హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Roti Cook: రోటీలు చేయడమే జాబ్.. వీరికి ఫుల్ డిమాండ్.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

Roti Cook: రోటీలు చేయడమే జాబ్.. వీరికి ఫుల్ డిమాండ్.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

Roti Academy: ఫుల్ టైమ్ రోటీ మేకర్‌కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. నెలకు లక్ష వరకు జీతం ఇస్తున్నారు. రోటీలు చేసే చెఫ్‌కు ఇక్కడ ప్రతిరోజు మూడున్నర వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు.

Roti Academy: ఫుల్ టైమ్ రోటీ మేకర్‌కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. నెలకు లక్ష వరకు జీతం ఇస్తున్నారు. రోటీలు చేసే చెఫ్‌కు ఇక్కడ ప్రతిరోజు మూడున్నర వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు.

Roti Academy: ఫుల్ టైమ్ రోటీ మేకర్‌కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. నెలకు లక్ష వరకు జీతం ఇస్తున్నారు. రోటీలు చేసే చెఫ్‌కు ఇక్కడ ప్రతిరోజు మూడున్నర వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు.

  వంట చేయడం ఒక కళ. ఒకప్పుడు ఇళ్లల్లో మహిళలు మాత్రమే వంట చేసే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పురుషులు కూడా గరిట తిప్పుతున్నారు. రెస్టారెంట్లలో చెఫ్‌లుగా పనిచేస్తూ.. యూట్యూబ్‌ (Youtube) ఛానెళ్లలో వంటలు చేస్తూ... బోలెడన్ని డబ్బులు సంపాదిస్తున్నారు. ఇటీవలి కాలంలో వంట చేసే వారికి డిమాండ్ పెరిగిపోయింది. లక్షల్లో జీతం ఇస్తున్నారు. అందుకే హోటల్ మేనేజ్‌మెంట్ (Hotel Management) కాలేజీలతోపాటు ఆ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఐతే హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఎన్నో రకాల వంటకాలను నేర్పిస్తారు. వంటను వేగంగా..రుచిగా వండడం ఎలాగో.. చిట్కాలు చెబుతారు. కానీ కేవలం రోటీల తయారీ నేర్పించడం కోసమే ప్రత్యేకంగా ఓ ఇన్‌స్టిట్యూట్ ఉందంటే మీరు నమ్ముతారా? అలాంటి ఇన్‌స్టిట్యూటే త్వరలో మలేషియాలో రాబోతోంది. ఈ అకాడమీలో అడ్మిషన్ తీసుకున్నవారికి రోటీలు ఎలా చేయలో నేర్పిస్తారు. రోటీల్లో ఉన్న రకాలు? వాటిని చేసే మెలకువల గురించి క్లాస్‌లు చెబుతారు.

  మసాజ్ కోసం వెళ్లి బట్టలు విప్పాడు..అమ్మాయి చేయి తగలగానే చనిపోయాడు.. ఏం జరిగింది?

  మలేసియా (Malaysia)కు చెందిన నెగెరీ సెంబలాన్ స్టేట్ ఎక్స్‌పో.. ఈ రోటీ మేకింగ్ అకాడమీ (Roti making academy) ప్రాతిపాదనను తీసుకొచ్చింది. దేశంలో ఇలాంటి అకాడమీ వస్తే బాగుటుందని అభిప్రాయపడింది. ఐతే ఈ ప్రపోజల్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి..? రోటీలు నేర్పించేందుకు అకాడమా? ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడైనా ఉందా అసలు..? అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం స్వాగతిస్తున్నారు. దేశంలో వ్యాపార, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.

  వంట చేయడం ఒక కళ. ఇప్పటి వరకు మీరు హోటల్ మేనేజ్‌మెంట్ క్లాస్ ఉన్న అనేక ఇన్‌స్టిట్యూట్‌ల గురించి చదివి ఉండాలి. దీనితో పాటు, మీకు వంట నుండి అనేక రకాల చిట్కాలు మరియు ట్రిక్స్ కూడా చెప్పబడ్డాయి. కానీ ఇప్పటి వరకు అటువంటి సంస్థ ఏర్పడలేదు, ఇందులో రొట్టెల తయారీ మాత్రమే నేర్పిస్తారు. అయితే ఇప్పుడు మలేషియాలో అలాంటి అకాడమీ ప్రతిపాదన ఒకటి వచ్చింది. ఈ అకాడమీలో అడ్మిషన్ తీసుకునే వారికి తక్షణమే రౌండ్-రౌండ్ రోటీ చేయడం నేర్పిస్తారు. అయితే, ఈ ప్రతిపాదన నుండి, వివాదాల పరంపర కూడా మొదలైంది.

  Kim jong un: వరుస మిస్సైల్ టెస్టులతో కిమ్ కలకలం - North Korea కొత్త ఆయుధాలను సమకూర్చుకుందా

  Aibang Terbang రెస్టారెంట్ యజమాని కమరుల్ రిజల్ ఈ ప్రతిపాదనలో ముఖ్యమైన సహకారం అందించారు. మలేసియాలో ఇలాంటి అకాడమీ ఉంటే చాలా బాగుటుందని ఆయన అంటున్నారు. రోటీని ఎలా తయారు చేయాలో ఈ అకాడమీ ద్వారా ప్రతి ఒక్కరికీ నేర్పించాలని స్టేట్ ఎక్సో ద్వారా కమరుల్‌ అభ్యర్థిస్తున్నారు. కమరుల్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మలేసియాలో ఫుల్ టైమ్ రోటీ మేకర్‌కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. నెలకు దాదాపు రూ.ఒక లక్ష వరకు జీతం ఇస్తున్నారు. రోటీలు చేసే చెఫ్‌కు ఇక్కడ ప్రతిరోజు మూడున్నర వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు.

  కమరుల్ రెస్టారెంట్ ఓనర్ అయినప్పటికీ.. స్వయంగా ఆయన కూడా రోటీలు తయారు చేస్తారు. ఈయన రెస్టారెంట్‌లో ప్రతి రోజు ఐదు వందల రోటీలు అమ్ముడవుతాయి. ఇక శని, ఆది వారాల్లో వీటి సంఖ్య ఏడు వందలు దాటుతుంది. కమరుల్ 14 ఏళ్ల వయసు నుంచీ రెస్టారెంట్‌లలో రోటీ మేకర్‌గా పనిచేశాడు. ఎన్నో కష్టనష్టాల తర్వాత ఇప్పుడు సొంతంగా ఓ రెస్టారెంట్ తెరిచి.. అదే రోటీల తయారీ పని చేస్తున్నారు. రోటీలు తయారు చేయడం ద్వారా.. నెలలో లక్ష రూపాయల వరకు ఈజీగా సంపాదించవచ్చని ఆయన చెబుతున్నారు.

  రోటీ మేకింగ్ అకాడమీని ప్రారంభిస్తే ప్రజల భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని కమరుల్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రోటీల బిజినెస్‌కు ఇక్కడ చాలా స్కోప్ ఉందని.. తద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు. రోటీలు చేయడంలో నైపుణ్యం పొందిన వారు.. భవిష్యత్తులో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశముందని చెబుతున్నారు. మొత్తంగా ఈ రోటీ తయారీ అకాడమీ మాత్రం మలేషియాలో హాట్ టాపిక్‌గా మారింది.

  First published:

  Tags: International, International news, Malaysia