Home /News /international /

RUSSIA PALNE CRASH NEWS 16 FEARED DEAD AFTER PLANE CRASHES IN RUSSIA SK

Russia Plane Crash: రష్యాలో కుప్పకూలిన విమానం.. 19 మంది దుర్మరణం

రష్యాలో విమాన ప్రమాదం

రష్యాలో విమాన ప్రమాదం

రష్యాకు చెందిన ఎల్‌-410 తేలికపాటి విమానం... 20 మంది స్కైడైవింగ్‌ క్లబ్‌ సభ్యులు, మరో ఇద్దరు సిబ్బందితో బయల్దేరింది. ఐతే గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం పడలేదు.

ఇంకా చదవండి ...
    రష్యా (Russia)లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది.  ఓ లైట్ వెయిట్ విమానం కుప్పకూలింది. మెన్సెలిన్స్క్‌ పట్టణ సమీపంలోని తతర్‌స్థాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విమానం కూలిన ఘటనలో మొత్తం 19 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 22 ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. విమానం కూలిన సమాచారం అందిన వెంటనే స్థానికులు, అగ్నిమాప సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే 19 మంది మరణించగా.. గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.





    300 గుంజీళ్లు తీయాలని పనిష్‌మెంట్.. టీచర్ అలా చేయించేసరికి పాపం ఆ బాలిక  జీవితంలో..

    రష్యాకు చెందిన ఎల్‌-410 తేలికపాటి విమానం... 20 మంది స్కైడైవింగ్‌ క్లబ్‌ సభ్యులు, మరో ఇద్దరు సిబ్బందితో బయల్దేరింది.  ఐతే గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం పడలేదు. చివరకు వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది. ఘటపై రష్యా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముందు ఈ విమానం రాడార్ల నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే ప్రమాదం గురించి తెలిసింది. ఐతే విమానం కూలిపోవడానికి కాణమేంటన్నది తెలియాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International, International news, Plane Crash, Russia

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు