Home /News /international /

RUSSIA PUTIN PREPARING TO USE NUCLEAR WEAPONS AGAINST UKRAINE AND UK OPEN TO EVICTING RUSSIA FROM UN SECURITY COUNCIL PVN

Putin : న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేస్తున్న రష్యా..ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా తొలగింపు!

అణ్వాయుధాలపై పుతిన్ ఆదేశాలు

అణ్వాయుధాలపై పుతిన్ ఆదేశాలు

Russia-Ukraine War : సైబీరియాలోని ఇర్కుత్స్క్‌ ప్రాంతంలో అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను సైనిక బలగాలు తరలించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సముద్ర జలాల్లో నిర్వహించే విన్యాసాల్లో పలు అణు జలాంతర్గాములు పాల్గొంటాయని రష్యాకు చెందిన నార్తర్న్‌ ఫ్లీట్‌ మంగళవారం ప్రకటించింది.

ఇంకా చదవండి ...
Russia preparing to use nuclear weapons :   గత గురువారం నుంచి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం వారిస్తున్నా.. ఉక్రెయిన్‌ పై యుద్ధం మాత్రం ఆపడం లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ పై రష్యా తన దాడులు మరింతగా పెంచుతూపోతోంది. పుతిన్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్‌ లో రష్యా దళాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యన్‌ సైనిక దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తొలుత ఉక్రెయిన్​ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. అయితే అంతర్జాతీయ ఆంక్షలకు తలొగ్గకుండా ఉక్రెయిన్ పై వార్ కొనసాగిస్తున్న రష్యాపై మరింత కఠినంగా వ్యవహరించాలని బ్రిటన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత దేశాల జాబితా నుంచి రష్యాను తొలగించాలని బ్రిటన్ ప్రతిపాదించింది. ఐదు శాశ్వత సభ్య దేశాల నుంచి రష్యాను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. రష్యాకు వ్యతిరేకంగా చేపట్టే చర్యల్లో ఇది కూడా భాగమని ఆయన చెప్పారు. కాగా, ఐరాస భద్రతా మండలిలో ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి.

మరోవైపు, అణ్వాయుధ వ్యవస్థల అప్రమత్తతకు అధ్యక్షుడు పుతిన్​ ఆదేశించిన నేపథ్యంలో రష్యా సైన్యం ఆ దిశగా సన్నాహాలను ముమ్మరం చేసింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై అణుదాడికి దిగడానికి అనుకూలంగా సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా విన్యాసాల కోసం అణు జలాంతర్గాములను బేరెంట్స్‌ సముద్ర జలాల్లోకి తరలించారు. సముద్ర జలాల్లో నిర్వహించే విన్యాసాల్లో పలు అణు జలాంతర్గాములు పాల్గొంటాయని రష్యాకు చెందిన నార్తర్న్‌ ఫ్లీట్‌ మంగళవారం ప్రకటించింది. కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేసేలా వీటిని సిద్ధంగా ఉంచడమే విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. పలు నౌకా స్థావరాలు ఉన్న కోలా దీవి చుట్టూ యుద్ధ నౌకలను రంగంలోకి దించినట్లు వెల్లడించింది.

ALSO READ Russia-Ukraine War : రహస్య అండర్ గ్రౌండ్ బంకర్ లోకి పుతిన్ ఫ్యామిలీ..అణుయుద్ధం జరిగినా సేఫ్

మరోవైపు,సైబీరియా మంచు అడవుల్లో సంచార క్షిపణి ప్రయోగ వ్యవస్థలను మోహరించారు. సైబీరియాలోని ఇర్కుత్స్క్‌ ప్రాంతంలో అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను సైనిక బలగాలు తరలించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఉక్రెయిన్​ పై రష్యా మిలటరీ ఆపరేషన్ అణుయుద్ధానికి దారితీస్తుందన్న భయం అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కాగా,అమెరికా, రష్యాల వద్ద అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్న విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Britain, Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

తదుపరి వార్తలు