Russia Changes Strategy On Ukraine : ఉక్రెయిన్ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్ అస్తవ్యస్తమైంది. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ క్రమంలో రష్యా సైనికులు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యలో ఆర్థికంగా, సైనికంగా భారీ నష్టాలు ఎదుర్కొంటున్న రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చింది. రాజధాని కీవ్‌ను వదిలి కొత్త ప్రాంతాలపై దాడులకు దిగింది. ఇప్పటివరకు దాడి చేయని లవీవ్ నగరంపై మాస్కో సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడ్డాయి.
ఇప్పటికే మరియుపోల్ తో పాటు వివిధ నగరాలను ధ్వంసం చేసిన రష్యా.. ఇప్పుడు లవీవ్ పైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా లవీవ్‌పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు మాస్కో రక్షణ శాఖ స్వయంగా వెల్లడించింది. లవీవ్ సమీపం నుంచి ఉక్రెయిన్ దళాలు ఉపయోగిస్తున్న ఇంధన డిపోను రష్యా సుదూర క్షిపణులతో ధ్వంసం చేసింది. యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లు, రాడార్ స్టేషన్‌లు, ట్యాంకులను రిపేర్ చేసేందుకు వినియోగిస్తున్న ఓ ప్లాంట్‌పై దాడి చేసేందుకు క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక,తమ ఇంధన స్థావరాలను, ఆహార నిల్వలను.. రష్యా సైన్యం నాశనం చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యాపై దాడికి మరిన్నీ ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేసింది.
ALSO READ Elon Musk : ట్రంప్ బాటలో ఎలాన్ మస్క్..ట్విట్టర్ కు పోటీగా సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.