Home /News /international /

RUSSIA DEPLOYS BMPT TERMINATOR IN WARZONE UKRAINE TERMINATOR FIELDED AMID MOUNTING LOSSES FOR RUSSIA GH VB

Russia-Ukraine War: రష్యా దాడి ఆగిపోయింది.. NATO సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వెల్లడి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌ యుద్ధంలో మొదటిసారి రష్యా BMPT టెర్మినేటర్ ఆర్మ్డ్‌ ఫైటింగ్‌ వెహికల్స్‌ కనిపించింది. టెర్మినేటర్లు లుహాన్స్క్ ప్రాంతంలోని సెవెరోడోనెట్స్క్‌లోకి వెళ్లడం కనిపించినట్లు ఆన్‌లైన్‌ రిపోర్ట్స్, వీడియోలు తెలుపుతున్నాయి. 

ఉక్రెయిన్‌లో BMPT టెర్మినేటర్‌ను రష్యా(Russia) మోహరించింది. ఉక్రెయిన్‌ యుద్ధంలో మొదటిసారి రష్యా BMPT టెర్మినేటర్ ఆర్మ్డ్‌ ఫైటింగ్‌ వెహికల్స్‌(Vehicle) కనిపించింది. టెర్మినేటర్లు లుహాన్స్క్ ప్రాంతంలోని సెవెరోడోనెట్స్క్‌లోకి వెళ్లడం కనిపించినట్లు ఆన్‌లైన్‌ రిపోర్ట్స్(Online Reports), వీడియోలు(Videos) తెలుపుతున్నాయి. BMPT మోహరింపును రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ రియా నోవోస్టి ధ్రువీకరించింది. ట్యాంక్ ప్లాటూన్‌లతో కలిసి ఉక్రెయిన్‌(Ukraine) స్థావరాలు, సాయుధ వాహనాలు, యాంటి ట్యాంక్‌ మిసైల్‌ సిస్టమ్‌ను BMPTలు నాశనం చేస్తాయని రష్యన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీకి చెందిన రియా నోవోస్టి తెలిపింది. టెర్మినేటర్‌లు(Terminators) రష్యా సైన్యాన్ని వ్యూహాలను రూపొందించడానికి, సాయుధ సమూహాలలో వారి స్థానాన్ని నిర్ణయించడానికి వీలు కల్పిస్తాయని రియా నోవోస్టి పేర్కొంది.

డాన్‌బాస్ కోసం జరిగిన యుద్ధంలో పుతిన్ బలగాలు భారీ నష్టాలను ఎదుర్కొంటుండటంతో BMPT మోహరించాయి. తూర్పు డాన్‌బాస్‌లో రష్యా దాడి ఆగిపోయిందని NATO సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నుంచి ఈ వారం వెనక్కి వెళ్లిన రష్యన్ దళాలు. ఫిబ్రవరి 24 దాడికి ముందు టెర్మినేటర్లను మొదట ఉక్రెయిన్‌ సరిహద్దుకు రష్యా సైన్యం తరలించింది.

BMPT టెర్మినేటర్ ఫీచర్స్‌ విషయానికి వస్తే.. బరువు 47 టన్నులు, హల్‌ లెంత్‌ 6.9మీ, వెడల్పు 3.8మీ, ఎత్తు 3.4 మీ, మెయిన్‌ గన్‌ రెండు 30 mm కేనాన్స్‌, మెషిన్ గన్ 7.62mm మెషిన్ గన్స్, గ్రెనేడ్ లాంచర్లు 2 x 30 మిమీ ఉన్నాయి. కాంపోజిట్‌ ఆర్మర్‌ ప్రొటెక్షన్‌, 5 కిలోమీటర్ల పరిధిలోని శత్రు ట్యాంకులపై దాడి చేయగల సామర్థ్యం ఉంటుంది. ఇంజిన్ 1,000 హార్స్‌పవర్‌తో V-92S2 డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. 2021 డిసెంబర్‌లో టెర్మినేటర్లు 90వ గార్డ్స్ ట్యాంక్ డివిజన్‌తో సేవల్లోకి ప్రవేశించినట్లు రష్యన్ ప్రభుత్వ వార్తా సంస్థ TASS తెలిపింది. టెర్మినేటర్‌కు తేలికపాటి సాయుధ లక్ష్యాలు, ట్యాంకులు, ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వెహికల్స్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని నివేదికలో వెల్లడైంది.

PM Modi : అభివృద్ధే బీజేపీకి పరమావధి..వచ్చే 25 ఏళ్లు బీజేపీవే.. రోడ్‌ మ్యాప్‌ను రూపొందించిన మోదీ

తక్కువ ఎత్తులో, తక్కువ వేగంతో ఎగిరే శత్రు హెలికాప్టర్లు ఎదుర్కొనేందుకు బ్యాటెల్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో టెర్మినేటర్‌ పనిచేయగలదు. రష్యా T-72 యుద్ధ ట్యాంక్ ఛాసిస్‌పై టెర్మినేటర్‌ను రష్యన్ కంపెనీ ఉరల్‌వాగోంజావోడ్ అభివృద్ధి చేసింది. 2017లో రష్యా, సిరియా పోరాట ట్రయల్స్‌లో టెర్మినేటర్ కనిపించింది. 2020 ఆగస్టులో టెర్మినేటర్ కొత్త వెర్షన్‌పై పని చేస్తున్నట్టు ఉరల్వాగోంజావోడ్ ప్రకటించిందని TASS పేర్కొంది. ట్యాంక్ సపోర్ట్ ఫైటింగ్ వెహికల్ మాడ్యూల్ తదుపరి 57mm క్యాలిబర్‌తో Armata ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేస్తామని ఉరల్వాగోంజావోడ్ జనరల్ డైరెక్టర్ అలెగ్జాండర్ పొటాపోవ్ చెప్పారు.

పట్టణ ప్రాంతాల్లో టెర్మినేటర్ ఉపయోగాలు..
పట్టణ ప్రాంతాల్లోని యూనిట్లకు మద్దతుగా టెర్మినేటర్లను రూపొందించినట్లు నిపుణులు చెబుతున్నారు. షార్ట్‌ రేంజ్‌, సప్రెస్సివ్‌ ఫైర్‌ పవర్‌ పట్టణ యుద్ధ దృశ్యాలకు కూడా ఈ టెర్మినేటర్ ఆయుధాలు సరిపోతాయి. భవనాలపై ఎత్తులో ఉన్న లక్ష్యాలపై కూడా ఫైర్‌ చేసేలా టెర్మినేటర్ తుపాకీలు ఉంటాయని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

టెర్మినేటర్ ఏదైనా దాడి సమయంలో భారీ బలాన్ని మోయగలదు.. ట్యాంక్ ఆపరేషన్ విజయావకాశాలను పెంచగలదు. రెండు 30mm ఫిరంగులు అధిక-పేలుడు రౌండ్లతో అనేక రకాల మందుగుండు సామగ్రిని కాల్చగలవు. దాడిలో తీవ్రతను తగ్గించేందుకు బ్లాస్ట్‌ను బయటకు పంపగల ఎక్స్‌ప్లోజివ్‌ రియాక్టివ్ ఆర్మర్‌. యుద్ధంలో రష్యా దాదాపు 28,000 మంది సైనికులను కోల్పోయిందని, 60 శాతం పరికరాలను కోల్పోయిందని ఉక్రెయిన్ పేర్కొంది.
Published by:Veera Babu
First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు