RUSSIA SU 35 FIGHTER JET CRASH IN UKRAINE WHY CHINA CONCERNED THAT INCIDENT KNOW THE REASON HERE GH VB
ఉక్రెయిన్ లో రష్యా ఫైటర్ జెట్ క్రాష్ అయితే.. అటు చైనా ఎందుకు ఆందోళన చెందుతుంది.. కారణం ఏంటి..?
ప్రతీకాత్మక చిత్రం
ఖార్కివ్ సమీపంలో అత్యంత అధునాతన రష్యా(Russia) ఫైటర్ SU-35 కూలిపోయింది. రష్యా తర్వాత ఎక్కువ SU-35లు ఉన్న రెండో అతిపెద్ద దేశం చైనా(China). ఏప్రిల్ 3న రష్యాకు(Russia) చెందిన Su-35 ఫైటర్ జెట్‌ను(Fighter Jet) ఉక్రెయిన్ బలగాలు కూల్చివేసినట్లు సమాచారం.
ఖార్కివ్ సమీపంలో అత్యంత అధునాతన రష్యా(Russia) ఫైటర్ SU-35 కూలిపోయింది. రష్యా తర్వాత ఎక్కువ SU-35లు ఉన్న రెండో అతిపెద్ద దేశం చైనా(China). ఏప్రిల్ 3న రష్యాకు(Russia) చెందిన Su-35 ఫైటర్ జెట్‌ను(Fighter Jet) ఉక్రెయిన్ బలగాలు కూల్చివేసినట్లు సమాచారం. ఫ్లాంకర్ ఈ అని కూడా పేరున్న ఈ రష్యన్ జెట్(Russian Jet) మంటల్లో చిక్కుకొని, ఆకాశం నుంచి పడిపోతున్న వీడియో వైరల్‌గా(Viral Video) మారింది. ఖార్కివ్ సమీపంలో తమ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ ఫోర్సెస్ Su-35ను పేల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. మంటల్లో కాలిపోతూ ప్లెయిన్ కిందపడిన ఫోటోలను ఉక్రేనియన్ సాయుధ బలగాలు విడుదల చేశాయి. దీన్ని ధ్రువీకరించిన ఉక్రెయిన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ అంటోన్ గెరాష్చెంకో. పైలట్ ప్లెయిన్ నుంచి కిందికి దూకగా, అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. పైలట్ తన Su-35తో SEAD (సప్రెషన్ ఆఫ్ ఎనిమీ డిఫెన్స్) మిషన్‌ను నిర్వహిస్తున్నట్లు విశ్లేషిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవి శత్రువుల విమాన నిరోధక క్షిపణి, రాడార్ సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తూ వారి వైమానిక రక్షణను అణచివేయడానికి చేపట్టే సైనిక వ్యూహాలు.
SU-35 ఫీచర్లు..
సింగిల్ సీట్ మల్టీ రోల్ అటాక్ జెట్, 36,000 అడుగుల వద్ద మ్యాక్ 2.25 సాధించగలిగే అవకాశం. 1,500 mph వరకు వేగం ఉంటుంది. 8,000 కిలోల ఆయుధ సామాగ్రి కలిగి ఉంటుంది. సుమారు 1,000 మైళ్ల పరిధి ఉంటుంది. 30mm ఆటో-ఫిరంగి ఉంటుంది. ఒక్కోదానికి దాదాపు 50 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది.
నాన్-స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్..
ఈ విమానం రాకెట్లు, ఎయిర్ టూ ఎయిర్ మిసైల్స్, ఎయిర్టూ సర్ఫేస్ మిసైల్స్‌ను మోసుకెళ్లగలదు. అధునాతన ఏవియానిక్స్ సూట్, ఆధునిక Irbis-E పాసివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే రాడార్‌తో Su-35 వస్తుంది.
ఉక్రెయిన్‌లో జరిగిన క్రాష్ చైనాను ఎందుకు ఆందోళనకు గురి చేసింది?
ఉక్రెయిన్ సుఖోయ్ -35 కూల్చివేత చైనా సైన్యానికి వ్యూహాత్మక గుణపాఠాలు అని నిపుణులు అంటున్నారు. రష్యా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక యుద్ధ విమానాలు ఉన్న రెండో దేశం చైనా అని చెప్పవచ్చు. తాజా ఫోటోల ఆధారంగా.. ఫైటర్ జెట్ చాలా తక్కువ ఎత్తు నుంచి పడిపోయినట్లు కనిపిస్తోందనేది చైనా విశ్లేషకుల వాదన. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల జెట్లకు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాలు, మ్యాన్ప్యాడ్ల నుంచి హాని ఉంటుందని నిపుణులు అంటున్నారు. చైనా తన సొంత Su-35లతో మెకానికల్ ప్రాబ్లమ్స్ గుర్తించి నిర్వహణను మెరుగుపరచాలనేది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైనీస్ ఆర్సెనల్‌లో రష్యన్ జెట్స్..
2015లో సుఖోయ్తో 24 4.5 జనరేషన్ సూపర్ మానోయువ్రబుల్ Su-35 యుద్ధ విమానాల కోసం US$2 బిలియన్ల ఒప్పందంపై చైనా సంతకం చేశారు. స్టెల్త్ టెక్నాలజీ లేకపోయినా Su-35 థ్రస్ట్ వెక్టరింగ్ ఇంజిన్లపై ఎక్కువ ఆసక్తిని చైనా చూపించింది. J-16 వంటి స్వదేశీ జెట్లపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో Su-35 కోసం తదుపరి ఆర్డర్లను చైనా ఇవ్వలేదు.
Su-35 ఒక వైమానిక పోరాట యుద్ధ విమానం అయితే.. నేల, సముద్రపు దాడి కోసం ఆయుధాలు J-16 సొంతం. 2013 నుంచి సుమారు 100 Su-35లను రష్యా వైమానిక దళం సిద్ధం చేసింది. 2 బిలియన్ల యూఎస్ డాలర్లకు రెండు డజన్ల Su-35లను ఆర్డర్ చేసిన ఈజిప్ట్.. గత సంవత్సరం మొదటి డెలివరీని అందుకుంది. 2018లో డెలివరీలు పూర్తయిన వెంటనే, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ పెట్రోలింగ్‌లో Su-35లు చేరాయి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి చుట్టూ చైనా మిషన్లను చైనా పెంచుతోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.