Road Accidents: 3 రోజుల్లో 2 రోడ్డు ఘోర ప్రమాదాలు... 70 మందికి పైగా మృతి

3 రోజుల్లో 2 రోడ్డు ఘోర ప్రమాదాలు... 70 మందికి పైగా మృతి (image credit - twitter)

Road Accidents: రోడ్డు ప్రమాదాలు ప్రాణాల్ని పట్టుకుపోతున్నాయి. అప్పటివరకూ ప్రయాణం చేస్తున్న వారు... మరుక్షణంలో... మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. ఈ రెండు ప్రమాదాలు ఎలా జరిగాయి?

  • Share this:
    Road Accidents: ఆఫ్రికా ఖండంలోనే ఈ రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. తాజాగా మాలీ దేశంలో... సెగో పట్టణానికి 20 కిలోమీటర్ల దూరలో ఓ ప్రమాదం జరిగింది. ఇందులో కూలీలతో వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో లారీ అదుపు తప్పింది... అడ్డదిడ్డంగా వెళ్తూ... ప్రయాణికులతో ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర విషాదంలో 41 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. తుక్కుతుక్కైంది.

    ఈ ప్రమాదం అత్యంత వేగంగా జరగడంతో... ప్రయాణికులు, కూలీలు ఎగిరి పడ్డారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి. చాలా మందికి శరీర భాగాలు విరిగిపోయాయి. ఆ ప్రాంతం అత్యంత విషాదంగా మారింది.



    దీని కంటే ముందు మరో ఘోర ప్రమాదం జరిగిది. ఇంధనం లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొంది. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో‌లో శనివారం రాత్రి జరిగింది. వాహనాలు ఢీకొన్న సమయంలో వచ్చన మంటలు.. బాధితులను చుట్టుముట్టినట్టుగా స్థానిక పోలీస్ కెప్టెన్ ఆంటోయిన్ పులులు చెప్పారు. మంటలు చెలరేగడంతో మృతదేహాలు చాలావరకు ధ్వంసం అయ్యాయని, వెలికి తీసిన అవశేషాలను సోమవారం ఖననం చేసినట్టుగా మరో పోలీసు అధికారి చెప్పారు.

    ఇది కూడా చదవండి: PMSMY Pension Scheme: రోజూ రూ.2 జమ చెయ్యండి... రూ.36,000 పెన్షన్ పొందండి

    కాంగో రాజధాని కిన్షాసకు 80 కిలోమీటర్ల దూరంలో నేషనల్‌ రూట్‌లో కిబుబా గ్రామ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కాంగోలో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి. భద్రతా నియమాలు పాటించకుండా పాత వాహనాల్నే రోడ్లపై నడుపుతుండటంతో ఇలా జరుగుతోంది. కాంగోలో.. 2018లో జరిగిన అయిల్ ట్యాంకర్ ప్రమాదంలో 53 మంది మరణించారు. 2010లో ట్యాంకర్, ట్రక్ ఢీకొన్న ఘటనలో 230 మందికి పైగా మృతిచెందారు.
    Published by:Krishna Kumar N
    First published: