Robert Mugabe Died:జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత..

Robert Mugabe Died : ఉద్యమ నాయకుడిగా మొదలైన ఆయన జీవితం నియంతగా ముగిసిపోయింది. తన రెండో భార్య గ్రేస్‌ను అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించి చివరకు సైన్యం చేత గద్దె దించబడ్డాడు.

news18-telugu
Updated: September 6, 2019, 12:32 PM IST
Robert Mugabe Died:జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత..
రాబర్ట్ ముగాబే(File Photo)
  • Share this:
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (95) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.ముగాబే మృతిని ప్రస్తుత జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వా అధికారికంగా ప్రకటించారు. ఆఫ్రికన్ దేశాల విముక్తికై,
అక్కడి ప్రజల హక్కులకై పోరాడిన ముగాబే మృతి తీరని లోటు అని ఆయన విచారం వ్యక్తం చేశారు.కాగా, జింబాబ్వేను ఏకఛత్రాధిపత్యంతో 37 ఏళ్లు పాలించిన ముగాబే పాలనకు 2017లో తెరపడింది.ఉద్యమ నాయకుడిగా మొదలైన ఆయన జీవితం నియంతగా ముగిసిపోయింది. తన రెండో భార్య గ్రేస్‌ను అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించి చివరకు సైన్యం చేత గద్దె దించబడ్డాడు.ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జాను ఎఫ్ పార్టీకి చెందిన ఎమర్సన్ నంగాగ్వా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.


Published by: Srinivas Mittapalli
First published: September 6, 2019, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading