Home /News /international /

RUSSIA PRESIDENT PUTIN BATHES IN DEER ANTLER EXTRACT AND REGULARLY SEES CANCER DOCTOR REPORT CLAIMS PVN

Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ కు క్యాన్సర్!

పుతిన్(ఫైల్ ఫొటో)

పుతిన్(ఫైల్ ఫొటో)

Putin bathes in deer antler extract : పుతిన్ రాజకీయాల్లో గత 23 ఏళ్లుగా ఉన్నా ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి పట్ల ప్రజలకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు ప్రొయెక్ట్ ఎడిటర్ రోమన్ బడానిన్ తెలిపారు.

ఇంకా చదవండి ...
Putin Suffering With Cancer :  పుతిన్.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది.. ఆయన పేరు తలుచుకుంటేనే కొందరికి వణుకు పుడుతోంది. ఇక యుద్ధం అంటారా.. వామ్మో.. పుతినా.. మాకొద్దు బాబోయ్.. ఆయనతో మనకెందుకులే అని పెద్ద పెద్ద దేశాలు సైతం ముక్కున వేలేసుకుని మిన్నకుండిపోతున్నాయి అయితే పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి రష్యాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ 'ప్రొయెక్ట్' ప్రచురించిన కథనం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2016 నుంచి థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, దానికి చికిత్స చేయించుకునేందుకే కొన్నిసార్లు అజ్ఞాతంలోకి వెళ్లారని ఆ కథనం తెలిపింది. చికిత్సలో భాగంగా ఎర్ర జింక కొమ్ముల నుంచి తీసిన రసంతో పుతిన్‌ స్నానం చేయాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. రష్యా అధ్యక్ష కార్యాలయ సర్జన్‌ తరచూ నల్ల సముద్రంలోని పుతిన్ నివాసానికి వెళ్లేవారని ఆ కథనంలో తెలిపింది.

2016 నవంబరులో అధ్యక్ష ఆస్పత్రి వైద్యుల బృందం పుతిన్‌కు శస్త్రచికిత్స చేసి ఉండవచ్చని ప్రొయెక్ట్ కథనం తెలిపింది. ఈ వైద్యబృందంలో ఇద్దరు, ముగ్గురికి అవార్డులు, పదోన్నతులు లభించినట్లు వెల్లడించింది. 2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్‌ సర్జన్‌తోపాటు చాలామంది వైద్యులు నగరంలోని పుతిన్ నివాసానికి వెళ్లినట్లు తెలిపింది. పుతిన్ అధికారిక సందర్శనల తేదీలను, ఆయన కనిపించకుండా పోయిన రోజులు, స్థానిక హోటల్‌లో బస చేసిన వివరాలను ప్రొయెక్ట్ వెల్లడించింది. 2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్‌ స్పెషలిస్టులు 166 రోజులు సోచి నగరంలోని పుతిన్‌ నివాసంలో గడిపినట్లు రికార్డుల్లో ఉందని ప్రొయెక్ట్‌ ఎడిటర్‌ తెలిపారు.

ALSO READ Russia-Germany Died : రష్యా,జర్మనీ మృతి..యుద్ధంపై అమెరికా,ఆఫ్రికా,జపాన్ శర్మ ఆందోళన

అయితే పుతిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారా లేక ఇతర అనారోగ్యంతో ఉన్నారా అనే విషయాన్ని ప్రొయెక్ట్ నేరుగా ప్రస్తావించలేదు. పుతిన్ రాజకీయాల్లో గత 23 ఏళ్లుగా ఉన్నా ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి పట్ల ప్రజలకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు ప్రొయెక్ట్ ఎడిటర్ రోమన్ బడానిన్ తెలిపారు. అయితే,పుతిన్ ఆరోగ్యంపై ప్రొయెక్ట్ కథనాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ కొట్టిపారేశారు. అవన్నీ అసత్య ప్రచారాలని, పుతిన్‌ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ప్రొయెక్ట్‌ అనేది ఒక స్వతంత్ర రష్యన్‌ మీడియా. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో భాగంగా వార్తలు ప్రచురించినందుకు ఆ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Cancer, Russia, Vladimir Putin

తదుపరి వార్తలు