హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia Victory Day: విక్టరీ డే ప్రదర్శనలో కనిపించిన పుతిన్‌ డెడ్లీ వెపన్స్‌.. వాటి సామర్థ్యాల వివరాలిలా..

Russia Victory Day: విక్టరీ డే ప్రదర్శనలో కనిపించిన పుతిన్‌ డెడ్లీ వెపన్స్‌.. వాటి సామర్థ్యాల వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Russia Victory Day: మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో రష్యా సైనిక శక్తిని ప్రదర్శించింది. 2020 కంటే దాదాపు మూడింట ఒక వంతు వాహనాల కవాతు తగ్గింది. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో గ్రౌండ్‌ ఫోర్స్‌, వాహనాలను కోల్పోవడంతోనే ఇలా జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

Russia Victory Day: మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో(Victory Day Parade) రష్యా(Russia) సైనిక శక్తిని ప్రదర్శించింది. 2020 కంటే దాదాపు మూడింట ఒక వంతు వాహనాల కవాతు తగ్గింది. ఉక్రెయిన్‌లో(Ukraine) పెద్ద సంఖ్యలో గ్రౌండ్‌ ఫోర్స్‌, వాహనాలను కోల్పోవడంతోనే ఇలా జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. విక్టరీ డే ఈవెంట్‌లో(Victory Day Event) మిలిటరీ ఆర్సెనల్ ప్రదర్శించారు. అందులో ముఖ్యంగా T-72B3M ట్యాంకులు ఉన్నాయి. ఇది పాత T-72B ట్యాంక్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌ T-72B3M, దీనికే అనధికారికంగా T-72B4 పేరు ఉంది. ఇది కొత్త తుపాకీ, పనోరమిక్ కమాండర్స్‌ సైట్‌, మెరుగైన ఫైర్ కంట్రోల్ సిస్టమ్, మెరుగైన రక్షణ, కొత్త ఇంజిన్‌ను(New Engine) కలిగి ఉంది. 2020 నాటికి మొత్తం 248 రష్యన్ ట్యాంకులను T-72B3Mగా అప్‌గ్రేడ్ చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. కొత్త పనోరమిక్‌ కమాండర్స్‌ సైట్‌ ద్వారా T-72B3Mకి హంటర్‌- కిల్లర్ ఎంగేజ్‌మెంట్(Engagement) సామర్థ్యం ఉంది. ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్(Electronics) పరంగా, రష్యన్ సైన్యం ఉపయోగించే T-90 ట్యాంక్‌ను T-72B3M అధిగమించింది.

RS-24 YARS బాలిస్టిక్ క్షిపణులు..

రెడ్ స్క్వేర్ పరేడ్‌లో రష్యన్ RS-24 YARS ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు చేరాయి. 10 వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల థర్మోన్యూక్లియర్ RS-24 YARS బాలిస్టిక్ క్షిపణికి కలదు. 49.6 టన్నుల ఖండాంతర ఆయుధానికి 12,000 కిలోమీటర్ల పరిధి ఉంది. RS-24 YARS బాలిస్టిక్ క్షిపణులు గంటకు 24,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇది మూడు దశల ఘన ఇంధన క్షిపణి, ఇది మూడు రీఎంట్రీ వెహికల్స్(RV), చొచ్చుకుపోయే పేలోడ్‌ను కలిగి ఉంటుంది.

T-34, T-90 ట్యాంకులు..

డిజైన్, ట్యాంక్ వ్యూహాలపై సోవియట్ మీడియం ట్యాంక్‌ T-34 శాశ్వత ప్రభావాన్ని చూపాయి. 1940లో T-34 సైన్యంలో చేరింది. అత్యంత ప్రభావవంతమైన రూపకల్పనగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో దీనికి గుర్తింపు వచ్చింది. T-34కి ఉన్న బెస్ట్‌ బ్యాలెన్స్‌ ఆఫ్‌ ఫైర్‌ పవర్‌, మొబిలిటీ, ప్రొటెక్షన్‌, రగడ్‌నెస్‌ ఏ ట్యాంక్‌కు లేవని నివేదికలు తెలుపుతున్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందిన, అత్యంత సామర్థ్యం గల రష్యన్ ట్యాంక్‌గా మూడో తరం రష్యన్ ప్రధాన యుద్ధ ట్యాంక్ T-90 నిలిచింది. 2020 ప్రారంభంలో రష్యా సైన్యంలో చేరిక, ప్రస్తుతం 100 T-90Mలు మాత్రమే ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. అప్‌గ్రేడ్ చేసిన T-90M ట్యాంక్ Relikt అంతర్నిర్మిత ఎక్స్‌ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ (ERA)తో ఆర్మర్‌ ప్రొటెక్షన్‌..

ట్యాంక్‌లో ఉన్న స్మోక్‌ గ్రెనేడ్ లాంచర్‌లను ప్రేరేపించే కౌంటర్‌ మెజర్‌ సిస్టమ్‌ ఉన్నాయి. ట్యాంక్‌లో NBC(న్యూక్లియర్, బయోలాజికల్ & కెమికల్) ప్రొటెక్షన్‌, ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్‌ ఏర్పాటు చేశాయి.

Snooze at work : ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్..మధ్య్నాహం ఓ అరగంట హాయిగా నిద్రపోవచ్చు

S-400 డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్..

S-400 అనేది మొబైల్ లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (LR-SAM) సిస్టమ్. దీనికి స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, బాంబర్‌లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, UAVలతో సహా వైమానిక లక్ష్యాలను ఛేదించగల శక్తి ఉంటుంది. నాలుగు రకాల క్షిపణులను కలిగి ఉన్న దీనికి విజువల్ రేంజ్(BVR) లక్ష్యాలను దాటి 400 కిలోమీటర్ల పరిధి వరకు చేరగల సామర్థ్యం ఉంటుంది. రెండు వేర్వేరు రాడార్ వ్యవస్థలు 600 కి.మీల పరిధిలోని వైమానిక లక్ష్యాలను గుర్తించగలవు. S-400 ఏకకాలంలో 80 వైమానిక లక్ష్యాలను చేరుకోగలదు.

‘డూమ్స్‌డే’ ఫ్లైఓవర్ రద్దు..

క్రెమ్లిన్ విధ్వంసం అనుమానాల మధ్య సోవియట్ 'డూమ్స్‌డే' రోజున ఫైటర్ ప్లేన్ ఫ్లైఓవర్‌ రద్దు చేసింది. 'ఫ్లయింగ్ క్రెమ్లిన్' అని కూడా పిలిచే ఇల్యుషిన్ II-80, ఈవెంట్‌కు ముందు రాజధాని చుట్టూ ఎగురుతున్నట్లు గుర్తించారు. గతంలో రెడ్ స్క్వేర్‌పై తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపిస్తుందని క్రెమ్లిన్ అధికారులు ధ్రువీకరించారు.


పుతిన్ అనారోగ్యంపై ఊహాగానాలు..

రష్యా విక్టరీ డే పరేడ్‌లో దగ్గుతూ కనిపించిన వ్లాదిమిర్ పుతిన్, ఆయన ఆరోగ్యంపై మరిన్ని పుకార్లు వస్తున్నాయి. భారీ కవాతును పర్యవేక్షిస్తున్నప్పుడు భారీ దుప్పటిని కప్పుకొని రష్యా నాయకుడు కనిపించాడు. పుతిన్ క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధి రెండింటికీ చికిత్స పొందుతున్నట్లు కొన్ని మీడియా నివేదికలు తెలిపాయి. అవి ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియదు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Victory day

ఉత్తమ కథలు