Russia Sanctions On USA : ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికాపై రష్యా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై అమెరికా పలు కఠిన ఆంక్షలు విధిస్తూ… పుతిన్‌పై రోజూ ఏదో రకంగా మాటల దాడి చేస్తూనే వుంది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం అమెరికాకు రివర్స్ ఝలక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, హిల్లరీ క్లింటన్,. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్,అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ సహా 13 మంది అమెరికా రాజకీయ ప్రముఖులపై ఆంక్షలు విధిస్తూ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ 13 మంది అమెరికా ఉన్నతాధికారులు రష్యాలోకి ప్రవేశించడానికి వీల్లేదని పుతిన్ ఆదేశాలు జారీచేశారు.
ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆంక్షల ప్రకటన సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ..తమపై అన్యాయంగా విధించిన ఆంక్షలకు బదులుగానే తాము ఈ చర్యలకు దిగినట్టు వెల్లడించింది. కాగా, తనపై నిషేధాన్ని హిల్లరీ క్లింటన్ సరదాగా తీసుకున్నారు. ఈ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు రష్యన్ అకాడమీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. అయితే రష్యా ఈ ఆంక్షలు ప్రకటించిన కాసేపటికే అమెరికా దీటుగా స్పందించింది. ఉక్రెయిన్ పై దండయాత్రలో రష్యాకు సహకరిస్తున్న బెలారస్ పై తాజా ఆంక్షలకు తెరలేపింది. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లూకాషెంకో, మరో 11 మంది రష్యా రక్షణ శాఖ ప్రముఖులను ఆంక్షల జాబితాలో చేర్చింది.
ALSO READ Crude Oil: గుడ్ న్యూస్.. తక్కువ ధరకు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన భారత్
ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షల తీవ్రతను పెంచింది. రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్న ముడి చమురుపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. తమతో పోలిస్తే ఐరోపా దేశాలు రష్యా చమురు ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడ్డాయన్న బైడెన్.. తాజా ఆంక్షల విషయంలో ఆయా దేశాలు తమతో కలిసి రాకపోయినా అర్థం చేసుకొంటామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Joe Biden, Russia, Russia-Ukraine War, USA, Vladimir Putin