యూకే ఫైనాన్స్ మినిస్టర్‌గా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు...

యునైటెడ్ కింగ్ డమ్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ పేరును ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఖరారు చేశారు.

news18-telugu
Updated: February 13, 2020, 6:32 PM IST
యూకే ఫైనాన్స్ మినిస్టర్‌గా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు...
రిషి సునక్ (File)
  • Share this:
యునైటెడ్ కింగ్ డమ్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ పేరును ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఖరారు చేశారు. రిషి సునక్ తండ్రి డాక్టర్, ఫార్మాసిస్ట్. సునక్ వయసు 39 సంవత్సరాలు. 2009 సంవత్సరంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి సునక్ జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ (PPE) చదువుకున్నారు. ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అక్షతతో ఆయనకు స్టాన్‌ఫర్డ్‌లోనే పరిచయం ఏర్పడింది. రాజకీయాల్లోకి రాకముందు రిషి సునక్ పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ ఓ డైరెక్టర్.





నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ ఎంపీ విలియం హేగ్ దిగిపోతున్నట్టు 2014లో ప్రకటించారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ తమ అభ్యర్థిగా సునక్‌‌ను బరిలో దింపింది. 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా వ్యవహరించారు. అప్పటి ప్రధానమంత్రి థెరిసా మే నిర్ణయానికి మద్దతు పలికారు. ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతున్నట్టు ప్రకటించడంతో కొత్త ప్రధానిగా జాన్సన్‌కు జై కొట్టారు.
First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు