హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War: యుద్ధంలో ఎవరిది గెలుపు.. రష్యా తదుపరి చర్య ఇదేనా..?

Russia-Ukraine War: యుద్ధంలో ఎవరిది గెలుపు.. రష్యా తదుపరి చర్య ఇదేనా..?

ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకొన్న ప్రాంతాల్లో మందుపాతరలను పెడుతున్న రష్యా.. కీవ్‌ చుట్టూ, ఇతర ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ఇతర ప్రయోగాలను కూడా చేస్తోంది. అయితే ఉక్రెయిన్‌ నుంచి ఎటువంటి ప్రతిఘటననైనా ఎదుర్కొనేందుకు రష్యా మందుపాతరలు పెడుతోందనే విషయాన్ని ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ వార్‌ పేర్కొంది.

ఇంకా చదవండి ...

  ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో(Ukraine) స్వాధీనం చేసుకొన్న ప్రాంతాల్లో మందుపాతరలను పెడుతున్న రష్యా.. కీవ్‌ చుట్టూ, ఇతర ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ఇతర ప్రయోగాలను కూడా చేస్తోంది. అయితే ఉక్రెయిన్‌ నుంచి ఎటువంటి ప్రతిఘటననైనా ఎదుర్కొనేందుకు రష్యా మందుపాతరలు పెడుతోందనే విషయాన్ని ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ వార్‌(Study Of War) పేర్కొంది. కీవ్‌కు నార్త్‌వెస్ట్‌లో(North West) మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ చుట్టూ రష్యన్ దళాలు కందకాలు తవ్వినట్లు శాటిలైట్‌ ఇమేజెస్‌ కూడా స్పష్టం చేస్తోంది. రష్యా(Russia) దళాలను కీవ్‌ శివారు ప్రాంతం మకారివ్ నుంచి తరిమికొట్టినట్లు మార్చి 23న ఉక్రెయిన్ ప్రకటించింది. ‌ మకారివ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో కీవ్‌ను నార్త్‌వెస్ట్‌ నుంచి రష్యా దళాలు చుట్టుముట్టకుండా అడ్డుకోవచ్చని ఉక్రెయిన్‌ సైన్యం భావిస్తోంది.

  Russia-Ukraine War: రష్యాలో సంచలనం.. పుతిన్ హత్యకు ప్లాన్? భయంతో కుక్‌ను కూడా నమ్మలేక..

  ఫిబ్రవరి 24 నుంచి రెండు దేశాల మధ్య సైనిక చర్యలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ సైన్యం ధీటుగానే ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. అయితే రష్యా బలగాలు తమ సామర్థ్యాన్ని కోల్పోయాయని.. సుదీర్ఘ యుద్ధానికి రష్యా సిద్ధమవుతోందని మార్చి 20న ఉక్రెయిన్ ప్రకటించింది. అందుకే మందు పాతరలు పెట్టడం అనేది దీనిలో వ్యూహంగా పేర్కొంది. ‌ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ లో రష్యా ఎక్కువ కాలం ఉండేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత భారీ మందుపాతరలను నిర్వీర్యం చేయడంలో ఉక్రెయిన్‌కు వెస్ట్రన్‌ కంట్రీస్‌ సాయం అవసరం.

  మాస్కో తన 'అఫెన్సివ్ పొటెన్షియల్'ని కోల్పోయిందా..?

  యుద్ధం మొదలై నెల గడిచినా.. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి ఆధిపత్యం చెలాయించలేక పోయిందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ నార్త్‌, సౌత్‌, నార్త్‌ఈస్ట్‌లో ముందుకుసాగినా.. ఇంకా లక్ష్యానికి దూరంగానే ఉంది. యుద్ధం మొదలైన వారానికే కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలన్నదే తొలుత రష్యా లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా కీవ్‌కు దూరంగా రష్యా బలగాలను నెట్టడంలో ఉక్రెయిన్‌ సైన్యం విజయవంతం అయిందనే చెప్పాలి.

  Most Polluted Countries: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశం ఇదే.. మన పక్కనే ఉంది తెలుసా..

  ఉక్రెయిన్‌లో రవాణా సమస్యలను రష్యా పరిష్కరించుకోలేకపోయిందని యూఎస్‌ థింక్‌ ట్యాంక్‌ చెబుతోంది. మార్చి 21న ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలపై ఎలాంటి దాడులు రష్యా జరపలేదని యూఎస్‌ థింక్ ట్యాంక్ రిపోర్ట్‌ ద్వారా తెలుస్తోంది. ఫ్రంట్-లైన్ దళాలను భర్తీ చేయడానికి తక్కువ అనుభవం గల యూనిట్లను రష్యా ఉపయోగించినట్లు సమాచారం. యుద్ధంలో ఇప్పటి వరకు 15,300 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. అదే నిజమైతే ఆఫ్ఘనిస్థాన్‌లో సోవియట్ సైనికుల మరణాలకంటే ఇదే అధికం.

  First published:

  Tags: Russia, Russia-Ukraine War, Ukraine

  ఉత్తమ కథలు