హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia : పుతిన్ సంచలన నిర్ణయం..ఆ దేశాల ప్రధానులపై రష్యా నిషేధం

Russia : పుతిన్ సంచలన నిర్ణయం..ఆ దేశాల ప్రధానులపై రష్యా నిషేధం

పుతిన్(ఫైల్ ఫొటో)

పుతిన్(ఫైల్ ఫొటో)

Russia Sanctions On Australia,New Zeland : అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

Russia Bans Australian And New Zealand PMs :  ఉక్రెయిన్ పై రష్యా 40 రోజులకు పైగా ముప్పెట దాడులకు పాల్పడుతుంది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ కు బాసటగా నిలుస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చే విధంగా అమెరికా,యూరప్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ దేశాలు..ఆ దేశంపై కఠిన ఆర్థిక ఆంక్షలను విధిస్తున్న సమయంలో...రష్యా కూడా తగ్గేదే లేదు అన్నట్లు ప్రతి చర్యలకు దిగుతోంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ప్రధానులపై గురువారం రష్యా నిషేధం విధించింది.ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, న్యూజిలాండ్‌ పీఎం జెసిండా ఆర్డెర్న్‌లు తమ దేశంలో ప్రవేశించడానికి వేళ్లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరితోపాటు ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది, న్యూజిలాండ్‌కు చెందని 130 మందితో కూడిన నిషేధితుల జాబితాను విడుదల చేసింది. త్వరలో ఆస్ట్రేలియన్ మిలిటరీ, వ్యాపారవేత్తలు, నిపుణులు, రష్యాకు వ్యతిరేకంగా ఉండే జర్నలిస్టులను కూడా బ్లాక్‌ లిస్ట్‌ లో పెడతామని తెలిపింది.

ALSO READ Plane Crash : ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన విమానం

మరోవైపు, యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చే విధంగా యూరోపియన్ యూనియన్(EU)సభ్య దేశాలు మళ్లీ సరికొత్త ఆంక్షలను విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరుపై దెబ్బకొట్టే ప్రయత్నాల్లో భాగంగా ఇకపై రష్యా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపై ఈయూ దేశాలు నిషేధం విధించాయి. ఆంక్షలలో 4 బిలియన్ యూరోల బొగ్గుతో పాటు మరిన్ని ఉత్పత్తులు ఉన్నాయి. యూరప్​ ఆర్థిక మాంద్యం భారిన పడుతుందని రష్యా ఇంధన వనరులపై ఆంక్షలను విధించే సాహసం ఇప్పటివరకు ఈయూ దేశాలు చేయలేదు. కానీ ప్రస్తుత నిర్ణయం ఓ కీలక పరిణామం.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Newzealand, Russia, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు