హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

స్కూల్ లో విచక్షణ రహితంగా కాల్పులు.. 13 మంది దుర్మరణం.. 20 మందికి పైగా గాయాలు..

స్కూల్ లో విచక్షణ రహితంగా కాల్పులు.. 13 మంది దుర్మరణం.. 20 మందికి పైగా గాయాలు..

కాల్పుల ఘటన జరిగిన ప్రదేశం

కాల్పుల ఘటన జరిగిన ప్రదేశం

Russia School Shooting: స్కూల్ ఆవరణలో ప్రవేశించిన దుండగుడు ఇష్టమోచ్చినట్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దాదాపు 13 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

స్కూల్ ఆవరణలో దుండగుడు ప్రవేశించాడు. కాసేపటికే అక్కడున్న అమాయకులపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు సంఘటన స్థలంలోనే మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా దీనిపై ఉడ్ముర్టియా ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ ఒక వీడియో ప్రకటనలో మాట్లాడుతూ, ఇప్పటికీ గుర్తు తెలియని షూటర్ ఈ ప్రాంత రాజధాని ఇజెవ్స్క్‌లోని పాఠశాలలోకి ప్రవేశించి ఒక గార్డును, అక్కడ ఉన్న కొంతమంది పిల్లలను చంపాడు. ఉరల్స్ ప్రాంతంలో ఉన్న సుమారు 6,50,000 మంది నివాసితులు ఉన్న నగరంలోని స్కూల్ నంబర్ 88లో ఈ సంఘటన జరిగింది.

పాఠశాలలో 1 నుంచి 11వ తరగతి వరకు పిల్లలకు క్లాసులు నడుస్తున్నాయి. ఇంతలో ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. గవర్నర్, స్థానిక పోలీసుల కథనం ప్రకారం... విద్యార్థులపై కాల్పులు జరిపాక.. సాయుధుడు తనను తాను కాల్చుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. పాఠశాల ఖాళీ చేయించి, దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కంచె వేయబడిందని అధికారి తెలిపారు. కాగా దుండగుడు ఆ తర్వాత.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆగంతకుడు.. స్కీ మాస్క్, నాజీ చిహ్నాలతో కూడిన నల్లటి టీ-షర్టు ధరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై.. స్థానిక ఎంపి మాట్లాడుతూ, "సాయుధుడు ప్రాణాంతకమైన రెండు పిస్టల్స్‌తో ఆయుధాలు కలిగి ఉండి దానితో కాల్పులు జరిపాడని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను ఖాళీ చేయించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు, ప్రభుత్వ నిర్వహణలోని TASS న్యూస్ ఏజెన్సీ నివేదించింది. బాధితుల్లో ఉపాధ్యాయులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఫుటేజీలో తరగతి గది నేలపై రక్తం, కిటికీలో బుల్లెట్ రంధ్రం, పిల్లలు డెస్క్‌ల క్రింద వంగి ఉన్నట్లు చూపించాయి. ఇజెవ్స్క్ మాస్కోకు తూర్పున 960 కిలోమీటర్ల (596 మైళ్ళు) దూరంలో మధ్య రష్యాలోని ఉరల్ పర్వతాలకు పశ్చిమాన ఉంది.

ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య దశాబ్దాల పాటు జరుగుతున్న వివాదం ఇటీవల మరింత ముదిరిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌ పై ముప్పేట దాడి చేసేందుకు అన్ని విధాల సిద్ధమైన రష్యా .. సరిహద్దుల్లోభారీగా సైనికులను మోహరించింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిణామాలను యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలోనే తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పుల మోత కలకలం రేపింది. రష్యా మద్దతు కలిగిన వేర్పాటు వాదులు-ఉక్రెయిన్‌ సైనికుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ ఇద్దరు పౌరులకు గాయాలైనట్లు సమాచారం.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Gun fire, Russia

ఉత్తమ కథలు