Russia Ukraine Crisis: పుతిన్ దళాలు కొన్ని వారాలుగా ఉక్రెయిన్ పై దాడికి తెగబడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు స్మశానదిబ్బలుగా మారిపోయాయి. ఇటు ఉక్రెయిన్ సైన్యం కూడా అంతే స్థాయిలో ప్రతి ఘటనను కనబరుస్తుంది. ఇప్పటికి ఉక్రెయిన్ దేశాన్ని.. రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకొలేక పోయింది. ప్రపంచ దేశాలు, నాటో దేశాలో ఉక్రెయిన్ కు (Ukraine)పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. దీంతో రష్యాను జెలెన్ స్కీ సైన్యం ఎదుర్కొంటున్నాయి.
ఒక వైపు చర్చలు జరుపుతూనే.. మరోవైపు , దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు పుతిన్ (vladimir Putin)యుద్దాన్మోదాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. అయినా.. పుతిన్ తన మారణహోమాన్ని మాత్రం ఆపటం లేదు. ఇప్పటికే కీవ్, మరియూపోల్,ఖర్కివ్, ఖేర్సన్, ఇర్ఫిన్ ను లోనిపలు భవనాలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు బాంబుల దాడులకు ధ్వంస మయ్యాయి.
దాదాపు.. 30 లక్షల మంది వరకు ఉక్రెయిన్ ను వదిలి వేరే దేశాలకు వలస పోయినట్లు తెలుస్తోంది. మరికొందరు జెలెన్ స్కీ పిలుపు మేరకు.. దేశం కోసం యుద్దంలో పాల్గొంటున్నారు. ఇటు పలు దేశాలు ఇప్పటికే రష్యాపై.. ఆర్థిక , వాణిజ్య, రవాణా తదితర అంశాలపై ఆంకలను విధించాయి. ఇప్పటికే మాస్టర్ కార్డ్, వీసా, నెట్ ఫ్లీక్స్ తదితర సంస్థలు తమ సేవలన నిలిపేశాయి. దీంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటు పుతిన్ మాత్రం వేరే దేశాలు జోక్యంచేసుకుంటే.. అణుదాడులకు కూడా వెనుకాడం అంటూ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో పలు దేశాలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. ఇక.. పుతిన్ తమ దేశానికి వ్యతిరేకంగా వార్త ప్రసారాలు చేస్తే వారికి జైలు శిక్ష అంటూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం.. రష్యన్లను కించపర్చినట్లు గానీ, ఇతర వీడియోలను ప్రసారం చేయకూడదు.
తాజాగా, గూగుల్ (Google)దాని అనుబంధ సంస్థ యూట్యూబ్ (Youtube)పై రష్య దేశానికి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్ లో, యూట్యూబ్ లో తమదేశానికి వ్యతిరేకంగా వీడియోలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించింది. యూట్యూబ్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆరోపించారు. గూగుల్,దాని అనుబంధ సంస్థలకు .. రష్యా వ్యతిరేక వార్తలను ప్రసారం చేయడం మానుకోవాలని రాస్కోమానాడ్జోర్ అనే సంస్థ వార్నింగ్ ఇచ్చింది.
ఇప్పటికే రష్యన్ దేశం యూట్యూబ్ కు నిధులను ఆపివేసింది. అదే విధంగా, ఫేస్ బుక్ (Face book),ట్విటర్,(Twitter)ఇన్ స్టాగ్రామ్ (Instagram Blocked) పాటు అనేక స్వతంత్ర మీడియాల యాక్సెస్ ను రష్యా ఇప్పటికే బ్లాక్ చేసింది. దీనిపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పలు దేశాలు.. పుతిన్ పత్రిక స్వేచ్చను హరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అదే విధంగా రష్యా దేశానికి చెందిన దిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడుతూ.. విదేశీ సోషల్ మీడియా సంస్థలపై (Social media platforms)తీవ్ర విమర్శలు చేశారు. అదే విధంగా,తమదేశం స్వంత సోషల్ మీడియాను అభివృద్ధి చేసుకునే సత్తా ఉందన్నారు. ఇక నైన ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు రష్యా వ్యతిరేక వార్తలు ప్రసారం చేయడం మానుకొవాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Facebook, Google, Russia, Russia-Ukraine War