Virgin Galactic space flight: అంతరిక్షానికి వెళ్లాలనుకుంటారా? ఒక్క టికెట్ రూ.3 కోట్లు.. ఫ్రీగా కూడా వెళ్లొచ్చు.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

Virgin Galactic space flight ticket:సామాన్యులు రూ.3 కోట్లు పెట్టి అంతరిక్షంలోకి వెళ్లడం సాధ్యం కాదు. కేవలం సంపన్నులకు మాత్రమే ఈ యాత్ర చేయగలు. ఐతే ఆ డబ్బు ఖర్చు చేయకుండా ఉచితంగా కూడా అంతరిక్షంలోకి వెళ్లే మార్గం ఉంది.

 • Share this:
  హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లినంత ఈజీగా ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజులు వచ్చేశాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు బండ్ల శిరీష, మరో నలుగురు రోదసియానం చేశారు. ఆ తర్వాత అమెజాన్ సీఈవో జెఫ్ బోజోస్ తన టీమ్‌తో కలిసి అంతరిక్ష యానం చేశారు. వీరిద్దరి ప్రయాణం తర్వాత అంతరిక్షయానంపై చాలా మందికి ఆసక్తి పెరిగింది. ఐతే ఇప్పుడు ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్లవచ్చు. కానీ అందుకు భారీగా డబ్బులు ఖర్చవుతాయి. అంతరిక్ష విహారయాత్రపై వర్జిన్ గెలాక్టిక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. టూర్‌కు సంబంధించి టికెట్ ధరలను ఖరారు చేసింది. అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఒక్క సీటుకు 4,500 అమెరికన్ డాలర్లు చెల్లించాలని తెలిపింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.3 కోట్ల పైనే అన్నమాట.

  చరిత్రాత్మక రోదసీయాత్రను విజయవంతంగా పూర్తిచేసిన కొన్ని వారాల తర్వాత... అంతరిక్ష విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్‌ తెలిపారు. అంతరిక్ష విహాయాత్రకు సంబంధించి మూడు ప్యాకేజీలను ప్రకటించారు. సింగిల్ సీట్, మల్టీ-సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బై అవుట్ ఆఫర్లు ఉన్నాయని వెల్లడించారు. వర్జిన్ గెలాక్టిక్ తదుపరి అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉంటుందని కంపెనీ తెలిపింది. 2022లో మరిన్ని కమర్షియల్ స్పేస్ ఫ్లైట్స్‌ను ప్రారంభించే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొంది. తాజా ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లాయి. అంతరిక్షంలోకి స్పేష్ ఫ్లైట్స్‌ను నడిపేందుకు ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్‌కు అమెరికాకు చెందిన ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీచేసిన విషయం తెలిసిందే.

  సామాన్యులు రూ.3 కోట్లు పెట్టి అంతరిక్షంలోకి వెళ్లడం సాధ్యం కాదు. కేవలం సంపన్నులకు మాత్రమే ఈ యాత్ర చేయగలు. ఐతే ఆ డబ్బు ఖర్చు చేయకుండా ఉచితంగా కూడా అంతరిక్షంలోకి వెళ్లే మార్గం ఉంది. అదెలాగంటే.. వర్జిన్ గెలాక్టిక్ తమ మొదటి కమర్షియల్ ఫ్లైట్‌లో రెండు టికెట్లను ఉచితంగానే ఇవ్వనుంది. అందుకోసం ఆన్‌లైన్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఉచితంగా టికెట్లు కావాలనుకునే వారు omaze.com/space వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రెండు విధాలుగా పాల్గొనవచ్చు.  ఏదైనా మంచి పని కోసం విరాళం ఇచ్చి కాంటెస్ట్‌లో పోటీ చేయవచ్చు, లేదంటే  ఇవేమీ లేకుండానే నేరుగా కూడా పాల్గొనవచ్చు.

  ఇలా రిజిస్ట్రర్ చేసుకోండి.

  ముందుగా omaze.com/space వెబ్‌సైట్లోకి వెళ్లి ఎంటర్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

  అక్కడ డొనేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. 5 డాలర్ల విరాళానికి 5 ఎంట్రీలు, 10 డాలరకు 20 ఎంట్రీలు.. ఇలా 150 డాలర్లకు 2000వేల ఎంట్రీలు వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి.

  ఒకవేళ విరాళమేమీ ఇవ్వకుండానే పాల్గొనాలనుకుంటే..Enter Without Contributing ఆప్షన్ క్లిక్ చేయాలి. అనంతరం దరఖాస్తు ఫారం నింపాలి.

  మీ పేరు, ఈమెయిల్ ఐడీ, చిరునామా వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ ఎంట్రీ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒక్క వ్యక్తి గరిష్ఠంగా 6వేలకు ఎంట్రీ చేయవచ్చు. ఎక్కువ సార్లు ఎంట్రీ చేసుకున్న వారికి టికెట్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

  దరఖాస్తులకు ఆఖరి తేది సెప్టెంబరు 2. ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకోరు. దరఖాస్తుదారుడు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని ఉండాలి. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ అంతరిక్ష యాత్రకు అర్హులు. Omaze సంస్థకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది కాంటెస్ట్‌లో పాల్గొనలేరు. సెప్టెంబరు 2 తర్వాత వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ ద్వారా ఇద్దరిని ఎంపికి చేసి వారికి ఉచిత టికెట్లను పంపిస్తారు. మీరు అదృష్టవంతులైనే మీకే ఆ టికెట్ దక్కవచ్చు.

  ఇవి కూడా చదవండి:

  Viral Meme: రూ.38 లక్షలకు అమ్ముడుపోయిన మీమ్.. ఇంతకీ అందులో ఏముందంటే..


  Russia: భారత్ కు రష్యా మొండి చేయి.. ఆఫ్ఘనిస్తాన్ పై చర్చకు మూడు దేశాలకు రష్యా ఆహ్వానం

  Published by:Shiva Kumar Addula
  First published: