హాలీవుడ్ (Hollywood) ప్రసిద్ధ గాయకుడు రికీ మార్టిన్ (Ricky Martrin) ప్రస్తుతం అతి పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. 21 ఏళ్ల మేనల్లుడిపై లైంగిక దాడి మరియు గృహ హింసకు పాల్పడినట్టు ఆయనపై కేసు నమోదైంది. ఆయన మేనల్లుడే రికీపై ఈ ఆరోపణలు చేశాడు. ఈ వార్త బయటకు రావడంతో మార్టిన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, రికీ మార్టిన్ తన లాయర్ ద్వారా తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ అసత్యమని తెలిపాడు. మార్టిన్ న్యాయవాది కూడా ఈ ఆరోపణలను ఖండించారు. ఇలాంటి లైంగిక/శృంగార సంబంధం గురించి మాట్లాడటం తప్పు మాత్రమే కాకుండా "అసహ్యకరమైనది" అని కూడా చెప్పాడు. రికీ మార్టిన్ అభియోగాలు రుజువైతే ప్యూర్టో రికోలో ఈ సింగర్ కు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
రికీ మార్టిన్ అతని మేనల్లుడిపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలు రావడంతో.. జూలై ప్రారంభంలో ప్యూర్టో రికోలో నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. రికీ మార్టిన్ 21 ఏళ్ల మేనల్లుడు ఎరిక్ మార్టిన్ ను బాధితుడిగా గా గుర్తించినట్లు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ TMZ శుక్రవారం నివేదించింది. అయితే.. రికీ మేనల్లుడు తీవ్ర మానసిక సమస్యలతో బాధపడతున్నాడని.. అందుకే ఈ ఆరోపణలు చేశాడని ఆయన లాయర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక తనపై వస్తున్న ఆరోపణలపై రికీ మార్టిన్ తన లాయర్ ద్వారా ఇలా స్పందించారు.. "రికీ మార్టిన్.. తన మేనల్లుడితో లైంగిక లేదా శృంగార దాడి చేశాడన్నది అసత్యం. ఈ ఆరోపణ అబద్దం మాత్రమే కాదు.. అసహ్యకరమైంది కూడా. రికీ మేనల్లుడు తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే ఈ ఆరోపణలు చేశాడు. అతనికి మంచి వైద్య చికిత్స అందుతుందని ఆశిస్తున్నాం. అయితే అన్నింటికంటే మించి.. న్యాయస్థానం వాస్తవాలను పరిశీలించిన వెంటనే ఈ కేసును కొట్టివేయాలని మేము కోరుతున్నాం. " అని తెలిపారు.
జులై 21న నిర్ణయం
ప్యూర్టో రికన్ మీడియా అవుట్‌లెట్ ఎల్ వోసెరో.. మార్టిన్ ఏడు నెలల పాటు అతని మేనల్లుడితో డేటింగ్ చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత ఈ డేటింగ్ కు బ్రేక్ చెప్పాలని మేనల్లుడు కోరాడని.. అందుకు రికీ మార్టిన్ ఒప్పుకోలేదని తెలిపింది. అంతేకాకుండా.. తన మేనల్లుడి ఇంటి దగ్గర రికీ మార్టిన్ చాలా సార్లు కన్పించాడని తెలిపింది. TMZ ప్రకారం.. జూలై 21న మార్టిన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ రోజే తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. రికీ మార్టిన్ కు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ప్యూర్టో రికన్ లో పుట్టిన మార్టిన్.. సింగర్, పాటల రచయిత మరియు నటుడు. హాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అనేక సినిమాల్లో కూడా నటించాడు. తన కెరీర్ లో 200కు పైగా అవార్డులు సాధించాడు. అలాగే, రెండు గ్రామీ అవార్డులు కూడా ఉన్నాయి. అలాగే.. ఐదు లాటిన్ గ్రామీ అవార్డులు కూడా మార్టిన్ సొంతం. ఈ ఆరోపణలు తర్వాత రికీ మార్టిన్ ఇమేజ్ ఒక్కసారిగా దెబ్బతింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.