RUSSIA SCATTERS UKRAINIAN TERRITORY WITH MINES MOSCOW EMPLOYS ADVANCE MINE LAYING SYSTEMS IN UKRAINE GH VB
Ukraine-Russia War: పారని రష్యా ఎత్తులు.. తుస్సుమంటున్న బాంబులు..! ఉక్రెయిన్ లో జరుగుతోంది ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు అడ్వాన్స్డ్ మైన్స్ లేయింగ్ సిస్టమ్(Advanced laying systems) ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రష్యా(Russia) వినియోగిస్తున్న మైన్స్ లేయింగ్ సిస్టమ్ జెమ్లెడెలియేగా గుర్తించారు.
ఉక్రెయిన్‌లో రష్యా(Ukraine-Russia) సైనికులు అడ్వాన్స్డ్ మైన్స్ లేయింగ్ సిస్టమ్(Advanced laying systems) ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రష్యా(Russia) వినియోగిస్తున్న మైన్స్ లేయింగ్ సిస్టమ్ జెమ్లెడెలియేగా గుర్తించారు. ఖార్కివ్‌లో రెండు వాహనాల నుంచి 50 మైన్ లోడెడ్ రాకెట్లను ప్రయోగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. జెమ్లెడెలియే మైన్ లేయింగ్ సిస్టమ్ అనేది.. జెమ్లెడెలియే మల్టిపుల్ రాకెట్ సిస్టమ్‌తో(System) సమానం. వివిధ రకాల ల్యాండ్మైన్లను మోసుకెళ్లి పేల్చగల శక్తి దీని సొంతం. ఈ వ్యవస్థలో 50 రాకెట్లతో కూడిన లాంచ్ వెహికల్, వెనుక భాగంలో రీలోడింగ్ క్రేన్ అమర్చిన ట్రాన్స్లోడర్ వాహనం ఉంటాయి. యాంటీ పర్సనల్ లేదా యాంటీ ట్యాంక్ మైన్స్‌తో నింపి ఉండే రాకెట్ పొడవు 122 మి.మీ ఉంటుంది. POM-3 మైన్స్‌ను 5 నుంచి 15 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించగల జెమ్లెడెలియే మైన్ లేయింగ్ రాకెట్ లాంచర్.
గాలి, భూమిపై నుంచి ప్రయోగించగల POM-3 మెడాలియన్ అనేది హై ఎక్స్‌ప్లోజివ్ ల్యాండ్‌మైన్. ఇందులోని సెస్మిక్ సెన్సార్ సాయంతో సమీపించే వ్యక్తిని గుర్తించి గాల్లోకి ఎక్స్‌ప్లోజివ్ ఛార్జ్ విడుదల చేయగల సత్తా దీనికి ఉంటుంది. అది ప్రొజెక్ట్ చేసే ఛార్జ్, లోహ శకలాల విస్ఫోటనంతో 16 మీటర్ల రేడియస్‌లోని వారు మరణించే లేదా గాయపడే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో వినియోగించే మైన్స్ ప్రోగ్రామబుల్.. భవిష్యత్తులో సెల్ఫ్ డిస్ట్రక్టెడ్ లేదా డీయాక్టివేట్ చేయవచ్చు. KamAZ-6560 8×8 ట్రక్కు, ఆయుధాల క్యాబిన్‌తో అనుసంధానమై ఉండే లాంచర్, ట్రాన్స్లోడర్.. రిమోట్ మైన్ లేయింగ్ సిస్టమ్‌తో కఠిన ప్రదేశాల్లో చాలా వేగంగా మైన్స్ ప్రయోగించే అవకాశం ఉంటుంది.
రక్షణ పొందడానికి, దాడులు చేయగడానికి ఉపయోగపడే ఈ మైన్స్‌కు శత్రువులను ముందుకు రాకుండా అడ్డుకునే విధంగా శక్తి ఉంటుంది. అటువంటి వ్యవస్థల పంపిణీకి సంబంధించి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, స్ప్లావ్ ఎంటర్ప్రైజ్ మధ్య 2013 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. 2020 జూన్ లో మాస్కోలో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో జెమ్లెడెలియే మైన్స్ లేయింగ్ సిస్టమ్ ఆవిష్కరించారు. 1941-1945లో నాజీ జర్మనీపై యుద్ధంలో సోవియట్ యూనియన్ గెలిచి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విక్టరీ పరేడ్ నిర్వహించారు.
ఉక్రెయిన్‌లో బూబీ ట్రాప్లను రీస్టోర్ చేస్తున్న రష్యా..?
తిరిగివెళ్తున్న సమయంలో రష్యా సైన్యం బూబీ ట్రాప్లను ఏర్పాటు చేస్తుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆహార సదుపాయాలు, ప్రైవేట్ హౌసింగ్, మృతదేహాలపై కూడా రష్యా మైన్స్ పెడుతున్నట్లు సమాచారం. మొత్తం భూభాగంలో రష్యా మైన్స్ పెడుతున్నట్లు తమ ప్రజలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అప్రమత్తం చేశాడు. యుద్ధంలో నిషేధిత యాంటీ పెర్సనల్ మైన్స్‌ను రష్యా ఉపయోగిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా ఆరోపిస్తోంది. 1997లోనే యాంటి పెర్సనల్ మైన్స్ వినియోగం, ఉత్పత్తి, నిల్వ, తరలింపును ఇంటర్నేషనల్ మైన్ బ్యాన్ ట్రీటీ నిషేధించింది. ఈ ట్రీటీ ఒప్పందంలో చేరిన 164 దేశాల్లో రాష్యా భాగం కాదు.
ఉక్రెయిన్ భూభాగంలో రష్యా మైన్స్ ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి కాదని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 2014లో జరిగిన ఘర్షణ తర్వాత లుహాన్స్క్, డొనెట్స్క్లో 16,000 చ.కి.మీ మేర మందుపాతరలను తాము తొలగించాల్సి వచ్చిందని ఉక్రెయిన్ చెబుతోంది. భయంలేని ఉక్రెయిన్లను అడ్డుకోవడంలో రష్యా మైన్స్ విఫలం అయ్యాయి. ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేసినా ఉక్రెయిన్ కదలికలను రష్యా అడ్డుకోలేకపోయింది. కీవ్ సమీపంలో రష్యా బలగాలు ఏర్పాటు చేసిన మైన్స్ సమీపంలో ఉక్రెయిన్ డ్రైవర్లు కార్లు నడుపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. వీడియోలో మైన్స్ ట్రాప్ దాటిన మూడు కార్లు, నిర్భయంగా ట్రైలర్ లాగుతూ ఓ డ్రైవర్ కనిపించాడు. మరో వీడియోలో మైన్స్‌ను రోడ్డు పక్కకు బూటు కాళ్లతో తోస్తూ ఉక్రెయిన్ సైనికులు కనిపించారు.
యాంటీ ట్యాంక్ ఫ్యూజింగ్ ద్వారా మైన్స్‌ని యాక్టివేట్ చేయడానికి దాదాపు 100- 300 కిలోల ఒత్తిడి అవసరమని రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. సాధారణ కారు సగటు బరువు 1885 కిలోలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల కదలికలను, దైనందిన కార్యక్రమాలను యాంటీ-వెహికల్ మైన్స్ నిరోధిస్తాయని యూఎన్ తెలిపింది. మారియుపోల్ నగరం నుంచి వెళ్తూ రష్యా మైన్స్ ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణల అనంతరం UN ఈ ప్రకటన వెలువరించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.