Richard Branson: రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్లలేదు.. ప్రముఖ శాస్త్రవేత్త వాదన.. ఎందుకో తెలుసా..

రిచర్డ్ బ్రాన్సన్, నీల్ డి గ్రాస్సే టైసన్ (Image : twitter)

ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తిగా గత వాతం చరిత్ర సృష్టించారు కోటీశ్వరుడైన రిచర్డ్ బ్రాన్సన్. ప్రపంచ కుబేరులందరూ అంతరిక్ష యానంపై కన్నేసినప్పటికీ, అందరి కంటే ముందుగా బ్రాన్సన్ ఈ రికార్డు సాధించారు. అయితే ఆయన అసలు అంతరిక్షంలోకి వెళ్లలేదని చెబుతున్నారు ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిస్ట్, శాస్త్రవేత్త, సైన్స్ కమ్యూనికేటర్ అయిన నీల్ డి గ్రాస్సే టైసన్.

  • Share this:
ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తిగా గత వాతం చరిత్ర సృష్టించారు కోటీశ్వరుడైన రిచర్డ్ బ్రాన్సన్. ప్రపంచ కుబేరులందరూ అంతరిక్ష యానంపై కన్నేసినప్పటికీ, అందరి కంటే ముందుగా బ్రాన్సన్ ఈ రికార్డు సాధించారు. అయితే ఆయన అసలు అంతరిక్షంలోకి వెళ్లలేదని చెబుతున్నారు ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిస్ట్, శాస్త్రవేత్త, సైన్స్ కమ్యూనికేటర్ అయిన నీల్ డి గ్రాస్సే టైసన్. బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన ప్రదేశం.. అసలైన అంతరిక్షం కాదని ఆయన వాదిస్తున్నారు. టైసన్ న్యూయార్క్‌లోని రోజ్ సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ స్పేస్‌లో హేడెన్ ప్లానిటోరియం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రిచర్డ్ బ్రాన్సన్ అసలైన అంతరిక్షంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. వారు సబ్ ఆర్బిటాల్‌ స్పేస్ వరకు మాత్రమే చేరుకున్నారని చెప్పారు.

ప్రస్తుత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి ఒక సెంటీమీటర్ ఎత్తులో ఉన్నట్లు భావిస్తే.. చంద్రుడు భూమికి 10 మీటర్ల దూరంలో ఉంటాడని టైసర్ వివరించారు. ఈ లెక్క ప్రకారం చూస్తే రిచర్డ్ బ్రాన్సన్ వెళ్లిన దూరం.. భూ ఉపరితలం నుంచి కేవలం రెండు మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుందని విశ్లేషించారు. ఈ కక్ష్యలోకి వెళ్లడానికి బ్రాన్సన్‌కు ఎనిమిది నిమిషాల సమయం పట్టింది. కానీ చంద్రుడిని చేరుకోవడానికి మాత్రం మూడు రోజులు పడుతుందని, అందువల్ల అసలు అంతరిక్షం అనేది ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని చెప్పారు. అయితే ఆ దూరాన్ని కూడా అంతరిక్షం అని పిలిస్తే.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సగటు మానవులు ఎవరూ ఇప్పటి వరకు అంత ఎత్తుకు వెళ్లనందున.. ఇది ఒక ఘనతేనని చెప్పుకొచ్చారు.

వాస్తవానికి అంతరిక్షానికి సరిహద్దులు అనేవి లేవు. అయితే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ సంస్థ స్పేస్ బోర్డర్స్‌ను నిర్వచించడానికి ప్రయత్నించింది. అవుటర్ స్పేస్ ప్రారంభమయ్యే రేఖను కర్మన్ లైన్ లేదా వాన్ కర్మన్ లైన్‌గా గుర్తించింది. ఇది భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. అయితే రిచర్డ్ బ్రాన్సన్, అతడి బృందం మాత్రం కేవలం 86 కిలోమీటర్ల ఎత్తుకు మాత్రమే చేరుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుతం టైసన్ ప్రస్తావిస్తున్నారు.
Published by:Veera Babu
First published: