ఉక్రెయిన్(Ukraine) యుద్ధంలో ఇప్పటివరకు 1300 ట్యాంకులు, 207 విమానాలు, 174 హెలికాప్టర్లను కోల్పోయిన ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా(Russia) నిలిచింది. భారీగా ఆయుధాలు, వాహనాల నష్టం, ఆంక్షలతో పాటు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని నిలబెట్టగల పుతిన్(Putin) సామర్థ్యంపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో తన దశాబ్దాల నాటి T-62M ట్యాంకులను ఉక్రెయిన్‌లో మోహరించడం కోసం స్టోరేజ్(Storage) నుంచి రష్యా బయటకు తీసింది. ఉక్రెయిన్‌లో నష్టాలు రష్యా నుంచి ఎక్కువగా ఆయుధాలు కొనుగోలు చేసే రెండో దేశం చైనాపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం చైనా ఆయుధాగారాన్ని ప్రభావితం చేస్తుందా.. ?
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నష్టపోయినా చైనాపై పెద్దగా ప్రభావం ఉండదంటున్న నిపుణులు తెలుపుతున్నాయి. ఇటీవల సంవత్సరాలలో ఆయుధ ఉత్పత్తి రంగంలో చైనా స్వయం సమృద్ధి సాధించడం ఒక ప్రధాన కారణం కాగా.. చైనాకు రష్యా ఎగుమతుల మిలిటరీ వ్యాల్యూ 2005లో గరిష్ట స్థాయి నుంచి పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో బీజింగ్‌కు మిసైల్ హెలికాప్టర్లు, అధునాతన జెట్లను రష్యా ఆయుధ తయారీ కంపెనీలు సరఫరా చేశాయి.
అయితే గత రెండు దశాబ్దాలుగా రష్యా నుంచి చారిత్రాత్మకంగా కొనుగోలు చేసిన రక్షణ ఉత్పత్తులను లైసెన్స్ కింద చైనా తయారు చేసింది. చైనా తన సొంత యుద్ధనౌకలు, విమాన వాహక నౌకలు, అధునాతన యుద్ధ విమానాలను నిర్మించగల సామర్థ్యాన్ని పెంచుకోవడంలో లైసెన్సింగ్ ఒప్పందాలు సహాయపడ్డాయి. ప్రస్తుతం రష్యా నుంచి జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్‌ను చైనా దిగుమతి చేసుకుంటుంది. 2012 నుంచి చైనాకు యాంటీ షిప్, యాంటీ ట్యాంక్ మిసైల్స్, నౌకాదళ తుపాకులు, రవాణా విమానాలను మాత్రమే రష్యా పంపిణీ చేసింది.
చైనా తన దిగుమతులను ఎలా తగ్గించుకోగలిగింది..
యూఎస్, రష్యన్ పరికరాల రివర్స్ ఇంజినీరింగ్ కారణంగా చైనా తన దిగుమతులను తగ్గించుకోగలిగినట్లు యూఎస్ ఆధారిత రాండ్ కార్పొరేషన్ చెబుతుంది. విదేశీ పరికరాలను అధ్యయనం చేసి తమ సొంత విధానంలో ఆయుధాలను చైనీస్ సంస్థలు తయారు చేస్తున్నాయి. చైనా షెన్యాంగ్ WS-18 టర్బోఫాన్ ఇంజిన్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న సోలోవివ్ D-30KP-2 నుంచి రివర్స్- ఇంజినీరింగ్ చేసినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. చైనీస్ తయారు చేసిన Y-20 ట్రాన్స్పోర్టర్లు, H-6K బాంబర్లలో రష్యన్ ఇంజిన్లు వినియోగించాయి.
అయినప్పటికీ చైనా WS-18, WS-20కి అనుకూలంగా దశలవారీగా రష్యన్ ఇంజిన్ల తొలగించింది. ఇప్పటికీ తన ఇన్వెంటరీలో రష్యన్ ఆయుధాలను నిర్వహించడానికి విడిభాగాలను చైనా కొనుగోలు చేస్తోంది. చైనా స్థానికంగా తయారైన వాటిని రష్యన్ భాగాలను సులభంగా భర్తీ చేయగలదని బీజింగ్‌లోని థింక్ ట్యాంక్‌లోని పరిశోధకుడు జౌ చెన్మింగ్ పేర్కొన్నాడు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం, రష్యాపై పాశ్చాత్య ఆంక్షల ప్రభావం చైనాపై కనిపించే అవకాశం లేదన్నారు. 2019 నాటికి ప్రపంచంలోని రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిజర్వ్‌లలో 37% చైనా వద్దే ఉంటాయని, ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Russia, Russia-Ukraine War