Home /News /international /

RUSSIA OFFERS MORE OIL TO INDIA PVN

Russia : భారత్ కు రష్యా బంపరాఫర్..తగ్గనున్నపెట్రోల్,డీజిల్ ధరలు!

మోదీ-పుతిన్ (పాత ఫొటో)

మోదీ-పుతిన్ (పాత ఫొటో)

Russia Offers More Oil To India : ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా భారత్ కు మరోసారి బంపరాఫర్ ఇచ్చింది. అతి తక్కువ ధరకే క్రూడాయిల్ విక్రయిస్తామని భారత్ కు రష్యా మరోసారి చెప్పింది.

ఇంకా చదవండి ...
Russia offer to india : ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్యలను పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ​పై రష్యా జరుపుతున్న భీకర దాడులను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా అమెరికా మరిన్ని ఆంక్షల్ని అమలులోకి తెచ్చింది. రష్యా వాణిజ్యపరంగా ఇస్తున్న మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (MFN) హోదాను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ విషయంలో ఐరోపా సమాఖ్య (ఈయూ), జీ-7 దేశాల కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. అంతేకాదు రష్యా సముద్ర ఉత్పత్తులు, మద్యం, వజ్రాలపై కూడా అమెరికా నిషేధం విధించింది. మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదాను రద్దు చేస్తే.. రష్యా దిగుమతులపై మరిన్ని సుంకాలు విధించే వెసులుబాటు అమెరికాకు కలుగుతుంది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్విఫ్ట్‌ నుంచి రష్యాను తప్పించడం సహా ఆ దేశ ఆయిల్ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఎంఎఫ్‌ఎన్‌ హోదా పోతే.. క్యూబా, నార్త్‌ కొరియా దేశాల సరసన రష్యా చేరుతుంది. ఇప్పటికే రష్యా ఎంఎఫ్‌ఎన్‌ హోదాను కెనడా రద్దు చేసింది.

మరోవైపు,రష్యా గ్యాస్, చమురు, బొగ్గుపై ఆధారపడటాన్ని యూరోపియన్ దేశాలు దశలవారీగా తగ్గించడానికి ఈయూ నిర్ణయించింది. మే చివరి నాటికి దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపింది.యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ మేరకు ట్వీట్​ చేశారు. రష్యా గ్యాస్, చమురు, బొగ్గుపై ఆధారపడడాన్ని 2027 నాటికి దశలవారీగా తగ్గించాలని ప్రతిపాదన తీసుకొస్తున్నాము.. ఇందుకు యూరోపియన్ దేశాల్లోని వనరులపై ఆధారపడాల్సి ఉంటుందని ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే యుద్ధం,ఆంక్షల నడుమ గడిచిన రెండు వారాలుగా రష్యా చమురు కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 139 డాలర్లకు చేరగా.. రష్యా వద్ద కొనుగోళ్లు తగ్గడంతో భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయి.

ALSO READ Russia-Ukraine War ఆగిపోనుందా? ఇజ్రాయెల్ లో పుతిన్-జెలెన్‌ స్కీ మధ్య చర్చలు!

అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా భారత్ కు మరోసారి బంపరాఫర్ ఇచ్చింది. అతి తక్కువ ధరకే క్రూడాయిల్ విక్రయిస్తామని భారత్ కు రష్యా మరోసారి చెప్పింది. రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ ఈ విషయం గురించి నేరుగా కేంద్రంతో మాట్లాడారు. శుక్రవారం కేంద్ర మంత్రి హర్దిప్ పూరికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు నోవాక్‌ తెలిపారు. రష్యా నుంచి భారత్‌ కు ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని నొవాక్ తెలిపారు. అంతేకాకుండా,భవిష్యత్తులో రష్యా గ్యాస్, ఆయిల్ రంగంలో భారత్ నుంచి మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నాం అని చెప్పారు. రష్యా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై యూరోపియన్ దేశాలు కూడా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా చూపు ఇప్పుడు అత్యంత నమ్మకమైన మిత్రదేశమైన భారత్ వైపే ఉంది.

ALSO READ OMG:ఒకే సారి 81మందికి ఉరిశిక్ష ..చావుకే భయాన్ని కలిగించిన సౌదీ అరేబియా

కాగా,రష్యా ఇచ్చిన ఆఫర్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం వాస్తవమేనన్న కేంద్రం.. దానిపై నిర్ణయం తీసుకునేముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికా, యూరోపియన్‌ దేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేసినట్లవుతుంది. రష్యా ఇచ్చిన ఆఫర్ ను అంగీకరిస్తే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించవచ్చు. మరి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆశక్తికరంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మన పొరుగుదేశం శ్రీలంకలో పెట్రోల్,డీజిల్ డబులు సెంచరీ దాటిపోయిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: India, Oil prices, Pm modi, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు