హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Putin : కొరియా మాదిరిగా ఉక్రెయిన్ ను రెండుగా విభజించేందుకు పుతిన్ ఫ్లాన్

Putin : కొరియా మాదిరిగా ఉక్రెయిన్ ను రెండుగా విభజించేందుకు పుతిన్ ఫ్లాన్

RUSSIA-UKRAINE WAR :రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరపాలని క్రైస్తవ మత ప్రబోధకుడు పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. రోమ్‌ లోని సెయింట్‌ పీటర్‌ స్క్వార్‌ వద్ద పోప్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. మానవత్వం.. తప్పకుండా యుద్ధానికి ముగింపు పలకాలని, లేకుంటే యుద్ధమే మానవత్వానికి ముగింపు పలుకుతుందని హెచ్చరించారు.

ఇంకా చదవండి ...

Russia-Ukraine War : ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్‌ అస్తవ్యస్తమైంది. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. అయితే తాజాగా తమ దేశాన్ని రెండుగా విభజించేందుకు రష్యా కుట్ర పన్నిందని ఉక్రెయిన్‌ సైనిక నిఘా విభాగాధిపతి(Chief Of The Defence Inteligence) కిరిలో బుదనోవ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌ మొత్తాన్ని తన వశం చేసుకోవడం సాధ్యం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కు తెలిసొచ్చింది...అందుకే ఉక్రెయిన్ ని కొరియా తరహాలో(దక్షిణ కొరియా,ఉత్తర కొరియా) రెండు భాగాలుగా విభజించేందుకు ఆయన ప్రయత్నించే అవకాశముందని.. అలా అవతరించే రెండు భాగాల్లో ఒకదాన్ని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవాలన్నది పుతిన్ ఆలోచన అని బుదనోవ్‌ అన్నారు. అందుకే రష్యా ఆక్రమిత నగరాల్లో తమ ప్రభుత్వానికి సమాంతరంగా వేరే ప్రభుత్వాలను ఏర్పాటుచేసేందుకు యత్నిస్తుండటం.. అక్కడి ప్రజలు ఉక్రెయిన్‌ కరెన్సీని వినియోగించకుండా పుతిన్ నిషేధాజ్ఞలు విధిస్తుండటం వంటివి ఇందుకు నిదర్శనాలని తెలిపారు. రష్యా కుట్రను ఛేదించేందుకు..దేశం ముక్కలు కాకుండా ఉండేందుకు ఆ దేశ బలగాలపై తాము గొరిల్లా యుద్ధ విధానాన్ని అనుసరించే అవకాశముందని చెప్పారు.

కాగా, ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ ను రష్యా చేపట్టి నెల రోజులు దాటింది. ఇంతవరకూ ఏ ఒక్క నగరాన్ని రష్యా దళాలు పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయాయి. అయితే తొలి దశ సైనిక ఆపరేషన్‌ ముగిసిందని రష్యా రెండు రోజుల క్రితం పేర్కొంది. ఇక తమ దృష్టంతా డాన్‌బాస్‌పైనే అని తెలిపింది. ఆగ్నేయ ఉక్రెయిన్‌ లోని చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక ప్రాంతమే డాన్‌బాస్‌. డాన్‌ బాస్‌ లోని కొన్ని ప్రాంతాలు గత 8 ఏండ్లుగా వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్నాయి. మరోవైపు, రష్యాలో విలీనమయ్యే అంశంపై తూర్పు ఉక్రెయిన్‌ లోని లుహాన్స్క్‌లో త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరిపే అవకాశాలున్నట్లు ఆ ప్రాంత వేర్పాటువాద నేత లియోనిద్‌ పాసెచ్నిక్‌ ఆదివారం తెలిపారు. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌తో పాటు దొనెట్స్క్‌ ప్రాంతాల్లో వేర్పాటువాదులకు రష్యా దీర్ఘకాలంగా మద్దతిస్తోంది. ఈ రెండింటిని స్వతంత్ర ప్రాంతాలుగా పుతిన్‌ గత నెల 21న గుర్తించిన విషయం తెలిసిందే.

ALSO READ Russia-Ukraine War : ఉక్రెయిన్ పై వ్యూహం మార్చిన రష్యా !

ఇక, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చిమ దేశాల తీరుపై మండిపడుతున్నారు. రష్యాకు వారంతా భయపడుతున్నారని ఆరోపించారు. అందుకే తమ దేశానికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. పేరుకుపోయిన పాత క్షిపణులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. నాటోలోని ఒక్క శాతం యుద్ధ విమానాలు, ఒక్క శాతం ట్యాంకులను తమకు ఇచ్చినా రష్యా దాడిని ఎదుర్కోగలమన్నారు. ఉక్రెయిన్‌ ఇంధన, ఆహార నిల్వ కేంద్రాలను రష్యా ధ్వంసం చేస్తున్నదని ఆయన వాపోయారు. రష్యాపై దాడికి మరిన్నీ ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరపాలని క్రైస్తవ మత ప్రబోధకుడు పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. రోమ్‌ లోని సెయింట్‌ పీటర్‌ స్క్వార్‌ వద్ద పోప్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. మానవత్వం.. తప్పకుండా యుద్ధానికి ముగింపు పలకాలని, లేకుంటే యుద్ధమే మానవత్వానికి ముగింపు పలుకుతుందని హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించే దశకు చేరుకున్నామని మానవత్వం అర్ధం చేసుకోవాలని సూచించారు. క్రూరమైన, మతిలేని ఈ యుద్ధం కొనసాగితే, అది అందరికీ ఓటమని అన్నారు. యుద్ధం మానవుడిని చరిత్ర నుంచి తొలగించకముందే చరిత్ర నుంచి యుద్ధాన్ని తొలగించాలని పోప్‌ పిలుపునిచ్చారు.

First published:

Tags: North Korea, Russia-Ukraine War, South korea, Ukraine, Vladimir Putin, Zelensky

ఉత్తమ కథలు