Home /News /international /

RUSSIA IMPOSES SANCTIONS ON JOB BIDEN WIFE DAUGHTER AND 23 OTHERS HERE IS THE FULL DETAILS AK

Russia-USA: దెబ్బకు దెబ్బ.. అమెరికాకు రష్యా షాక్.. బైడెన్ భార్య, కూతురు సహా 25 మందిపై..

జో బైడెన్-పుతిన్(ఫైల్ ఫొటో)

జో బైడెన్-పుతిన్(ఫైల్ ఫొటో)

Russia: రష్యా రాజకీయ, ప్రజాప్రతినిధులపై ఎప్పటికప్పుడు పెరుగుతున్న అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా 25 మంది అమెరికా పౌరులను 'స్టాప్ లిస్ట్'లో చేర్చినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ జాబితా విడుదలతో పాటు ఒక నోట్‌లో పేర్కొంది.

    ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తరువాత అమెరికా, రష్యా (America Russia)మధ్య ఉన్న గ్యాప్ మరింతగా పెరిగిపోయింది. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ.. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచేలా చర్యలు చేపట్టింది అమెరికా. ఇప్పటికీ అమెరికా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఆ దేశంపై పలు దేశాలు ఆంక్షలు విధించేందుకు అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ క్రమంలో అమెరికాపై కూడా రష్యా తనదైన శైలిలో రివెంజ్ తీర్చుకుంటోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) భార్య, కుమార్తెతోపాటు మరో 23 మంది అమెరికన్లపై రష్యా నిషేధం విధించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

    రష్యా రాజకీయ, ప్రజాప్రతినిధులపై ఎప్పటికప్పుడు పెరుగుతున్న అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా 25 మంది అమెరికా పౌరులను 'స్టాప్ లిస్ట్'లో చేర్చినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ జాబితా విడుదలతో పాటు ఒక నోట్‌లో పేర్కొంది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భార్య, కుమార్తె ఉన్నారు, వీరిలో మైనేకి చెందిన సుసాన్ కాలిన్స్, కెంటుకీకి చెందిన మిచ్ మెక్‌కానెల్, అయోవాకు చెందిన చార్లెస్ గ్రాస్లీ, న్యూయార్క్‌కు(New York) చెందిన కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్‌తో సహా పలువురు US సెనేటర్‌లు ఉన్నారు.



    ఇందులో పలువురు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, అమెరికా మాజీ ప్రభుత్వ అధికారులు కూడా పాలుపంచుకున్నారని వార్తా సంస్థ AFP తెలిపింది. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తెలతో పాటు అనేక మంది ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రష్యా రాజకీయ నాయకులపై అమెరికా నిషేధం విధించింది. దీని తరువాత బ్రిటన్ సహా ఇతర దేశాలు కూడా అలాంటి ఆంక్షలను ప్రకటించాయి.

    Pani Puri: నేపాల్‌ రాజధాని ఖాట్మండులో పానీ పూరి బంద్.. ఎందుకంటే..

    ఇంతకన్న విచిత్రం మరోకటి ఉండదు.. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లేవు.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని..

    పుతిన్ కుమార్తెలు మరియా పుతిన్, కత్రినా టిఖోనోవా, రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ భార్య, పిల్లలు, రష్యా భద్రతా మండలి సభ్యులు, మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్‌లపై అమెరికా ఆంక్షలు విధించింది. US ఆర్థిక వ్యవస్థ నుండి పుతిన్ కుటుంబానికి చెందిన అన్ని సన్నిహిత సభ్యులను US తొలగించింది. వారి US ఆధారిత ఆస్తులన్నింటినీ స్తంభింపజేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Joe Biden, Russia, USA, Vladimir Putin

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు