Home /News /international /

RUSSIA CHINA TO CHECK AMERICA LAUNCHING A HUGE EXHIBITION WITH WAR GAMES UMG GH

Russia-China: అమెరికాకు చెక్ పెట్టనున్నరష్యా- చైనా.. వార్ గేమ్స్ తో భారీ ప్రదర్శనకు శ్రీకారం

  అమెరికాకు చెక్ పెట్టనున్నరష్యా- చైనా.. వార్ గేమ్స్ తో  భారీ ప్రదర్శనకు శ్రీకారం

అమెరికాకు చెక్ పెట్టనున్నరష్యా- చైనా.. వార్ గేమ్స్ తో భారీ ప్రదర్శనకు శ్రీకారం

రష్యా(Russia) ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇంకా ముగింపునకు లేదు. ఈ నేపథ్యంలో రష్యా, చైనాలు కలిసి అమెరికా(America)కు దూకుడుకు కళ్ళెం వేయనున్నాయి. రష్యాలో ఇరు దేశాలు కలసి భారీ తరహాలో ఆగస్టు లో వార్ గేమ్స్ ప్రదర్శన చేపట్టబోతునాయి.

ఇంకా చదవండి ...
ఒక పక్క ఉక్రెయిన్(Ukraine) తో యుద్ధం చేస్తూనే మరో పక్క రష్యా(Russia) తన మిత్ర దేశాలతో మరింత సాన్నిహిత్యం పెంచుకుంటోంది. గత ఐదు నెలలుగా ఉక్రెయిన్ తో అలుపెరగని యుద్ధం చేస్తూ ఆ ప్రభావాన్నిఆదేశ ప్రజలు, ఆర్మీ మీద పడకుండా మిగతా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యింది. అమెరికా(America)కు తమ బలంతో పాటు మిత్ర దేశాల బలాన్ని చూపెట్టాలని రష్యా వార్ గేమ్స్ ప్రదర్శన మొదలు పెట్టింది.

మిలిటరీ డ్రిల్స్‌ కోసం రష్యాకు వెళ్లిన చైనా దళాలు, ట్యాంకులు..
మాస్కో అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఒక ప్రతినిధి బృందాన్నిరష్యాకు పంపిన చైనా (China) పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పంపింది. రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఆగస్టు 13- 27 తేదీల్లో ప్రదర్శన జరుగనుంది. సిబ్బంది, సైనిక ట్యాంకులు, పదాతి దళ వాహనాలతో కూడిన PLA ప్రతినిధి బృందం రష్యాకు చేరుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఈవెంట్‌లో 37 దేశాలు పాల్గొననున్నాయి. ఈ మిలటరీ ఎక్సెర్‌సైజ్‌ 2015లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక దేశాలు మల్టినేషనల్‌ మిలిటరీ ఎక్సెర్‌సైజ్‌ను నిర్వహించాయి. మంచులో 50 కి.మీ కవాతు సహా పోరాట కార్యకలాపాలలో నైపుణ్యాలను పెంపొందించడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రష్యా తెలిపింది.

రష్యా వార్‌గేమ్స్‌నుంచి చైనా పాఠాలు  నేర్చుకుంటోందా !
పశ్చిమ దేశాలతో పెరుగుతున్నఉద్రిక్తతల మధ్య బీజింగ్, మాస్కో(Moscow) మధ్య మరింత సైనిక సహకారాలు అందించుకునేదుకు ఈ ప్రదర్శనలు ఉపయోగ పడనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ గేమ్, ఫ్రిగేట్ రేస్‌సహా మూడు పోటీల్లో పాల్గొననుంది. 2005 నుంచి బైలేటరల్‌, మల్టిలేటరల్‌ వేదికల ద్వారా మిలిటరీ ఎక్సెర్‌సైజ్‌లను ఇరు దేశాలు ముమ్మరం చేశాయి. రష్యన్ సైనికుల నుంచి కొన్ని కీలక పోరాట పాఠాలను నేర్చుకోవాలని చైనా భావిస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో రష్యన్ దళాలు ఉత్తర కాకసస్, జార్జియా నుంచి ఉక్రెయిన్, సిరియా వరకు అనేక ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ ఈవెంట్ లో నైజర్, రువాండా వార్‌గేమ్స్‌లో పాల్గొంటున్నమొదటి ఆఫ్రికన్ దేశాలని తెలిపిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనా, రష్యా మధ్య సైనిక సహకారం మరింత లోతుగా ఉండటంపై జపాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత నెలలో 14 నాటో మిత్రదేశాలు బాల్టిక్‌లో 45 కంటే ఎక్కువ నౌకలు, 75 విమానాలు, 7,500 మంది సిబ్బందితో 13 రోజుల జాయింట్‌ఎక్సెర్‌సైజ్‌లో పాల్గొన్నాయి.

ఇదీ చదవండి: Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !

వార్ గేమ్‌లతో వ్యూహాత్మక ఎత్తుగడ ?
పశ్చిమార్ధగోళంలో రష్యా నేతృత్వంలో ఎక్సెర్‌సైజ్‌ జరగడం ఇదే మొదటిసారని నిపుణులు చెప్తున్నారు. ఈ చర్యలతో చైనా, రష్యా, ఇరాన్, వెనిజులా దేశాలకు వ్యూహాత్మక విలువ ఉందని తెలిపిన వాషింగ్టన్‌కు చెందిన థింక్ ట్యాంక్ సంస్థ చెప్పింది. లాటిన్ అమెరికా, కరేబియన్‌లలోని ఫార్వర్డ్-డిప్లాయిడ్ మిలిటరీని ప్రీ పొజిషన్‌లో ఉంచడానికి ప్రయత్నిస్తుందని తెలిపింది.


VRIC దేశాల బల ప్రదర్శనకు వార్ గేమ్‌లు..
యూఎస్‌ ఆంక్షలతో వాషింగ్టన్‌ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వెనిజులా, రష్యా, ఇరాన్, చైనా (VRIC)గా ఏర్పడ్డాయి. పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల మధ్య తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి VRIC దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక అమెరికాకు శత్రుదేశం అయిన వెనిజులా లాటిన్ అమెరికన్ దేశం తూర్పు మిత్రదేశాలతో సన్నిహిత సంబంధాల కోసం వార్‌గేమ్స్‌లో భాగంగా స్నైపర్‌ పోటీని నిర్వహిస్తోంది. రెండో అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో విజయాన్నిబూటకం అని వాషింగ్టన్ పేర్కొన్న తర్వాత 2019లో యుఎస్‌తో ఆదేశం సంబంధాలను తెంచుకుంది. వెనిజులాలో స్నైపర్‌ ఫ్రాంటియర్ పోటీలో చైనా, రష్యా, ఇరాన్‌, మరో 10 ఇతర దేశాలు పాల్గొననున్నాయి. ఏడాదిన్నర క్రితం, దావోస్ ఫోరమ్‌లో యూనిపోలార్ వరల్డ్ ఆర్డర్ శకం ముగిసిందని చెప్పిన పుతిన్‌ చెప్పారు. ప్రచ్ఛన్న యుద్ధంలో గెలిచినప్పుడు, తమను తాము భూమిపై దేవుని సొంత ప్రతినిధులుగా యూఎస్‌ ప్రకటించుకుందని ఎద్దేవా చేశాడు. మొత్తం మీద అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి రష్యా తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: China, Russia-Ukraine War, USA, Vladimir Putin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు