Home /News /international /

RUSSIA MULLS ALLOWING CRYPTOCURRENCY FOR INTERNATIONAL PAYMENTS PVN

Russia Cryptocurrency : పశ్చిమ దేశాల ఆంక్షలకు చెక్..అంతర్జాతీయ చెల్లింపులకు క్రిప్టో కరెన్సీ వినియోగించనున్న రష్యా!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

,Cryptocurrency for international payments : ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యా(Russia)పై పశ్చామదేశాలు తీవ్ర ఆర్థిక విధించిన నేపథ్యంలో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ చెల్లింపులకు క్రిప్టో కరెన్సీ(Cryptocurrency)వినియోగాన్ని అనుమతించే విషయంపై రష్యా పరిశీలిస్తున్నట్లు ఓ రష్యన్ ఉన్నతాధికారి చెప్పారని ఇంటర్ పాక్స్ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

ఇంకా చదవండి ...
Russia Cryptocurrency : ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యా(Russia)పై పశ్చామదేశాలు తీవ్ర ఆర్థిక విధించిన నేపథ్యంలో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ చెల్లింపులకు క్రిప్టో కరెన్సీ(Cryptocurrency)వినియోగాన్ని అనుమతించే విషయంపై రష్యా పరిశీలిస్తున్నట్లు ఓ రష్యన్ ఉన్నతాధికారి చెప్పారని ఇంటర్ పాక్స్ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. డిజిటల్‌ కరెన్సీలు వినియోగంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నట్లు రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఓ అధికారి తెలిపారు.

అంతర్జాతీయ చెల్లింపు సెటిల్మెంట్లకు డిజిటల్‌ కరెన్సీలు వినియోగం ఆలోచనపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నట్లు రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్‌ పాలసీ విభాగం అధిపతి ఇవాన్‌ చెబ్సకోవ్‌ పేర్కొన్నట్లు ఆ కథనంలో వెల్లడించింది. క్రిప్టోలపై పూర్తిస్థాయి నిషేధం విధించాలన్న రష్యా సెంట్రల్ బ్యాంక్ సిఫార్సును ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది. క్రిప్టో కరెన్సీలను ఆమెదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. తాజాగా ఆ దేశ ఆర్థికశాఖ అంతర్జాతీయ చెల్లింపులకు వీటిని చేర్చే అంశంపై చర్చించింది. ఒక వేళ దీనికి ఆమోదముద్ర పడితే పశ్చిమదేశాల ఆంక్షల ప్రభావాన్ని రష్యా గణనీయంగా తగ్గించుకునే అవకాశాలున్నాయి. మార్చిలోనే రష్యా కాంగ్రెషనల్‌ కమిటీ ఛైర్మన్‌ పావెల్‌ జవాల్ని మాట్లాడుతూ సహజవనరుల ఎగుమతుల కోసం బిట్‌కాయిన్లలో చెల్లింపులను ఆమోదిస్తామని తెలిపారు. కేవలం మిత్రదేశాలైన టర్కీ వంటి వాటికి మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందని చెప్పారు.

క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి?
క్రిప్టో కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీనే. ఇది వర్చువల్ కరెన్సీ. అయితే డిజిటల్ కరెన్సీపై కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియత్రణ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను ఇవి చూసుకుంటాయి. అయితే ఇక్కడ క్రిప్టోకరెన్సీల విషయానికి వస్తే.. వీటిపై ఎవరి నియంత్రణ ఉండదు. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్‌యెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఏ కరెన్సీ మంచిదో ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే డబ్బులు సంపాదించొచ్చు. లేదంటే డబ్బులు పోగొట్టుకోవాలసి రావొచ్చు. ఏ కొత్త టెక్నాలజీ అయినా అందులో రివార్డులతో పాటు రిస్క్ కూడా పొంచి ఉంటుంది. అందువల్ల ముందుగానే డిజిటల్ కరెన్సీ గురించి బాగా తెలుసుకోవాలి. తాజా అధ్యయనాల ప్రకారం చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన క్రిప్టోకరెన్సీలు...బిట్‌కాయిన్, ఇథీరియమ్, డాష్, మొనెరో, రిపుల్, లైట్‌కాయిన్.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Cryptocurrency, Russia

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు