హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War : కుదేలైన రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ..ఏటీఎంల వద్ద రష్యన్ల క్యూ

Russia-Ukraine War : కుదేలైన రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ..ఏటీఎంల వద్ద రష్యన్ల క్యూ

జో బైడెన్-పుతిన్(ఫైల్ ఫొటో)

జో బైడెన్-పుతిన్(ఫైల్ ఫొటో)

Sanctions On Russia : సోబర్​ బ్యాంక్, వీటీబీ బ్యాంకులు పతనం అంచులో ఉన్నాయని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు తెలిపింది. రష్యా బ్యాంకింగ్ వ్యవస్థలో సగానికి పైగా ఆస్తులు ప్రభుత్వ అధీనంలోని ఈ రెండు బ్యాంకులవే కావడం, ఈ బ్యాంకులే ఆంక్షలతో కొట్టుమిట్టాడుతుండటం అక్కడి దుర్భర పరిస్థితిని సూచిస్తోంది.

ఇంకా చదవండి ...

Russia's Banking System : ఎవరెన్ని చెప్పినా వినకుండా ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. రష్యాపై అంతర్జాతీయ సమాజం విధించిన ఆర్థిక ఆంక్షలు ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ తాజా ఆంక్షలు రష్యా ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయ బ్యాంక్ పేమెంట్స్ వ్యవస్థ "స్విఫ్ట్" నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులను తొలగించడం,రష్యన్ సెంట్రల్ బ్యాంక్ తో అన్ని లావాదేవీలను ఆపేయడం వంటి అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్,సహా పలు దేశాలు తీసుకున్న నిర్ణయాలతో రష్యాలోని బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది. రష్యన్ కరెన్సీ అయిన రూబుల్ విలువ ఘోరంగా పతనమవుతోంది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూబుల్ విలువ దాదాపు 30 శాతం పతనమయింది. సోమవారం ఒక్క రూబుల్.. అమెరికా సెంట్​(డాలరులో వందో వంతు) కన్నా తక్కువగా ట్రేడ్ అయింది. ఇది డాలరు-రూబుల్ చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయి అని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్ పతనం తర్వాత రష్యాలో తలెత్తిన కరెన్సీ సంక్షోభం ఇదే. అయితే, రష్యా సెంట్రల్ బ్యాంకు వెంటనే అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బ్యాంకుల కీలక వడ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంతో.. రూబుల్ మారకం విలువ 98.22కు పుంజుకుంది.

రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అంతటా అంతర్గత భయాందోళనలు మొదలయ్యాయి. బ్యాంకుల అంతర్గత గ్లోబల్ పేమెంట్స్ నిలిచిపోతాయనే ఆందోళనల నేపథ్యంలో ముందుగానే రష్యా వాసులంతా ఏటీఎంల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఆయా బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు విత్ డ్రా చేసుకుని ఇంట్లో దాచిపెట్టుకునేందుకు ఏటీఎంలకు క్యూ కట్టేస్తున్నారు. రష్యా వాసులు ఏటీఎంల దగ్గర బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ స్థాయిలో డిపాజిట్లను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు రుణాలు చెల్లించలేకపోతున్నాయి. సోబర్​ బ్యాంక్, వీటీబీ బ్యాంకులు పతనం అంచులో ఉన్నాయని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు తెలిపింది. రష్యా బ్యాంకింగ్ వ్యవస్థలో సగానికి పైగా ఆస్తులు ప్రభుత్వ అధీనంలోని ఈ రెండు బ్యాంకులవే కావడం, ఈ బ్యాంకులే ఆంక్షలతో కొట్టుమిట్టాడుతుండటం అక్కడి దుర్భర పరిస్థితిని సూచిస్తోంది.

ALSO READ Mission Ganga: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించడంలో నిమగ్నమైన అధికారులు.. కొనసాగుతున్న ‘మిషన్‌ గంగ’..!

మరోవైపు, అమెరికా ట్రెజరీ శాఖ రష్యా సెంట్రల్ బ్యాంకు లక్ష్యంగా కొత్త ఆంక్షలు విధించింది. ఆ దేశ ప్రభుత్వ పెట్టుబడుల నిధులపైనా ఆంక్షలు ప్రకటించింది. అమెరికాలో రష్యా సెంట్రల్ బ్యాంకుకు ఉన్న ఆస్తులు, అమెరికన్ల వద్ద ఉన్న రష్యా సెంట్రల్ బ్యాంకు ఆస్తులపై నిషేధం అమలవుతుంది. అమెరికా దారిలోనే ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ, జపాన్, ఈయూ దేశాలు పయనిస్తాయని శ్వేతసౌధ అధికారులు భావిస్తున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Banking, Russia, Russia-Ukraine War, USA, Vladimir Putin

ఉత్తమ కథలు