరులు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొంటున్నారు.

ఇటు రష్యన్ దళాలు.. పలు నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ఆసుపత్రులు, టీవీ టవర్లు,భవంతులు,ప్రభుత్వ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రష్యా యుద్ధోన్మాదం వలన.. ప్రపంచ దేశాలు బంగారం, ఇతర ముడిచమురు, ఎగుమతులు, దిగుమతులు, రవాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్ (Global Market)లలో ధరలు, స్టాక్ మార్కెట్ ధరల్లో తీవ్ర అనిశ్చితి చోటు చేసుకుంటుంది.

ఇప్పటికే రష్యాలో త‌మ సంస్థ‌ల కార్యక‌లాపాల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్ సంస్థ‌లు వీసా(Visa), మాస్ట‌ర్ కార్డ్ (Master Card) ఆంక్షలు విధించాయి. ర‌ష్యాలో త‌మ సంస్థ‌ల కార్యక‌లాపాల‌ను నిలిపివేస్తున్నట్లు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.

తాజాగా , ఆ జాబితాలో నెట్ ఫ్లిక్స్ (Netflix) కూడా చేరిపోయింది. రష్యాలో తమ కార్యకలపాలు తాత్కలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించింది.గతంలోనే.. ర‌ష్యాలో టెక్ జెయింట్స్ మైక్రోసాఫ్ట్‌ (Microsoft), ఆపిల్ (Apple) దిగ్గజ సంస్థలు తమ సేవలను నిలిపివేస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అదే విధంగా, ర‌ష్యాలో తమ కార్య‌క‌లాపాల‌ను స‌స్పెండ్ చేయ‌డం వ‌ల్ల తమ సిబ్బందికి, కంపెనీ ఉద్యోగులకు, కస్టమర్లకు కలిగిన ఇబ్బందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించాయి. నెట్ ఫ్లిక్స్ (Netflix)సంస్థ కూడా రష్యాలో తమ సేవలను నిలివేస్తున్నట్లు (Suspend Services)ప్రకటించింది.

రష్యాతో అన్నిరకాల ప్రాజెక్టులను తాత్కలింగా నిలిపివేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు.రష్యా అనైతిక సైనిక చర్యవలన ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయిన్నారు. ప్రపంచ దేశాలకు ముప్పుగా ఏర్పడిందన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, Apple, Microsoft, Netflix, Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు