హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Dirty Bomb : ఉక్రెయిన్ పై రష్యా దాడికి అసలు కారణం ఇదేనట..న్యూక్లియర్ "డర్టీ బాంబ్" రెడీ చేస్తున్న ఉక్రెయిన్!

Dirty Bomb : ఉక్రెయిన్ పై రష్యా దాడికి అసలు కారణం ఇదేనట..న్యూక్లియర్ "డర్టీ బాంబ్" రెడీ చేస్తున్న ఉక్రెయిన్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ukraine making nuclear dirty bomb : నాటోలో చేరేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నించటమే రష్యాను ఆ దేశంపై యుద్ధానికి ఉసిగొల్పినట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ, ప్రస్తుత యుద్ధం వెనుక మరో బలమైన కారణం ఉన్నట్లు తాజా రష్యన్‌ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. రష్యాతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరగానే ఉక్రెయిన్‌ అణు ఆయుధాల తయారీని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైంది.

ఇంకా చదవండి ...

Russia-Ukraine War : ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు నగరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసిన రష్యా దళాలు ఇప్పుడు ఉక్రెయిన్ లోని అణు విద్యుత్ కేంద్రాలపై మిసైల్స్‌ తో దాడులకు దిగుతోంది. అయితే తాజాగా రష్యా మీడియా సంచలన కథనాలను ప్రచురించింది. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నించటమే రష్యాను ఆ దేశంపై యుద్ధానికి ఉసిగొల్పినట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ, ప్రస్తుత యుద్ధం వెనుక మరో బలమైన కారణం ఉన్నట్లు తాజా రష్యన్‌ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. రష్యాతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరగానే ఉక్రెయిన్‌ అణు ఆయుధాల తయారీని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైందని,ఇందుకు రష్యా అణు సాంకేతికతనే వాడుకోవాలని ఉక్రెయిన్‌ చూసిందని పుతిన్(Putin)చెప్పారని, ఇదే రష్యాను మరింత త్వరగా ఉక్రెయిన్‌ పై దాడి చేసేలా ప్రేరేపించిందని రష్యా మీడియా తాజాగా పేర్కొంది. ప్రస్తుతం రష్యా చేసిన ఈ సంచలన ఆరోపణలు ప్రపంచ దేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత 1994లో అణ్వాయుధాలను వదులుకుంటున్నట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిందని...ఉక్రెయిన్ తిరిగి అణుబాంబు త‌యారు చేయ‌డం అంటే అది ర‌ష్యాపై యుద్దం ప్రకటించడమేనంటూ పుతిన్ వ్యాఖ్యానించినట్లు రష్యన్‌ మీడియా పేర్కొంది.

ఉక్రెయిన్‌ తయారు చేయబోయే అణ్వాయుధానికి "డర్టీ బాంబ్‌(Dirty Bomb)"అని పేరు కూడా పెట్టినట్లు రష్యా మీడియా వివరించింది. ప్లుటోనియం ఆధారంగా తయారు చేసే న్యూక్లియర్ వెపన్(Nuclear Weapon)ఇది అని వివరించింది. అణ్వాయుధ తయారీకి కావాల్సిన ఫ్లూటోనియంను అమెరికా సరఫరా చేసే అవకాశం లేకపోలేదని రష్యాకు చెందిన ఓ అధికారి అన్నారు. యూరేనియంను సమకూర్చుకునే ప్రయత్నాలను ఉక్రెయిన్‌ ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఇందుకోసం యూరేనియం గనుల్లో మరింత లోతు వరకు తవ్వకాలు జరుపుతున్నట్లు వివరించారు. అటు కీవ్‌ ప్రతినిధులు యూరేనియాన్ని శుద్ధి చేసే సంస్థలతోనూ సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. తమకంటూ సొంతంగా యూరేనియం శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసేలా కీవ్‌ ప్రతినిధులు సంబంధిత కంపెనీలకు సూచించినట్లు పేర్కొన్నారు. సోవియట్ యూనియన్ విచ్చిన్నం తర్వాత ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని 2000లో మూసివేశారు. ఈ ప్లాంట్‌ లోనే ఇప్పుడు ఉక్రెయిన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తున్నదని రష్యా మీడియా పేర్కొంది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్‌ ప్లాంట్‌ లో ఉక్రెయిన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందన్న రష్యా ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యల‌ను ఆ దేశ వార్త సంస్థలు టీఏఎస్​ఎస్​, ఆర్​ఐఏ, ఇంటర్‌ఫాక్స్, ఆదివారం ప్రచురించాయి.

ALSO READ Russia Ukraine War: యుద్ధం జరుగుతోంది అక్కడ..ప్రభావం ప్రపంచ దేశాలపైన..

అయితే రష్యా ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌ పై దాడి చేయడానికి ముందు వ్లాదిమిర్ పుతిన్ ఇదే విధంగా ఆరోపించారు. సోవియట్ యూనియన్ ఉనికిలో ఉన్నప్పుడు వినియోగించిన టెక్నాలజీని ఉక్రెయిన్ ఇప్పుడు ఉపయోగిస్తున్నదని, ఆ టెక్నాలజీ ఆధారంగానే ఉక్రెయిన్ స్వతహాగా న్యూక్లియర్ మరణాయుధాలను తయారు చేస్తున్నదని అన్నారు.

ALSO READ Pune:వంద కేజీల వెజ్‌ ఐస్‌ కేక్‌కి వరల్డ్ రికార్డ్..ఆమె చేతిలో మాములు ఆర్ట్‌ లేదంటే నమ్మండి

కాగా, డర్టీ బాంబ్.. న్యూక్లియర్ బాంబ్ రెండు వేరు. న్యూక్లియర్ బాంబ్ భారీ పేలుడు కలిగిస్తుంది. డర్టీ బాంబు పేలుడు కంటే అణుబాంబు తీవ్రత కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. డైనమైట్, రేడియో యాక్టివ్ పౌడర్, పెల్లెట్ల మిశ్రమంగా ఈ డర్టీ బాంబ్ ఉంటుంది. న్యూక్లియర్ బాంబు పేలుడు వల్ల వేలాది చదరపు మైళ్ల దూరం రేడియేషన్ వ్యాపిస్తుంది. డర్టీ బాంబ్ విధ్వంసాన్ని సృష్టించే బాంబ్ కాదు. ఈ బాంబులు మనిషి ప్రాణాలు తీసేసేంత రేడియేషన్‌ను విడుదల చేయవు. పేలుడుతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరగవచ్చని, కానీ దాని నుంచి వచ్చే రేడియో యాక్టివ్ తరంగాలు పెద్దగా ప్రాణ హానీ తలపెట్టకపోవచ్చు. అయితే, ఈ డర్టీ బాంబ్ పేలుడు వల్ల భయాందోళనలు సృష్టించవచ్చు. అది పేలిన ప్రాంతంలో తీవ్ర కాలుష్యాన్ని వ్యాపించడమే ఈ బాంబ్ ప్రధాన లక్ష్యం అని యూఎస్ న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ తెలిపింది.

అయితే రష్యా చేస్తున్న ఈ వాదనలకు ఆధారాల్లేవు. కానీ, ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నది. తాము మళ్లీ న్యూక్లియర్ క్లబ్ లో చేరాలనే ఆలోచనలు లేవని కొట్టిపారేస్తున్నది.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin, Zelensky

ఉత్తమ కథలు