హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

బాగ్దాద్‌ ఎయిర్‌పోర్టుపై రాకెట్ల దాడి... టెన్షన్ టెన్షన్...

బాగ్దాద్‌ ఎయిర్‌పోర్టుపై రాకెట్ల దాడి... టెన్షన్ టెన్షన్...

బాగ్దాద్‌ ఎయిర్‌పోర్టుపై రాకెట్ల దాడి... (credit - twitter - Strategic News)

బాగ్దాద్‌ ఎయిర్‌పోర్టుపై రాకెట్ల దాడి... (credit - twitter - Strategic News)

ఇటీవల ఇరాక్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. వరుస దాడులు జరుగుతున్నాయి. ఏకంగా ఎయిర్‌పోర్టుపైనే రాకెట్ల దాడి జరగడం తీవ్ర అలజడి రేపుతోంది.

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌‌లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. అసలే ఆ దేశం నిత్యం అల్లర్లలో అట్టుడుకుతూ ఉంటుంది. తాజాగా... ఎటు నుంచీ వచ్చాయోగానీ... మూడు రాకెట్లు... దూసుకొచ్చి... రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై పడ్డాయి. శుక్రవారం ఇంకా పూర్తిగా తెల్లారకముందే ఈ దాడి జరిగింది. ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది ఈ ఘటనలో చనిపోయారు. రెండు కార్లు కాలిబూడిదయ్యాయి. ఇరాన్‌ నిఘా విభాగాధిపతి ఖాసీం సొలెమన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. విమానాశ్రయ కార్గో హాల్‌ను మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఐతే... దాడి ఎవరు చేశారన్నది ఇంకా తేలలేదు.

రెండు రోజుల కిందటే... ఇరాన్ మద్దతుతో కొందరు నిరసనకారులు ఇరాక్‌లోని అమెరికా ఏంబసీ (దౌత్య కార్యాలయం)పై దాడి చేశారు. అంతే రెండు దేశాల మధ్య పరిస్థితి భగ్గుమంటోంది. ఆ దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌... వెంటనే ఇరాక్‌కు అదనపు బలగాల్ని పంపారు. ఇంతలో రాకెట్ల దాడి జరగడంతో... దీని వెనక ఇరాన్ ఉండి ఉండొచ్చన్న అనుమానం కలుగుతోంది.

సమస్యేంటంటే... ఈ రెండు దేశాలూ దెబ్బలాడుకుంటే... ప్రపంచ దేశాలకు సమస్య. ఎందుకంటే ఇవి ఆయిల్ రిచ్ కంట్రీస్. వీటి మధ్య యుద్ధాల వల్ల... ప్రపంచ దేశాలకు చమురు కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

First published:

Tags: Breaking news, International, Telugu varthalu

ఉత్తమ కథలు