సోవియట్(Soviet) కాలం నాటి ఎక్స్‌పరిమెంటల్ ట్యాంక్‌ను రష్యా(Russia) పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. మాస్కో సమీపంలోని కుబింకా ట్యాంక్ మ్యూజియంలో ఆబ్జెక్ట్ 279 ట్యాంక్ పునరుద్ధరించారు. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలలో భారీ ట్యాంక్‌ను పరీక్షిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే మనుగడలో ఉన్న ఏకైక ఆబ్జెక్ట్ 279 ట్యాంక్ ఇదేనని రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఆబ్జెక్ట్ 279 ట్యాంక్ అనేది ఎలా ఉండేదంటే.. 1957లో లెనిన్‌గ్రాడ్‌లోని కిరోవ్ ప్లాంట్‌లో ఆబ్జెక్ట్ 279 ట్యాంక్ అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. 1959 నాటికి నమూనా పూర్తయినా.. భారీ ట్యాంకుల ఉత్పత్తులను సోవియట్ యూనియన్ చేపట్టలేదు. క్యాస్ కంట్రీ టెరైన్‌లో పోరాడేందుకు వీలుగా భారీ ట్యాంకు నమూనా సిద్ధం చేశారు. సోవియట్ తయారు చేసిన లోసెఫ్ స్టాలిన్ సిరీస్‌కి చెందినవే ఈ లాజికల్ ఎక్స్‌టెన్షన్ ఆబ్జెక్ట్ 279. వరల్డ్ వార్ 2లో బలమైన శత్రు మార్గాలను ఛేదించడానికి ఈ 60 టన్నుల వాహనాన్ని సోవియట్ యూనియన్ ఉపయోగించింది. ఈ వాహనం.. చిత్తడి నేలలు, కత్తిరించిన చెట్లు పడిఉన్న నేల, మంచు ప్రాంతాల్లోనూ ప్రయాణించగల సామార్థం ఉంటుంది.
ఆబ్జెక్ట్ 279 ట్యాంక్ ఫీచర్స్ ఇవే..
ఆపరేషనల్ రేంజ్: 300 కి.మీ కాగా.. గరిష్ఠ వేగం గంటకు 55 కి.మీ ఉంటుంది. దీని బరువు 60 మెట్రిక్ టన్నులు. దీనిలో డ్రైవర్, లోడర్, గన్నర్, కమాండర్ కు చోటు ఉంటుంది. ప్రధాన ఆయుధం 130 MM M-65 రైఫిల్ ట్యాంక్ గన్. సెకండరీ ఆర్మమెంట్ 14.5 × 114 MM KPVT కోక్సియల్ మెషిన్ గన్. 1950 కాలంలో ఈ ట్యాంక్ ఫీచర్లే అత్యాధునికం. ఆబ్జెక్ట్ 279కు పటిష్ఠమైన రక్షణ కవచం మందం సుమారు 12.5 అంగుళాలు ఉంటుంది. ఆబ్జెక్ట్ 279లో సెమీ ఆటోమేటిక్ లోడర్ 130mm ఫిరంగి, ఇన్‌ఫ్రారెడ్ సైట్స్, ర్యాడార్ రేంజ్ ఫైండర్ ఉన్నాయి.
ప్రపంచ యుద్ధం-IIIలో అణ్వాయుధంగా ఉపయోగించే ఉద్దేశంతో ట్యాంక్ తయారు చేశారు. అణు విస్ఫోటనం నుంచి వెలువడే షాక్ వేవ్‌ను కూడా తట్టుకునేలా ఆబ్జెక్ట్ 279 ట్యాంక్ ససిద్ధం చేశారు. హల్ ఆకారం ద్వారా అణు పేలుడులో బోల్తా కొట్టే అవకాశాలు కూడా తక్కువని నివేదికలు పేర్కొంటున్నాయి. అణు యుద్ధాలకు సిద్ధం చేసిన కారణంగా సిబ్బందికి అణు, జీవ, రసాయన రక్షణ వ్యవస్థలు ఉండే అవకాశం ఉంటుంది.
Explained: భారత్‌కు చమురుపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఆఫర్ చేసిన రష్యా.. దీనివల్ల ప్రయోజనం ఏంటి..?
ఉక్రెయిన్‌తో పోరాడేందుకు సోవియట్ ఎరా ట్యాంక్‌ను రష్యా పునరుద్ధరిస్తోందా..?
ఇప్పటి వరకు యుద్ధంలో ఆబ్జెక్ట్ 279 ట్యాంక్‌లు పాల్గొనలేదు. భారీ సైనిక వాహనాలను రద్దు చేసి, అణ్వాయుధాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని 1960లలో సోవియట్ యూనియన్ నిర్ణయించింది. వేగంగా భారీ ట్యాంకుల నిల్వలు తగ్గించడం, ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. ఆధునిక రష్యన్ ట్యాంకులు ఉక్రెయిన్‌లో విఫలమవుతున్న సమయంలో తెరైపైకి ఆబ్జెక్ట్ 279 ట్యాంక్‌ల పునరుద్ధరణ అనే అశం వచ్చింది. ఉక్రెయిన్‌లో ఈ ట్యాంకులను ఉపయోగించే అవకాశాన్ని రష్యా పరిశీలిస్తున్నట్లు సైనిక నిపుణుల విశ్లేషణలో తెలుస్తోంది. ట్యాంకులను పునరుద్ధరించడానికి, యుద్ధభూమిలోకి ప్రవేశపెట్టడానికి రష్యాకు ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War