హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

రోబో కుక్కలు.. అమెరికా మిలటరీలో శక్తివంతమైన సైనికులు

రోబో కుక్కలు.. అమెరికా మిలటరీలో శక్తివంతమైన సైనికులు

రోబో కుక్కలు.. అమెరికా మిలటరీలో శక్తివంతమైన సైనికులు

రోబో కుక్కలు.. అమెరికా మిలటరీలో శక్తివంతమైన సైనికులు

రోబోట్ కుక్కలను విజన్ 60 యుజివిలు లేదా "స్వయంప్రతిపత్త మానవరహిత గ్రౌండ్ వెహికల్స్" అని పిలుస్తారు, వీటిని ఘోస్ట్ రోబోటిక్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా తయారు చేసింది.

అమెరికా వైమానికదళం సరికొత్త రక్షణ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. యుఎస్ సైనిక ఆస్తులకు రక్షణగా నిలిచి, శత్రు దాడుల సమాచారాన్ని చేరవేసే రోబోట్ కుక్కలను యుద్ధ క్షేత్రంలో ఉపయోగించనున్నారు. ఇటీవల వీటిని అడ్వాన్సుడ్ బ్యాటిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్సర్‌సైజ్‌లో ప్రదర్శించారు. నాలుగు కాళ్ల రోబోట్ కుక్కలు మొజావే ఎడారిలోని ఒక వైమానిక క్షేత్రంలోకి దూసుకెళ్లి భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు మార్గనిర్ధేశం కానున్నాయి. గత వారమే రోబోట్ కుక్కలను యుఎస్ మిలిటరీ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. యూఎన్ ఎయిర్ ఫోర్స్ శత్రు వైమానిక దళంలోకి ఎగురుతూ, రోబోట్ కుక్కలను విమానం నుంచి బయటకి పంపంచి స్కౌట్ చేస్తూ వీటిని పరీక్షించింది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డాటా అనలిటిక్స్ ఆధారంగా ఇది పనిచేస్తాయి. క్షిపణులు లేదా ఇతర మార్గాలల్లో శత్రు దేశాలు యుఎస్ మాతృభూమిపై చేసే దాడులను పసిగట్టి, సమాచారాన్ని చేరవేస్తాయి. భవిష్యత్ యుద్ధభూమిలో, శత్రువుతో సమర్థవంతంగా పోరాడటానికి ఎంతో ఉపయోగపడతాయి.

‘‘అత్యవసరమైన యద్దాల్లో శత్రువులను వేగంగా అంచనా వేయడం తదుపరి తరం యుద్ధానికి కీలకం" అని యూఎస్ వైమానిక దళం వార్తా ప్రకటనలో తెలిపింది. తాజాగా చేపట్టిన ఎబిఎంఎస్ ప్రదర్శన ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకు జరిగింది. దీనిలో యుఎస్ మిలిటరీలోని ప్రతి శాఖలో, కోస్ట్ గార్డ్తో పాటు, పరిశ్రమకు చెందిన డజన్ల కొద్దీ జట్లు పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనలో భాగంగా మాస్టర్ సార్జంట్ మాట్లాడుతూ "కుక్కలు మాకు ఈ ప్రాంతం యొక్క విజువల్స్ ఇస్తాయి, ఇవన్నీ మా రక్షకులను విమానానికి దగ్గరగా ఉంచుతాయి" అని అన్నారు. రోబోట్ కుక్కలను విజన్ 60 యుజివిలు లేదా "స్వయంప్రతిపత్త మానవరహిత గ్రౌండ్ వెహికల్స్" అని పిలుస్తారు, వీటిని ఘోస్ట్ రోబోటిక్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా తయారు చేసింది.

ఈ రోబోట్ ఏదైనా భూభాగం లేదా వాతావరణంలో పనిచేసే వారి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. "మేము డిజైన్ చేసిన రోబోట్లు ఇతర రోబోట్లతో పోల్చినప్పుడు మెరుగ్గా వేగంగా పనిచేస్తాయి. సంక్లిష్టతను తగ్గించడం ద్వారా, మేము సహజంగా మన్నిక, చురుకుదనం మరియు ఓర్పును మెరుగుపరుస్తాం’’ అని కంపెనీ తన వెబ్సైట్లో పేర్కొంది. కాగా మొదటగా ఈ రోబోట్స్ని నెవాడాలోని నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద పరీక్షించారు. వీటిని "ఎలా ఉపయోగించాలో మేము అన్వేషిస్తున్నాము. అన్ని యుద్ధ ప్రదేశాల్లో వేగంతో మరియు ముప్పులో ఉన్న షూటర్లకు సెన్సార్లను అనుసంధానించడానికి, సమాచాన్ని వేగంగా చేరవేయడం, యుద్దంలో పోరాడటానికి మరియు గెలవడానికి ఈ రోబోట్ల అవసరం ఎంతో ఉంది" అని చీఫ్ జాన్ రేమండ్, స్పేస్ ఆపరేషన్స్ చీఫ్, ఎయిర్ఫోర్స్ తెలిపింది ."మా యుద్ధ యోధులు గెలవడానికి ఇంటర్నెట్ వేగంతో పోరాడాల్సి ఉంటుంది" అని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ చార్లెస్ బ్రౌన్ జూనియర్ అన్నారు.

First published:

Tags: America, USA

ఉత్తమ కథలు