Paid holidays: జీతాలిస్తాం.. వారం పాటు ఆఫీసులకు రాకండి.. ఉద్యోగులకు ఆ దేశాధినేత ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

రష్యా (Russia)లో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా బాధితులు వెయ్యి మందికి పైగా మరణించారు (died). దీంతో రష్యా అధినేత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 • Share this:
  కరోనా (corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్నిఅతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆయా దేశాలు లాక్​డౌన్​ విధించాయి. చాలావరకు ప్రపంచం (world) స్తంభించింది. దీని కారణంగా మాంద్యం ముంచెత్తింది. ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆరోగ్యం చెడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిణామాల నుంచి ప్రపంచం కోలుకుంటోంది. అగ్రరాజ్యాలు, ఇండియా కరోనాకు వ్యాక్సిన్​ తీసుకొచ్చి కొత్త ఊపిరినిచ్చాయి. ఇక థర్డ్​ వేవ్​ రాదునుకొని ప్రపంచం స్థిమిత పడింది. అయితే రష్యా (Russia)లో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా బాధితులు వెయ్యి మందికి పైగా మరణించారు (died). కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో రష్యా అధినేత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  అక్టోబర్​ 30 నుంచి..

  ఇలా భారీగా మరణాలు నమోదు కావడానికి ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాలు వలనే అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరోనా కట్టడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 30 నుంచి నవంబర్ 7 వరకూ వారం పాటు వేతనంతో కూడిన సెలవులను (paid holidays) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు (don’t come to office) రావొద్దని, ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి వ్యాక్సిన్‌ (vaccine) వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  టీకాపై కలగని భరోసా..

  రష్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పూత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ ను తయారు చేసి ఇతర దేశాలకు పంపిణి చేస్తోంది. కానీ, అక్కడి ప్రజల్లో మాత్రం వ్యాక్సిన్​పై భయాందోళనలు పెట్టుకున్నారు. వేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అక్కడి మరణాల పెరుగుదలకు కారణమవుతుందని రష్యా ప్రభుత్వం (Russia Government) భావిస్తోంది. ముఖ్యంగా కరోనాను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే ప్రధాన అవకాశంగా పలు దేశాలు భావిస్తూ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వ్హహిస్తున్నాయి.

  2022 ఫిబ్రవరి వరకు ఆంక్షలు..

  కరోనా మరణాల్లో రష్యా ఐరోపా దేశాల్లో మొదటి ప్లేస్ లో నిలిచింది.  రష్యాలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 1,028 మంది మరణించారు. ఇక కొత్తగా 34,074 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో మహమ్మారి తీవ్రతను ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందని రష్యన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ ప్రక్రియ మందగించింది. దీంతో మాస్కో మేయర్ సెర్గీ సోబయానిన్ మళ్ళీ కరోనా వైరస్ కట్టడి కోసం ఆంక్షలను విధించారు. రష్యా రాజధాని మాస్కో లో 60 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుండి పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా టీకాలు ఇవాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో వెళ్ళాలంటే యాక్సెస్ కోసం QR కోడ్‌లను అనేక ప్రాంతాలు తిరిగి ప్రవేశపెట్టాయి. . కోవిడ్ ఆంక్షలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని.. 2022 ఫిబ్రవరి చివరి వరకు అమల్లో ఉంటాయని చెప్పారు.
  Published by:Prabhakar Vaddi
  First published: