హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War : ఉక్రెయిన్ పై యుద్ధంలో తొలిదశ పూర్తి..ప్రకటించిన రష్యా

Russia-Ukraine War : ఉక్రెయిన్ పై యుద్ధంలో తొలిదశ పూర్తి..ప్రకటించిన రష్యా

Russia-Ukraine War : ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను రష్యా మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను వీడి ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్లి శరణార్థులుగా మారిన వారి సంఖ్య కోటికి చేరిందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ (UNHCR)తెలిపింది. ఎక్కువ మంది సరిహద్దు దేశమైన పోలండ్ కు వెళ్లారు.

ఇంకా చదవండి ...

First phase of Ukraine operation complete : ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా.. పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్‌ అస్తవ్యస్తమైంది. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. భారీ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను ఫిబ్రవరి 24న రష్యా మొదలుపెట్టింది. అయితే ఉక్రెయిన్‌లో చేపట్టిన సైనిక చర్య మొదటి దశ దాదాపు పూర్తికావచ్చిందని రష్యా శుక్రవారంప్రకటించింది. ఇక తమ తదుపరి లక్ష్యం డాన్‌బాస్‌ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడమేనని స్పష్టం చేసింది. యుద్ధంలో చనిపోయిన మాస్కో సేనల సంఖ్యపై రష్యా అధికారిక ప్రకటన చేసింది. యుద్ధంలో ఇప్పటివరకు 1,351 మంది రష్యా బలగాలు చనిపోయినట్లు రష్యా మిలటరీ స్టాఫ్‌ డిప్యూటీ హెడ్‌ ప్రకటించారు. మరో 3,825 మందికి గాయాలైనట్లు స్పష్టం చేశారు. మరోవైపు,తమపై దాడి చేస్తున్న 16వేలకు పైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్‌ తాజాగా ప్రకటించింది. అటు నాటో కూటమి కూడా 7 వేల నుంచి 15 వేలమంది రష్యా సేనలు మరణించినట్లు పేర్కొంది.+

ఇక,తమ దేశ సంస్కృతిపై పశ్చిమ దేశాలు వివక్ష చూపుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఆరోపించారు. రష్యన్‌ సంగీతం, సాహిత్యంపై ఆంక్షల పరిణామాలను 1930ల్లో నాజీ మద్దతుదారులు పుస్తకాలను తగులబెట్టిన ఘటనతో పోల్చారు. "ఈ రోజు పశ్చిమ దేశాలు వెయ్యేళ్ల పురాతన రష్యా సంస్కృతిని తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రష్యాకు సంబంధించిన విషయాలపై వివక్ష గురించి నేను మాట్లాడుతున్నా"అని పుతిన్ కళాకారులతో నిర్వహించిన ఓ టెలివిజన్ సమావేశంలో అన్నారు.

ALSO READ Video : సౌదీ ఆయిల్ డిపోపై హౌతీ రెబల్స్ దాడి..F1 ట్రాక్ సమీపంలో ఎగసిపడ్డ మంటలు

ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా 30వ రోజు ఖర్కివ్‌ సహా పలు నగరాల్లో దాడులు నిర్వహించింది. ఖర్కివ్‌ లో మానవతా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన క్లినిక్‌పై పుతిన్‌ సేనలు రాకెట్‌ లాంచర్లతో జరిపిన దాడిలో నలుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గాయపడినట్లు చెప్పారు. కీవ్‌ వెలుపల ఉన్న ఉక్రెయిన్‌ ప్రధాన ఇంధన డిపోను క్షిపణులతో ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌ బలగాల ప్రతిఘటనతో కీవ్‌ శివార్లలో మాస్కో సేనలు వెనక్కితగ్గినట్లు బ్రిటన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. కీవ్‌ కు తూర్పున 35కిలోమీటర్ల వరకు పట్టణాలు, రక్షణ స్థావరాలను ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా 1200 క్షిపణులు ప్రయోగించగా అందులో సగానికిపైగా గురి తప్పినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది.

ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను రష్యా మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను వీడి ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్లి శరణార్థులుగా మారిన వారి సంఖ్య కోటికి చేరిందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ (UNHCR)తెలిపింది. ఎక్కువ మంది సరిహద్దు దేశమైన పోలండ్ కు వెళ్లారు. ప్రస్తుతం పోలాండ్‌లో దాదాపు 12-13 లక్షల మంది శరణార్థులు ఉన్నట్లు వార్సా యూనివర్సిటీలో మైగ్రేషన్ రీసెర్చ్ ప్రొఫెసర్‌ మాసీజ్ డస్జ్‌జిక్ అంచనా వేశారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin, Zelensky

ఉత్తమ కథలు