హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia Remote Weapon Station: రిమోట్ వెపన్ స్టేషన్ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా.. BPM-97 అంటే ఏంటి..?

Russia Remote Weapon Station: రిమోట్ వెపన్ స్టేషన్ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా.. BPM-97 అంటే ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిమోట్ వెపన్ స్టేషన్‌ ఉత్పత్తిని రష్యా ప్రారంభించింది. యుద్ధం నేపథ్యంలో BM-30D సీరియల్ ప్రొడక్షన్‌ ప్రారంభించింది. BPM-97లో రిమోట్ వెపన్ స్టేషన్ ను అమర్చనున్నది.

రిమోట్ వెపన్ స్టేషన్‌(Weapon Station) ఉత్పత్తిని రష్యా ప్రారంభించింది. యుద్ధం(War) నేపథ్యంలో BM-30D సీరియల్ ప్రొడక్షన్‌ ప్రారంభించింది. BPM-97లో రిమోట్ వెపన్ స్టేషన్ ను అమర్చనున్నది. ఆవిష్కరించిన కొన్ని రోజుల తర్వాత, రిమోట్‌గా(Remote) ఆపరేట్ చేసే వెపన్ స్టేషన్ BM-30D సీరియల్ ఉత్పత్తిని రష్యా ప్రారంభించింది. ఈ సిస్టమ్‌ను 4x4 సాయుధ వాహనం BPM-97 KamAZ-43269 Vystrelలో అధికారులు అమర్చనున్నారు. ఈ సిస్టమ్‌ను రష్యన్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ BUREVESTNIK అభివృద్ధి చేసింది. మే 9న నిజ్నీ నొవ్‌గోరోడ్‌లో జరిగిన విజయోత్సవ పరేడ్‌లో ఈ సిస్టమ్‌ను తొలిసారిగా అధికారులు ఆవిష్కరించారు. దీనిలో BM-30D ఫైర్‌పవర్, 2A42 30mm ఆటోమేటిక్ ఫిరంగి, 7.62mm PKTM కో యాగ్జియల్ మెషిన్ గన్, మెయిన్ గన్ పైన ఇన్‌స్టాల్ చేసిన ఆప్టోఎలక్ట్రానిక్ సూట్‌లో ఉన్న డే/నైట్ విజన్, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు, లేజర్ రేంజ్‌ఫైండర్ ఉన్నాయి.

BPM-97 అంటే ఏంటి..?

BPM-97 అనేది రష్యా డిజైన్ చేసిన KAMAZ-43269 Vystrel, 4×4 చక్రాల మైన్-రెసిస్టెంట్ ఆంబుష్ ప్రొటెక్టెడ్ (MRAP) వెహికల్. VYSTREL ఫీచర్ల విషయానికి వస్తే.. 240 hp టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, టూ-యాక్సిల్, ఫోర్-వీల్-డ్రైవ్, గంటకు 90 కి.మీ మ్యాగ్జిమం రోడ్ స్పీడ్, మ్యాగ్జిమం క్రూజింగ్ రేంజ్ 1,100 కి.మీ ఉంటుంది. వెల్డెడ్ అల్యూమినియం బాడీతో అమర్చిన KAMAZ-4326 ట్రక్ చట్రంపై వెహికల్ ఆధారపడి ఉంటుంది. APC(ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్ వెహికల్)గా ఉపయోగించేందుకు కన్వెన్షనల్ డిజైన్‌లో BPM-97 Vystrelను రష్యా రూపొందించింది. రష్యన్ బోర్డర్ గార్డ్స్ కోసం రూపొందించిన ఈ వాహనం 12 మంది సిబ్బందికి వసతి కల్పించగలదు.

Explained: అప్పట్లోనే దేశద్రోహ చట్టాన్ని వ్యతిరేకించిన స్వతంత్ర సమరయోధులు.. దీనిపై తిలక్, గాంధీ, నెహ్రూ ఏమన్నారంటే..


ప్రమాదకరంగా మారనున్న BPM-97

ఇప్పటివరకు కేవలం 7.62mm లేదా 12.7mm మెషిన్ గన్‌ మాత్రమే Vystrel కలిగిక ఉంది. ఎపోచ్ BM-30D RCWS అమర్చిన వైస్ట్రెల్ లక్ష్యం.. అన్ని భూభాగాలు, పరిస్థితులలో దూకుడుగా మరింత మందుగుండు సామగ్రిని అందించడం. RCWSతో పగలు/రాత్రి పోరాట సామర్థ్యాల కోసం ఆప్టిక్స్‌తో కూడిన కొత్త ఆయుధ స్టేషన్‌ను, ఫైర్ కంట్రెల్ సిస్టమ్‌ను సిబ్బంది పొందనున్నారు. కవచం రక్షణలో ఉన్న అన్ని ఫైరింగ్ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకోవడానికి, నియంత్రించడానికి ఉపయోగపడే ఈ రకం టరెట్ గన్నర్ ఉపయోగపడనుంది.

యుద్దభూమిలో రష్యా ఆయుధాలు మెరుగైన ప్రదర్శన చేయగలవా..?

ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు తన లక్ష్యాలను రష్యా సైన్యం సాధించలేకపోయిందనే చెప్పాలి. దీంతో రష్యా హైటెక్ మిలిటరీ హార్డ్‌వేర్ యుద్ధభూమిలో పని చేయగలదా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే అనేక ట్యాంకులు, సాయుధ వాహనాలను రష్యా కోల్పోయింది. యుద్దభూమిలో ఊహించినంత ఆధిపత్యం రష్యా వైమానిక దళం ప్రదర్శించలేదు.

First published:

Tags: Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు