Home /News /international /

RUSSIA PRESIDENT VLADIMIR PUTIN COMPARES HIMSELF TO PETER THE GREAT IN QUEST TO TAKE BACK RUSSIAN LANDS AMID UKRAINE WAR GH MKS

Putin | Peter The Great : నేనే ఆధునిక పీటర్ ది గ్రేట్‌ : Ukraine War వేళ పుతిన్ సంచలనం

పుతిన్, 18వ శతాబ్దం నాటి పీటర్ ది గ్రేట్ (ప్రతీకాత్మక చిత్రం)

పుతిన్, 18వ శతాబ్దం నాటి పీటర్ ది గ్రేట్ (ప్రతీకాత్మక చిత్రం)

ఉక్రెయిన్ పై యుద్ధం వల్ల రష్యా చరిత్రలో చూడనంత నష్టాన్ని, ఆంక్షలను ఎదుర్కొంటుండగా, యుద్ధం కొనసాగింపును సమర్థించుకుంటూ, తనను తాను పీటర్ ది గ్రేట్ తో పోల్చుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. నాటి పీటర్ లాగే రష్యా భూమి కోసం తాను పోరాడుతున్నానని చెప్పుకున్నారు..

ఇంకా చదవండి ...
ఉక్రెయిన్ పై రష్యా చేస్తోన్న యుద్ధం (Russia Ukraine War) అంతూ పొంతూ లేకుండా సుదీర్ఘంగా సాగుతోన్న క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) పై సొంత దేశంలో వ్యతిరేకత నానాటికీ పెరుగుతున్నది. అంతర్జాతీయంగా తీవ్ర ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. ఈ నేపథ్యంలో పుతిన్.. యుద్ధం కొనసాగింపును సమర్థించుకుంటూ, తనను తాను పీటర్ ది గ్రేట్ (Peter The Great)తో పోల్చుకున్నారు.

18వ శతాబ్దం నాటి చక్రవర్తి పీటర్ ది గ్రేట్ అప్పట్లో రష్యన్ భూమిని ఇతర దేశాల నుంచి తిరిగి కైవసం చేసుకున్న విధంగానే ఇప్పుడు తానూ వ్యవహరిస్తున్నానని పుతిన్ చెప్పుకున్నారు. యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే సమయంలో పీటర్ ది గ్రేట్ కు సంబంధించిన చారిత్రక అంశాలూ మళ్లీ చర్చలోకి వచ్చాయి..

Farmers : పెద్ద రైతులకు షాక్.. చిన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు : కేంద్రానికి CACP సంచలన ప్రతిపాదన


ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించుకోవడానికి 18వ శతాబ్దపు జార్‌ చక్రవర్తి పేరును ఉపయోగించుకున్నారు ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్. తనను తాను ఆధునిక ‘పీటర్ ది గ్రేట్’గా ప్రకటించుకున్న పుతిన్.. రష్యా భూమిని కాపాడుతున్నానంటూ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని సమర్థించుకున్నారు. ఉక్రెయిన్‌లో తన చర్యలను రష్యా చక్రవర్తి ‘పీటర్ ది గ్రేట్’ విజయాలతో పోచ్చారాయన.

Petrol Diesel : పెరిగిన ఇంధన డిమాండ్.. ముడి చమురు ధరల షాక్.. పెట్రో బాదుడు తప్పదు!


18వ శతాబ్దంలో స్వీడన్‌పై యుద్ధంలో బాల్టిక్ తీరాన్ని స్వాధీనం చేసుకున్నాడు నాటి రష్యన్ జార్ చక్రవర్తి పీటర్. నాటి యుద్ధం ఏకంగా 21 సంవత్సరాలు కొనసాగింది. పీటర్ ది గ్రేట్ గా గుర్తింపు పొందిన ఆ జార్ చక్రవర్తి 350వ జయంతి సందర్భంగా మాస్కోలో యువ పారిశ్రామికవేత్తల బృందంతో మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాస్కోలో "పీటర్ ది గ్రేట్: ది బర్త్ ఆఫ్ ది ఎంపైర్" అనే ఎగ్జిబిషన్‌లోనూ పుతిన్ పాల్గొన్నారు. ఉక్రెయిన్‌పై తన చర్యలను పీటర్ చేసిన యుద్ధంతో పోల్చుకున్నారు పుతిన్. పీటర్ తమ భూభాగ ఏకీకరణ ప్రయత్నాలు ఆపలేదని, ప్రస్తుతం తాము కూడా సంఘటితం అయ్యామని పుతిన్ సెలవిచ్చారు. పీటర్ ది గ్రేట్- సెయింట్ పీటర్స్‌బర్గ్ స్థాపన, ఆధునిక రష్యా ఆశయాలు కూడా ఒకటేనని చెప్పారాయన.

Modi Govt : సరోగసీ యాడ్స్‌పై కేంద్రం నిషేధం.. పిల్లల్లో తెలివి పెరుగుతుందనే ప్రకటనలపై కూడా..


పీటర్ ది గ్రేట్ రష్యాకు కొత్త రాజధానిని స్థాపించినప్పుడు యూరోపియన్ దేశాలు ఏవీ ఈ భూభాగాన్ని రష్యాగా గుర్తించలేదని గుర్తుచేసిన పుతిన్.. ప్రస్తుత ఉక్రెయిన్‌ యుద్దంలోనూ యురోపియన్, వెస్ట్రన్ దేశాల తీరు మారలేదని పరోక్షంగా విమర్శించారు. రష్యా భూభాగం స్వాధీనం, ఏకీకరణ కోసమే యుద్ధం చేస్తున్నామన్న పుతిన్.. ఉక్రెయిన్‌కు నిజమైన జాతీయ గుర్తింపు లేదా రాష్ట్ర హోదా లేనేలేదని నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌ను నిరాయుధులను చేయడానికి, డీ-నాజిఫై చేయడానికి ఉక్రెయిన్‌కు దళాలను పంపినట్లు చెప్పిన పుతిన్.. రష్యా తిరోగమనాలను ఓటమిగా తీసుకోవద్దని పశ్చిమ దేశాలను హెచ్చరించారు. కాగా, పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడి సీనియర్ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ తప్పు పట్టారు.



* పీటర్ ది గ్రేట్ ఎవరు? : పీటర్ I రష్యా మొదటి చక్రవర్తి. మొదటి జార్ చక్రవర్తిగా రష్యాను 1682 నుంచి 1725లో మరణించే వరకు పీటర్ పరిపాలించారు. రష్యాను 43 సంవత్సరాలు పరిపాలించిన పీటర్, తన పేరుతో కొత్త రాజధాని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను నిర్మించారు. ఇది పుతిన్ స్వస్థలం కూడా. స్వీడన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను నిర్మించి పీటర్ ది గ్రేట్ అయ్యాడా చక్రవర్తి. నిరంకుశ మోడ్రనైజర్‌గా పేరొందిన పీటర్‌కు ఉదారవాద, సంప్రదాయవాద రష్యన్‌ల మద్దతు ఉండేది. గ్రేట్ నార్తర్న్ యుద్ధంలో స్వీడన్ ఓటమితో బాల్టిక్ సముద్రంలో రష్యా అగ్రగామిగా మారింది. అప్పటి నుంచి యూరోపియన్ వ్యవహారాలలో రష్యాది కీలక పాత్రగా ఉంటోంది.



* పీటర్‌తో పుతిన్ పోలిక ఎందుకు సరికాదు? : రష్యాను గొప్ప యూరోపియన్ శక్తిగా మార్చడానికి యూరప్‌లో పర్యటించి ప్రేరణ పొందాడు పీటర్. తన పాలనలో రష్యాను పాశ్చాత్యీకరించే లక్ష్యంతో రాజకీయ, సైనిక, సామాజిక సంస్కరణలను అమలు చేసిన జార్ చక్రవర్తి ఆయన. రష్యాను నౌకాదళ శక్తిగా మార్చి, భూభాగాన్ని భారీగా విస్తరించి ఘనత పొందారు. యూరప్ కు రష్యా ద్వారాలు తెరిచిన వ్యక్తిగా పీటర్ ముద్రపడితే.. ఉక్రెయిన్ పై పుతిన్ దండయాత్రతో ఆ తలుపులు మూతపడ్డాయని నిపుణులు చెబుతారు. ఉక్రెయిన్‌తో సంఘర్షణ కారణంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా పశ్చిమ దేశాలకు రష్యా దూరమైంది. యూరోపియన్ యూనియన్‌కు విమానాలపై నిషేధం, పాశ్చాత్య దిగుమతులు, పాశ్చాత్య రిటైలర్ల నుంచి రష్యన్‌లను ఆంక్షలు దూరం చేశాయి.



* ఉక్రెయిన్ దండయాత్రను సమర్థించేందుకు పుతిన్ ప్లాన్? : ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను ప్రపంచ దేశాలు ఖండించిన నేపథ్యంలోనే పుతిన్ తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై పుతిన్ ప్రారంభించిన యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలోనే నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావం గురించి రష్యన్ పౌరులు ఆందోళన చెందుతున్నారని నివేదికల్లో వెల్లడైంది. యుద్ధం ప్రారంభమైన ఎనిమిదో వారం నాటికి రష్యాలో వెయ్యికి పైగా అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపారాలను మూసివేసినట్లు యేల్ బిజినెస్ స్కూల్‌ స్కాలర్స్ పేర్కొన్నారు. గతంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కలవకుండా జీవించిన సోవియట్ పౌరులు.. ప్రస్తుతం రష్యన్ల పరిస్థితి అలాగే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు