Online Classes: ఆన్‌లైన్ క్లాసు జరుగుతుండగా చొరబడిన దొంగలు... వైరల్ వీడియో

Online Zoom Classes: ఈమధ్య అన్నీ ఆన్‌లైన్ అవుతున్నాయి కదా. విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో ఓ క్లాసులో జరిగిందో చిత్రం. అదేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 9, 2020, 8:19 AM IST
Online Classes: ఆన్‌లైన్ క్లాసు జరుగుతుండగా చొరబడిన దొంగలు... వైరల్ వీడియో
ఆన్‌లైన్ క్లాసు జరుగుతుండగా చొరబడిన దొంగలు... వైరల్ వీడియో (credit - youtube)
  • Share this:
దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్ పేరు వినే ఉంటారు. ఆ దేశంలో జరిగిందీ దొంగల దాడి. అక్కడి విద్యార్థులకు జూమ్‌లో క్లాస్ జరుగుతోంది. విద్యార్థులంతా... ఎవరి ఇళ్లలో వారు ఉంటూ... ఆన్‌లైన్ పాఠం వినడంలో నిమగ్నమయ్యారు. ఇంతలో... ఓ ఇంట్లో నలుగురు ముసుగు దొంగలు చొరబడ్డారు. లోపల పాప మారియా జోస్ తప్ప ఎవరూ లేరు. జూమ్ యాప్ ద్వారా పాప పాఠాలు వింటోంది. "ఏయ్... చుప్... అంటూ పాపను బెదిరించి... ల్యాప్‌టాప్ మూసేశారు." అప్పటికే... ఈ దొంగలు వచ్చిన దృశ్యాల్ని మిగతా 25 మంది విద్యార్థులు జూమ్‌లో చూశారు. "వామ్మో దొంగలు, దొంగలు" అని విద్యార్థులు అంటుంటే... టీచర్ కూడా... "అవునవును" అనుకుంటూ అలర్ట్ అయ్యారు. దొంగలు గబగబా ఇల్లంతా చిందరవందర చేసి... విలువైన వస్తువుల్ని పట్టుకుపోయారు. వెళ్తూ... వెళ్తూ... ఆ ల్యాప్‌టాప్ కూడా పట్టుకుపోయారు. పాప ఏడవసాగింది.

ఈలోగా టీచర్... "మారియా ఇంటి అడ్రెస్ ఎవరికైనా తెలుసా?" అని అడిగితే... ఓ స్టూడెంట్ స్పందించి... "ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్ ఇవ్వడంతో... ఆ టీచర్... వెంటనే పోలీసులకు కాల్ చేసి... ఫలానా ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పారు. మీకెలా తెలుసు అని అడిగితే... జూమ్ క్లాస్ మేటర్ చెప్పారు. వెరీగుడ్... సూపర్ అంటూ పోలీసులు... వేగంగా ఇంటికి వెళ్లారు. పాప ఏడుస్తూ కనిపించింది. మొత్తం విషయం వాళ్లకు చెప్పింది. "డోంట్ వర్రీ... నీ ఆన్‌లైన్ క్లాసులు బ్రేక్ అవ్వనివ్వం. నీ ల్యాప్‌టాప్ నీకు తెచ్చి ఇస్తాం" అని మాట ఇచ్చారు. అన్నట్లుగానే... కంట్రోల్ రూంకి ఫోన్ చేసి... టెక్నికల్ అసిస్టెంట్ ఏం చేస్తున్నాడని అడిగితే... ఏదో గేమ్ ఆడుతున్నాడని పోలీసులు చెప్పారు. దాన్ని పక్కన పెట్టి... ఓ రెండు మొబైళ్లు ఎక్కడున్నాయో కనిపెట్టమని నంబర్లు ఇచ్చారు. ఆ రెండు మొబైళ్లూ... పాప ఇంట్లో వాళ్లవి.


ఇతర వస్తువులతోపాటూ... మొబైళ్లను ఎత్తుకుపోతున్న దొంగలు... ఏ రూట్లో వెళ్తున్నదీ... టెక్నికల్ అసిస్టెంట్‌కి తెలిసిపోయింది. వెంటనే అటువైపు ఉన్న పోలీసులకు అలర్ట్ పంపారు. అక్కడి పోలీసులు... దారిలోనే దొంగల్ని పట్టుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేశారు. అరెస్టవుతూ ఆ దొంగల్లో ఒకడు... "నేను చెప్పానా... జూమ్ క్లాసులో మనల్ని చూసేశారని" అన్నాడు. "ఓకే... మనం అలా దొరికిపోయామా" అని మిగతా దొంగలు నోరెళ్లబెట్టారు.
Published by: Krishna Kumar N
First published: September 9, 2020, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading